Suryaa.co.in

Andhra Pradesh

కమ్యూనిస్టుల ప్రకటన పేదలకు వ్యతిరేకం !

రాను రాను కమ్యూనిష్టులు సిద్దాంతం వారి ఆలోచన తీసికట్టుగా మారుతున్నట్లు కనిపిస్తోంది. నేడు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుగారు కూటమి పార్టీలు ( BJP, TDP, JSP) ప్రజా సమస్యలు వినడం, పిర్యాదులు స్వీకరించడం , పరిస్కారం చేస్తున్న విధానంపై విమర్శలు చూస్తే అర్థమైపోతుంది.

పార్టీ కార్యాలయాల్లో విజ్ఞాపనులు తీసుకోవడం ఆపేయాలని.. ప్రభుత్వ కార్యాలయాల్లోనే తీసుకోవాలని ఆయన అంటున్నారు. తెలిసి అంటున్నారో…. పేద ప్రజల్ని తక్కువ అంచనా వేసి ఈ వ్యాఖ్యలు చేశారో కానీ కూటమి పార్టీ కార్యాలయాల్లో ..ఆయా పార్టీల నేతలకు అందుబాటులో ఉంటుంది పేదలకోసం , ప్రభత్వ అధికారులు నిర్లక్ష్యానికి గురైన ప్రజల కోసం .

సాధారణ ప్రజలకు గ్రీవెన్స్ వ్యవస్థ కూటమి ప్రభుత్వంలో సమర్థంగా పని చేస్తోందన్న విషయం మీకు తెలియదా ? కావాలని మర్చిపోయారా ? ఈ మధ్య మీ కమ్యూనిష్టు పార్టీలు కూటమి ముఖ్యమంత్రి గారిని కలసి అభినందనలు తెలిపిన విషయం మీరే మరిచి పోవడం ఆశ్చర్యం కలుగోతోంది . గత ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురైన మూడు పార్టీల కార్యకర్తలు తమ బాధల్ని చెప్పుకోవడానికి పార్టీ కార్యలయాలకు వస్తున్నారు. మా పార్టీ కార్యకర్తలు రావద్దని మీరు బావిస్తున్నారా? వారి బాధలు విని పరిష్కరించడం మా పార్టీల యంత్రాంగం బాధ్యత కాదా?

మీ పార్టీ ప్రభుత్వాలు అరాచకంగా రాజ్యమేలిన త్రిపుర, బెంగాల్‌లలో ఏం చేశారో ప్రజలకు తెలియదని ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా ? పార్టీ అంటే ప్రభుత్వం.. ప్రభుత్వం అంటే పార్టీ అన్నట్లుగా చైనాను ఆదర్శంగా చేసుకుని దశాబ్దాలుగా త్రిపుర, బెంగాల్‌లను భ్రష్టుపట్టించింది మీరే కదా ? నేటికి మీకు అధికారం ఉన్న కేరళలో మీరు ఈ రకంగా పిర్యాదులు తీసుకోవడం లేదా ?

ఇక్కడ మీ పార్టీ కార్యాలయాలకు ఎవరూ రారు, మీ ఆఫీసులు ఖాళీగా ఉంటాయని కూటమి పార్టీలవీ అలాగే ఉండాలంటే ఎలా ?చెప్పేవాళ్లకు వినేవాడు లోకువ అన్నట్లుగా.. ఉందో లేదో తెలియని పార్టీగా మీరు ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయడానికి ముందు కాస్త కసరత్తు చేస్తే మంచిది. పార్టీకి , ప్రభుత్వానికి స్పష్టమైన తేడాను ప్రజలు అందరూ చూస్తున్నారు.. మీరు తప్ప. ప్రజల అభిప్రాయాలు అర్థం చేసుకునే మైండ్ సెట్ కమ్యూనిస్టు పార్టీలకు ఉండదని.. తెలిసినా మా ప్రయత్నంగా మేము చెబుతున్నాం.. విమర్శలు చేసే ముందూ .. కాస్త ముందూ వెనుకా చూసుకోండి. ప్రజల పట్ల బాధ్యతగా ఉండండి. పేదలకు న్యాయం జరిగి అంశంలో వారికి వ్యతిరేకంగా ఇచ్చిన ప్రకటనపైన పేదప్రజలకు క్షమాపణలు చెప్పండని బిజెపి రాష్ట్ర పార్టీ వామపక్ష పార్టీలకు ప్రత్యేకంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారిని డిమాండ్ చేస్తోంది .

ఇట్లు ,
ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి
ఉపాధ్యక్షులు,భాజపా, ఆంధ్రప్రదేశ్.

LEAVE A RESPONSE