మోడీ రైతు పక్షపాతి

-మెట్ట పంటలు మద్దతు ధర భారీగా పెంచినందుకు మోడీ కి ధన్యవాదాలు
-సంగారెడ్డి జిల్లాలో మెట్ట పంటలు ఎక్కువ
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప

వారి ధాన్యంతో పాటు మెట్ట పంటలైన పత్తి, సోయా, కందులు, పెసర, మినుములు, మక్కల మద్దతు ధరను భారీగా పెంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జెనవాడే సంగప్ప ధన్యవాదములు తెలిపారు. మోడీ రైతు పక్షపాతి అనేందుకు ఈ ఉదాహరణ చాలదా అని ఆయన ప్రశ్నించారు. మోడీ ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోకముందు రైతులు పండించే పంటలకు సరైన మద్దతు ధర లేక రోడ్లమీద పారేసుకునే పరిస్థితి ఉండేదని, అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి ఉండేదని ఆయన అన్నారు.మోడీ వచ్చాక అన్ని పంటలకు మద్దతు ధర దాదాపు 80% నుంచి 100% పెరిగిందని చెప్పారు.

సంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా మెట్ట పంటలైన పత్తి, సోయా, కంది, పెసలు, మినుములు పందిస్తారని సంగప్ప పేర్కొన్నారు. మెట్ట పంటల ధరను భారీ స్థాయిలో పెంచి ఇక్కడి రైతులకు మోడీ అండగా నిలబడ్డారు ఆయన చెప్పారు. ఇప్పటికే ఎరువుల సబ్సిడీ సబ్సిడీ కింద ప్రతి ఎకరాకు రూ 20వేలు కేంద్ర ప్రభుత్వం రైతుకు మేలు చేస్తుందని, ప్రధానమంత్రి కిసాన్ సన్మానిధి ద్వారా రూ 6 వేల ఆర్థిక సాయం అందిస్తుందని సంగప్ప గుర్తు చేశారు.

కేసీఆర్ కేవలం పదివేల రైతుబంధు ఇచ్చి అన్ని రకాలుగా రైతుకు మోసం చేస్తున్నారని ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని ఆయన ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరాంచ నల్ల పోచమ్మ, చల్లగిద్ద తాండా భవాని మాత దేవాలయాల్లో సంగప్ప ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బోరంచ, నాగూర్ లో జరిగిన పలు శుభ కార్యాలకు హాజరయ్యారు. సంగప్ప వెంట నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, సీనియర్ నాయకులు సాయిరాం, సంజుపాటిల్, రాజు గౌడ్, గోపాల్ రెడ్డి ఉన్నారు.

మాద్వార్ తండాలో సంగప్ప పరామర్శ
నారాయణఖేడ్ మండలం మాధ్వార్ తాండా లో వడిత్యా రమేష్ ను బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి జనవాడే సంగప్ప పరామర్శించారు. ఇటీవల రమేష్ కుమారుడు ట్రాక్టర్ ప్రమాదం లో చనిపోయాడు. చాలా చిన్న వయసులో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని సంగప్ప అన్నారు. రమేష్ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆయన కోరారు. సంగప్ప వెంట బిజెపి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు బన్సీలాల్, నారాయణఖేడ్ అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, పార్టీ సీనియర్ నేత సంజు పాటిల్ తదితరులు ఉన్నారు.

Leave a Reply