Suryaa.co.in

Andhra Pradesh

అన్న క్యాంటీన్ల పై దాడి జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం

– టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ల పై దాడి జగన్ రెడ్డి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. కుప్పం ఆర్టీసి బస్టాండ్ కూడలి వద్ద 86 రోజులుగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ పై వైసిపి రౌడీలు అర్థరాత్రి దాడి చేసి ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.

అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 201 అన్న క్యాంటీన్లు రద్దు చేశారు. ఇప్పుడు పేద వాడి నోటిkuppam2 దగ్గర కూడు లాక్కుంటున్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా అన్న క్యాంటీన్లు నిర్వహించి తీరుతాం.కుప్పంలోని అన్న క్యాంటీన్ పై దాడి చేసిన వైసిపి రౌడీ మూకల పై కఠిన చర్యలు తీసుకోవాలి.

LEAVE A RESPONSE