శాసనసభ చర్చల సరళిని రచయితగా 1956 నుండి 1971 వరకు పుస్తకాలు వ్రాశారు. 1973 నుండి జర్నలిస్ట్ జీవితం మొదలెట్టి బుల్లితెర దూరదర్శన్ వాఖ్యాత వరకు ఎదిగాడు. ఈనాడు ఢిల్లీ బ్యూరో చీఫ్ వరకు ఎన్నో హోదాలు. ఎంతోమంది జర్నలిస్ట్ శిష్యులు. ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ గా చేస్తూ.. నేను రాజీనామా చేస్తున్నా అని మీటింగ్ లో బెదిరిస్తే, ఇప్పుడే ఆమోదిస్తున్నాం పొద్దున నుండి రానక్కరలేదు అని పంపేశారు.
తన జర్నలిస్ట్ కెరీర్ మొదలెట్టినప్పటికి జగన్ ఐదారు నెలల పిల్లాడు. అతని దగ్గర జర్నలిస్ట్ జీవిత చరమాంకంలో పగ, ఆశతో చేరాడు.
మహిళల మానాల మీద పరాచకాలు చేసిన కురుసభలోని కౌరవులు మొత్తం నాశనం అయ్యారు. ఇవ్వాళ ధర్మం తప్పి ఎవరి జోలికి వెళ్లి ఏమి చర్చించ కూడదో.. అదే చేశాడు. దుష్ట సావాసం, ఆశ, పగతో చివరగా సాధించింది 13 నెలల అత్యున్నత హోదా ప్రెస్ అకాడమీ ఛైర్మన్. రాజీనామా చేయించారు.
తెలుగు తీర్పు అని మూడు ఎన్నికల మీద 99 నుండి 2009 వరకు పుస్తకాలు వ్రాశారు. తన యజమాని కాని యజమాని మీద ఆయన జర్నలిస్ట్ జీవితంలో చూడని 2024 తీర్పును చూసి కూడా ఆయన జర్నలిస్టుగా మారలేదు.
జగన్ పుట్టిన 1972 నుండి శాసనసభ చర్చల సరళిని ఆయన రచయితగా రాయకపోవడం కాకతాళీయం కావచ్చు. కానీ, స్త్రీని గౌరవించే దేశంలో ధర్మం తప్పి ఇలాంటి దౌర్భాగ్యుడిగా పతనం అయ్యి కారాగారం పాలయ్యాడు.
చేసుకున్నోడికి చేసుకున్నంత అని ఊరికే అనలేదు కదా పెద్దలు.
-బాబు.బి