– సాక్షి లైవ్‌ను మధ్యలోనే ఎందుకు ఆపేసింది?
సింగయ్య చావుపై వైసీపీ వింత ‘లా’జిక్కులు
(పిబి కృష్ణ)
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఇటీవలి పర్యటనలో ఆయన జగన్నాధ రథచక్రాల కింద నలిగి నజ్జయిపోయిన సింగయ్య అదే ఒక దళిత ప్రాణి కేసులో తప్పించుకునేందుకు వైకాపేయులు నానా తిప్పలు పడుతున్నారు. కారులో ఉన్న జగన్‌కు కేసుతో సంబంధం ఏమిటి? డ్రైవింగ్ చేసింది డ్రైవరయితే, అందులో ఉన్న జగన్‌కు సంబంధం ఏమిటనే మతిలేని లా పాయింట్లు తీస్తున్నారు. హిట్ అండ్ రన్ గురించి తెలుకుకదా? అంటే ఒక మనిషిని వాహనంతో గుద్దేసి ఆగకుండా వెళ్లిపోవటాన్ని హిట్ అండ్ రన్ అంటారు. ఇటీవల హైదరాబాద్‌లోని కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు వద్ద ఇలాగే హిట్ అండ్ రన్‌తో యువకులు పోలీసులకు దొరికిపోయారు. సరే.. సింగయ్యను కారు టైర్ల కింద చంపేసి వెళ్లిన వైనాన్ని సమర్థిస్తున్న వైకాపేయుల వాదన.. వాటి మచ్చటేమిటో ఓసారి చూద్దాం.
సింగయ్య యాక్సిడెంట్ కేసు: వైసీపీ సందేహాలు – సమాధానాలు
1. వైసీపీ ప్రశ్న: సింగయ్యను ఆటోలో తీసుకెళ్లారా? అంబులెన్స్‌లో తీసుకెళ్లారా?
సమాధానం: గుంటూరు బైపాస్‌లోని ఏటుకూరు సర్వీస్ రోడ్ నుండి సింగయ్యను మొదట ఆటోలో తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. అయితే, ఇంతలో అంబులెన్స్ రావడంతో అందులో తీసుకెళ్లారు. ఆటోలో తీసుకెళ్లడం సరైనదా? అంబులెన్స్‌లో తీసుకెళ్లడం సరైనదా అనేది మీ ఆలోచనకు వదిలేస్తున్నాం.
2. ఆది AI వీడియోనా?
సమాధానం: ఆది వీడియో AI ద్వారా రూపొందించినది (AI వీడియో) అయితే, AIని అడగండి, నిజం చెబుతుంది. అది AI వీడియో అని వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేయమనండి. ముందుగా, ఆ సమయంలో సాక్షి ఎందుకు లైవ్ ఆపేసిందో అడగండి. 14 ఏళ్లుగా జగన్ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ పోలీసుల ముందు “అవును, మా కారు గుద్దింది” అని ఒప్పుకున్నాడు.
3. Z+ సెక్యూరిటీ ఉన్న జగన్‌కు రోప్ పార్టీ ఎందుకు ఇవ్వలేదు?
సమాధానం: Z+ సెక్యూరిటీ మొత్తం జగన్‌తోనే ఉంది. జగన్‌కు, అనుచరుల వాహనాలకు పరిమితమైన పర్మిషన్ మాత్రమే పోలీసులు ఇచ్చారు. అలాగే, రోప్ పార్టీ, భారీ బందోబస్తు అన్నీ సత్తెనపల్లి మొదట్లోనే ఏర్పాటు చేశారు. కానీ, జగన్ పర్మిషన్ లేకుండా దారిపొడవునా వైసీపీ నాయకులకు చెప్పి 2వేలు, 3వేల మంది జనసమీకరణ చేసి, వారికి అభివాదం చేస్తూ ప్రదర్శన (షో) చేస్తూ కారు కింద వేసి సింగయ్యను చంపేశారు.
4. డ్రైవర్ కదా కారు నడుపుతోంది? జగన్‌కు సంబంధం ఏమిటి? సెక్షన్ 105 (BNS 105) జగన్ మీద ఎందుకు పెట్టారు?
సమాధానం: అసలు జగన్‌కు పోలీసులు పరిమితమైన పర్మిషన్ ఇచ్చారు. ర్యాలీలు, జనసమీకరణలు దారి పొడవునా వద్దు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి అని పోలీసులు ముందే చెప్పారు. కానీ వాటిని పక్కనపెట్టి, భారీ ర్యాలీ చేస్తూ, జనసమీకరణ చేసి, బయటికి వచ్చి అభివాదం చేస్తూ, కారు ఎక్కించి సింగయ్య చావుకు కారణమయ్యారు. అందువల్ల, జగన్ మీద భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 105 కింద కేసు పెట్టారు.
5. ముందు ఎస్పీ వేరే వాహనం అని చెప్పారు, మళ్ళీ జగన్ వాహనం అని ఎందుకు అంటున్నారు?
సమాధానం: స్థానికంగా జగన్‌తో పాటు ఉన్న వైసీపీ నాయకులు కారు నంబర్‌తో సహా ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని అక్కడ పోలీసులు ఎస్పీకి చేరవేశారు, ఆయన ప్రెస్‌మీట్‌లో అదే చెప్పారు. వైసీపీ నాయకులు ఇచ్చిన కారు నంబర్ ఓనర్, డ్రైవర్‌ను విచారణ చేసిన తర్వాత అది తప్పు అని తేలింది. ఇప్పుడు పూర్తి నిజాలు బయటపడ్డాయి.
వైసిపి నాయకులు/కార్యకర్తలు మరిన్ని ప్రశ్నలు మీ మనసులోకి వస్తే లేదా సాక్షి మరిన్ని ప్రశ్నలు వేస్తే.. బాబాయ్ గుండెపోటుకు- గొడ్డలిపోటుకు చాలా తేడా ఉంది అని గమనించగలరు.