-తెలుగుదేశానికి ఓటేసిన ఎన్ ఆర్ ఐలకు కృతజ్ఞతలు
-ప్రవాసాంధ్రుల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉంది
– టీడీపీ ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ కోమటి జయరాం
తెలుగుదేశం పార్టీకి ఓటేసిన ప్రవాసాంధ్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. సొంత గడ్డపై మమకారంతో మీరు దేశ, విదేశాల నుంచి వచ్చి కూటమికి ఓటేశారు. తెలుగుదేశంతోనే రాష్ట్రాభివృద్ది సాధ్యమని నమ్మి కూటమిని గెలిపించారు. ప్రవాసాంధ్రులు గొప్ప పోరాటయోధులు. వారి త్యాగనిరతి వెలకట్టలేనిది. కూటమి విజయంలో ప్రవాసాంధ్రులు అందించిన సహకారం మరువలేనిది.
తెలుగుదేశం పార్టీ అఖండ విజయంలో ప్రవాసాంధ్రులు భాగస్వాములు. టీడీపీ గెలుపు కోపం మీరు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి. పలువురు ఎన్ ఆర్ ఐలు జీతాన్ని సైతం వదులుకుని రెండు, మూడు నెలల ముందే సొంతూళ్లకు వచ్చి ఎన్డీఏ కూటమికి గెలుపుకు పాటుపడ్డారు. వారి రుణం తీర్చుకోలేది. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి విదేశాల్లో స్థిర పడిన తెలుగువారు అండగా నిలబడుతున్నారు.
ఖచ్చితంగా ప్రవాసాంధ్రుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. మీరు ఆశించిన విధంగా ఏపీని అభివృద్ధిలో దేశంలోనే అగ్రపథంలో నిలబెడతాం. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పూర్తి చేస్తాం. ఏపీ జీవనాడి పోలవరం కల సాకారం చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలో ప్రవాసాంధ్రులు కూడా భాగస్వాములు కావాలి. పెట్టుబడులు పెట్టండి. కంపెనీలు స్థాపించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి.