ఆంధ్రజ్యోతి గురించీ… ఏబీఎన్ ఆర్కే గురించి రెండు ముక్కలు చెప్పుకుందాం…
అటు రాజశేఖర్ రెడ్డి, ఇటు జగన్ రెడ్డి మాట్లాడితే ఆ రెండు పత్రికలు అనేవాళ్ళు.. ఈనాడుకి ఉన్న ఆర్థిక వనరులని పక్కన పెట్టి, ఆంధ్రజ్యోతికి ఉన్న దమ్ము, విలువలు, నెట్‌వర్క్ గురించీ మాట్లాడుకుందాం.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్డీ తివారి లాంటి ముసలి కామందుడిని, ఆంధ్ర గవర్నర్ గా పంపితే, ఆపరేషన్ చేసి సాయంత్రానికి రాజీనామా చేసి పంపిన మొండోడు.
అలా రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి..
చిరంజీవి జెండా పీకెద్దాం అన్నా..
4 గోడల మధ్య షర్మిల – జగన్ రెడ్డి ఆస్తి గొడవల గురించి , రాజకీయ పార్టీ పెట్టడం గురించి అందరికంటే ముందు చెప్పగల్గిన దమ్మున్నోడు..అంకుల్.. ప్లీజ్ మీరన్నా చెప్పండి డాడీ కి నిరాహార దీక్ష ఆపేయమని కేటీఆర్ అమెరికాలో చిన్న ఉద్యోగం చేస్తున్నప్పుడు, సంభాషించగల్గినంత నెట్వర్క్ ఉన్నోడు .
నా దగ్గరా కొన్ని వీడియోలు ఉన్నాయ్ అని. పండు కోతి విజయ్ సాయి రెడ్డి నోటికి ఒకే ఒక్క డైలాగ్ తో నోరు మూయించిన దమ్మునోడు.
ఎలక్షన్ అయిన 4 రోజులకు వెళ్లి, కేంద్రమంత్రి అమిత్ షా తో సిట్టింగ్ వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు.
రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అటు గాలి జనార్ధన్ రెడ్డి గురించి, ఇటు జగన్ మోహన్ రెడ్డి గురించి రోజూ కడిగి పారేయగల దమ్మున్న జర్నలిస్ట్.
స్వతహాగా తెలంగాణ వ్యక్తి అయినప్పటికీ.. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడు, తెలంగాణ వచ్చిన తర్వాత స్నేహితుడి అయిన కేసీఆర్ రాజకీయంలో నలిగిపోయిన సరే, వెనక్కి తగ్గని మొండి జర్నలిస్ట్.ఏబీఎన్ చానల్ పెట్టింది రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో.. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం.. రాష్ట్రం విడిపోవడం.. తెలంగాణాలో ఏబీఎన్ ప్రసారాలు నిలిపివేయడం.. కోర్టుల చుట్టూ తిరగడం.. మొత్తానికి విజయం సాధించడం… 2018,19 ఎన్నికలు.. ఇటు ఆంధ్రాలో ప్రభుత్వం మారడం…
వెరసి మొత్తం మీద ప్రశాంతంగా గొడవలు లేకుండా వుంది కేవలం 2014-19 మద్యలో ఆంధ్రాలో మాత్రమే.. మిగతా ప్రతీ ప్రభుత్వం ఏబీఎన్ ని తొక్కేద్దాం అని చూసిందే.. అయినా సరే ఎక్కడా తగ్గని నిఖార్సయిన జర్నలిస్ట్.
మిగతా జర్నలిస్ట్- సీఈఓ లాగా కాకుండా, ప్రతీ నిత్యం.. ప్రతీ రోజూ , వీకెండ్ వస్తే వీకెండ్ కామెంట్ బై ఆర్కే కానివ్వండి.. ఓపెన్ హార్ట్‌విత్ ఆర్కే … లాగా వృత్తినే దైవంగా , ఒక మెడిటేషన్ లా ఫీల్ అయ్యే మొండివాడు..
వీకెండ్ కామెంట్ బై ఆర్కే ఒక ఎత్తు అయితే, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంకో ఎత్తు… రాజకీయ, చలనచిత్ర, క్రీడలు లాంటి సమకాలీన అంశాలను టచ్ చేస్తూ…
చంద్రబాబు , కేసీఆర్ , రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, షర్మిల ల స్థాయి నాయకుల నుంచీ..రాజమౌళి,మోహన్ బాబు, రామ్ గోపాల్ వర్మ లాంటి సినీ ప్రముఖుల దాకా..
గోపీచంద్ నుంచి సానియా మీర్జా, సైనా నెహ్వాల్ మొన్న పీవీ సింధు దాకా ..
జాస్తి చలమేశ్వర్, చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు
ఒక్కళ్ళు ఏంటి… ప్రతీ ఒక్కరినీ హాయిగా, ఓపెన్ హార్ట్ తో హాయిగా మాట్లాడించిన నేర్పరి..
రాష్ట్రం విడిపోతుంది.. సమైక్యం అని సొల్లు చెప్పకుండా, మీకేం కావాలో అడిగి బిల్ లో పెట్టుకోండి అని ఆంధ్రా నాయకులకి కుండబద్దలు కొట్టి చెప్పిన ముందుచూపు ఉన్న నేర్పరి..
వీళ్ళు అంతా మనకి ఇప్పుడు తెలిసిన నాయకులు… ప్రముఖులు…
ఒక్క క్షణం కూడా తడుముకోకుండా ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి ని పెళ్లి చేసుకుంటే.. పిల్లలు మాత్రం ప్లాన్ చేయొద్దు అని వాళ్ళ మొహం మీద చెప్పిన మహా అవేశపరుడు దీనికి దండం పెట్టినా సరిపోదు.
పచ్చి నిజాలు చెప్పేసరికి ప్రతీ ప్రభుత్వంతో గొడవలే… అయినా సరే పాత్రికేయ విలువలని వదులుకోకుండా.. ఎవరితో కాంప్రమైజ్ అవ్వకుండా…దమ్ముతో మొండిగా నిలబడ్డ దమ్మున్నోడు ఆర్కే ..
“మొండి వాడు అనే మాటకి సరైన నిర్వచనం ఏబీఎన్ ఆర్కే “ఆయన పూర్తి పేరు “వేమూరి రాధాకృష్ణ”.
జర్నలిజం వరకు నేను ఎప్పటికీ మీ ఏకలవ్య శిష్యుడినే.
– జీఎన్‌ఆర్