Suryaa.co.in

Telangana

ప్రతిపక్షాల గొంతునొక్కుతున్న బీజేపీ ప్రభుత్వం

– రాహుల్ గాందిపై మోడీ ప్రభుత్వం వేసిన అనర్హత వేటు వారి దురహంకారానికి నిదర్శనం
– ప్రజాస్వామ్యంలో బీజేపీ నియంత్రుత్వ చర్యలు చెల్లవు
– గంగుల కమలాకర్

ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తూ, అధికారాన్ని అడ్డంపెట్టుకొని మోడీ ప్రభుత్వం నియంత్రుత్వ విధానాల్ని అవలంబిస్తుందని రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతుకలను అడ్డుకొని రాజ్యంగ హక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని, ఈడీ, సీబీఐ వంటి జేబు సంస్థల అండతో దురహంకారంగా ప్రవర్తిస్తూ దేశంలో ప్రతిపక్షాల గొంతునొక్కుతుందన్నారు. రాహుల్ గాందీపై తీసుకున్న చర్యలతో వారూహించింది సాధ్యంకాదన్న గంగుల. ఈ దుశ్చర్యలకు దేశప్రజలు త్వరలోనే బీజేపీకి ఖచ్చితంగా బుద్ది చెపుతారని, బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామన్నారు.

LEAVE A RESPONSE