– డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు
– నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా
– జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలి
– పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: పార్టీ, ప్రభుత్వం సమన్వయం తో ముందుకు పోతాం. పార్టీ, ప్రభుత్వం జోడెద్దులు లా పనిచేయాలి. 18 నెలల ప్రభుత్వపాలన గోల్డెన్ పీరియడ్. బూత్,గ్రామ,మండల స్థాయి లో పార్టీ కమిటీ లు ఏర్పాటు చేయాలి. బూత్ స్థాయి లో పార్టీ బలం గా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజలలోకి సమర్ధ వంతంగా తీసుకెళ్ళగలుగుతాం.
పార్టీ నిర్మాణం పైన పీసీసీ దృష్టి సారించాలి. పార్టీ నాయకులు అంతా ఐక్యం గా పని చేయాలి. మరోసారి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చేలా అంతా పని చేయాలి. పార్టీ కమిటీ లలో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పని చేయాల్సిందే. పని చేస్తేనే పదవులు వస్తాయి. పార్టీ కష్ట కాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం.
లక్ష్యాన్ని నిర్దేశించుకొని పార్టీ నాయకులు పని చేయాలి. మార్కెట్ కమిటీ లు,టెంపుల్ కమిటీ లు వంటి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకోవాలి. పార్టీ నాయకులు క్రమశిక్షణ తో వ్యవహరించాలి. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది. అనేక సామాజిక అంశాలను కూడా ప్రభుత్వం పరిష్కరించింది.
రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నాం. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలి ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయి. నేను గ్రామాల్లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీ ని సిద్ధం చేయాలి.