Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభంపై కేంద్రం కలుగ చేసుకోవాలి

– గాడితప్పిన రాష్ట్రఆర్థికపరిస్థితిపై తక్షణమే కేంద్రం జోక్యంచేసుకోవాలి. రూ.48వేలకోట్లకుపైగా ప్రజలసొమ్ము ఏమైందనే దానిపై కేంద్రం తక్షణమే సీబీఐ విచారణకు ఆదేశించాలి
• మూడేళ్లలో జగన్ ప్రభుత్వంసాధించినప్రగతి అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసమే
• ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా రూ.48వేలకోట్లకుపైగా సొమ్ముని దుర్వినియోగంచేసిందని కాగ్ నివేదిక చెబుతోంది
• కాగ్ అభ్యంతరాలపై స్పందించకుండా ఉండటమే గొప్పన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు
• న్యాయస్థానాలను, న్యాయమూర్తులను తప్పుపట్టకూడదని రాజ్యాంగమే చెప్పింది
• చట్టాలను, చట్టసభలను, కోర్టులను గౌరవించలేని వారు పాలకులుగా ఉండి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు
– మాజీమంత్రి యనమల రామకృష్ణుడు

తన మూడేళ్లపాలనలో జగన్ ప్రభుత్వం అప్పులు, అవినీతి, వ్యవస్థల విధ్వంసం తప్ప సాధించిందేమీలేదని, ఎఫ్ఆర్ బీఎం నిబంధనలుకూడాకాదని ఇష్టారాజ్యంగా అప్పులు తెస్తున్న ప్రభుత్వం ఆసొమ్ముని ప్రజలకోసం ఖర్చుపెడుతున్నామనిచెప్పడం పచ్చిఅబద్ధమ ని, 2020-21 కాగ్ నివేదికను పరిశీలిస్తే, జగన్ ప్రభుత్వం రూ.48వేలకోట్లకుపైగాసొమ్ముని లెక్కాపత్రంలేకుండా దుర్వినియోగంచేసినట్టు స్పష్టమవుతోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యు లు, మాజీమంత్రివర్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు.శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

2020-21లో ఈ ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి రూ.లక్షా73వేలకోట్లకుపైగా ఖర్చుపెట్టినట్టు చెబుతోంది. కానీదానిలో రూ.48వేలకోట్లకు పైగాసొమ్ము దుర్వినియోగమైనట్టు కాగ్ నివేదిక చెబుతోంది. ప్రజలసొమ్ము దుర్వినియోగమైందని, రూ.48వేలకోట్లకుపైగా సొమ్ము ఏమైందని కాగ్ పలుమార్లు ప్రశ్నించినా ప్రభుత్వంనుంచి సమాధానంలేదు. ఆ సొమ్ము ఎవరిజేబుల్లోకి వెళ్లిందనేది చెప్పాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదే. ప్రజలకోసం ఆసొమ్ముఖర్చుపెడితే, దానికి లెక్కలుంటాయి. కాగ్ ఇప్పుడు అంటున్నదేకాదు..టీడీపీఇదివరకే ప్రజలసొమ్ము అంతా వైసీపీనేతల జేబుల్లోకి వెళుతోందని చెప్పింది.

రూ.48వేలకోట్లకుపైగా లెక్కాపత్రంలేని సొమ్మంతా వైసీపీనేతలు, ప్రభుత్వపెద్దల జేబుల్లోకి వెళ్లిందని స్పష్టమవుతోంది. సొమ్ముదుర్వినియోగంపై ఈ ప్రభుత్వం స్పెషల్ బిల్స్ కింద వాడామనిచెబుతోంది. అలా స్పెషల్ బిల్స్ కింద ట్రెజరీకోడ్ ని కాదని నిధులుఇష్టానుసారం వినియోగించడానికి వీల్లేదు. ట్రెజరీకోడ్ ని, బీఆర్ ఏను వయోలేట్ చేసిమరీ ప్రభుత్వం ప్రజల సొమ్ముని దుర్వినియోగంచేసిందని కాగ్ చెబుతోంది. అదే రూ.48వేలకోట్లను ప్రజలకోసమే నిజంగా ఈప్రభుత్వం ఖర్చుపెట్టిఉంటే, రాష్ట్రంలో బ్రహ్మండమైన రోడ్లుపడేవి. లేదా పేదలకు ఇళ్లుకట్టించిఇవ్వడానికి అవకాశంఉండేది. కానీ అవేవీ చేసినట్టు ఎక్కడా కనిపించడంలేదు.

రాష్టప్రభుత్వం ఆర్థికక్రమశిక్షణను గాలికివదిలేయడంతో అప్పులు విపరీతంగాపెరిగాయి.
ప్రజలనుంచి వివిధమార్గాల్లో వసూలుచేస్తున్న సొమ్ముకి కూడా లెక్కలుఉండటంలేదు. 15వ ఆర్థికసంఘం బడ్జెట్ పరిధిలోని అప్పులుకాకుండా హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ను ఎలాఖర్చు పెడుతున్నారో ప్రభుత్వంచెప్పడంలేదని ఎప్పుడో చెప్పింది. హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ను బడ్జెట్ చూపాలని 15ఆర్థికసంఘం ప్రభుత్వానికి సూచించడం జరిగింది. కేవలం మూడేళ్లలో నే ప్రభుత్వం ఇంతలా రాష్ట్రాన్ని కోలుకోలేనివిధంగా అప్పులఊబిలోకి నెట్టేసింది. 2024 చివరికి రాష్ట్రఅప్పులు 8లక్షలకోట్లనుంచి 9లక్షలకోట్లవరకు చేరే అవకాశముంది.

ఇప్పటికే ఈ ప్రభుత్వంచేసిన అప్పులకుగాను రూ.21వేలపైచిలుకుసొమ్ముని వడ్డీలరూపంలో చెల్లి స్తోంది. మరో 10వేలకోట్లవరకు ఇతరత్రామార్గాల్లో చెల్లిస్తోంది. అంటే రూ.31వేలకోట్లవరకు చెల్లిస్తోంది. రోజురోజుకీ అప్పుల గ్రోత్ రేట్ పెరిగిపోతుంటే, రెవెన్యూగ్రోత్ రేట్ తగ్గిపోతోంది. రెవెన్యూ లోటు పెరిగేకొద్దీ, అప్పులుతెచ్చేసొమ్ముకూడా రెవెన్యూలోటు భర్తీకి కట్టాల్సిన దుస్థితి. ఇదేపరిస్థితి రాబోయే రెండేళ్లుకూడాఉంటే తరువాత రాష్ట్రానికి రూపాయి అప్పుపుట్టదు.

పేదలకు ఎలాంటిపథకాలు అమలుచేయలేము. ఊరికే జీతాలు ఇచ్చికూర్చోవడంతప్ప ఏ ప్రభుత్వమైనా చేయగలిగేదీ ఏమీఉండదు. అసలురాష్ట్రరూపురేఖలే అధ్వాన్నంగా తయార వుతాయి.
అందుకనే ఏపీప్రభుత్వం అప్పులు, ప్రజలసొమ్ముదుర్వినియోగంపై కేంద్రం కలుగుచేసుకోవా లని కోరుతున్నాం. ఆర్టికల్ 360ప్రకారం (ఫైనాన్షియల్ ఎమర్జన్సీతలెత్తినప్పుడు) రాష్ట్రాన్ని, రాష్ట్రసంపదను కాపాడాలనికేంద్రప్రభుత్వాన్నికోరుతున్నాం.

కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో వెంటనే ఆర్టికల్ 360 అమలుచేయకపోతే చాలాదారుణాలు చూడాల్సి వస్తుంది. రాష్ట్రఖజానాకు ఆదాయంవచ్చే మార్గాలన్నీ వైసీపీనేతల పరమైపోయాయి. దానిప్రభావమే రాష్ట్రం ఇంతలా కోలుకోలేనివిధంగా ఆర్థికంగా దెబ్బతినడం.

ఏపీప్రభుత్వంలెక్కలు, అప్పులపై కాగ్ కు ఏంపని అని కొందరనవచ్చు? కాగ్ నివేదిక అనేది పబ్లిక్ అకౌంట్స్ కు జవాబుదారీగా ఉంటుంది. ప్రజలసొమ్ముని పాలకులు ఏంచేస్తున్నారనేది కాగ్ కు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. రాష్ట్రానికివస్తున్నఆదాయంఏమీ తగ్గలేదు. ప్రజలనుంచి వస్తున్నదాన్ని పాలకులు దుర్వినియోగంచేస్తున్నారు అంతే.

రూ.48వేలకోట్లు ఏమయ్యాయి… ఆసొమ్ము ఎవరిచేతుల్లోకి వెళ్లిందనేది ఒకస్వతంత్రసంస్థతో కేంద్రం దర్యాప్తు జరిపించాలి. అవసరమైతే సీబీఐ విచారణజరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. ఏపీని కేంద్ర ప్రభుత్వంఇప్పుడుగానీ ఆదుకోకపోతే, పూర్తిగా కోలుకోలేనివిధంగా రాష్ట్రం ఆర్థికంగా సర్వనా శనమవుతుంది.
కేపిటల్ ఎక్స్ పెండేచర్ కింద రూ.18వేలకోట్లపైన ఖర్చుపెడితే, రెవెన్యూ డెఫిషియన్స్ రూ.35వేలకోట్లపైగా ఉంటోంది. అసలు ఇలాంటి దారుణాలు ఎక్కడాచూడం. 2019-20, 2020-21 ఆర్థికసంవత్సరాల్లో కేపిటల్ ఎక్స్ పెండేచర్ కి, రెవెన్యూలోటుకిచాలా వ్యత్యాసం ఉంది.

న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై చట్టసభల్లో మాట్లాడకూడదనే నిబంధనను తుంగలో తొక్కారు. అమరావతి అంశంపై ప్రతిపక్షాలపై బురదజల్లి, ప్రజలను తప్పుదోవపట్టించే తంతుని చట్టసభల్లో కొనసాగించారు. రూ.48వేలకోట్ల ప్రజలసొమ్ము ఏమైందనేదానిపై కేంద్రప్రభుత్వం దృష్టపెట్టాలి. సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో జరుగుతున్న ఆర్థికఅవకతవకలపై కేంద్రప్రభుత్వం దృష్టిపెట్టాలి.

లేకపోతే ఏపీ అనేది ఆర్థికంగా ఎవరూఊహించనివిధంగా దెబ్బతింటుంది. ఆర్టికల్ 360ప్రకారం రాష్ట్రఆర్థికవ్యవవస్థదెబ్బతిన్నప్పుడు, ప్రజలసొమ్ముకు పాలకులుచేస్తున్న దోపిడీకి సంబంధంలేనప్పుడు కేంద్రం జోక్యంచేసుకోవచ్చు. 365 రోజుల్లో ప్రతి రోజూ వేజ్ అండ్ మీన్స్ కింద రాష్ట్రపాలకులు అప్పులుతెచ్చారు. అలానే ప్రతి మూడున్నరరోజులకు ఓడీకింద అప్పులు తెచ్చారు. అవికాకుండానే మార్కెట్ బారోయింగ్స్ కింద రూ.55వేలకోట్లు, హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కింద రూ.లక్షా09వేలకోట్లు అప్పులుతెచ్చారు.

ఈప్రభుత్వం చెప్పినలెక్కలప్రకారమే రూ.లక్షా75వేలకోట్లవరకు ఖర్చుపెట్టింది. దానిలో రూ.48వేలకోట్లకు పైగాసొమ్ము దుర్వినియోగమైంది. ప్రజలసొమ్ముకి బాధ్యతవహించాల్సింది ప్రభుత్వమే.. ప్రభుత్వపెద్దలకు తెలియకుండా రాష్ట్రంసొమ్ము వేరేవారిచేతుల్లోకి వెళ్లదుకదా! ఈప్రభుత్వం ఇచ్చిన స్పెషల్ బిల్స్ జీవోని వారే సరిదిద్దుకున్నారు. ఎందుకలాచేశారు? పీఏసీకి మాత్రమే ఆ అధికారం ఉంటుంది… ప్రభుత్వానికి ఉండదు.

స్పెషల్ బిల్స్ అనేవి ఇవ్వడానికి వీలేలేకపోతే, వాటికింద రూ.48వేలకోట్లు ఖర్చుపెట్టామని ఎలాచెబుతారు? కాగ్ 4సార్లు అడిగినా రూ.48వేలకోట్లకుపైగా సొమ్ముకి ఎందుకు లెక్కలు చెప్పలేకపోతున్నారు…ఆసొమ్ము ఏమైందో ప్రభుత్వానికి తెలిసుంటే లెక్కలుచెప్పాలికదా! కాగ్ ని జగన్ ప్రభుత్వం ఎందుకు కన్విన్స్ చేయలేకపోయింది? దాణా కుంభకోణం మొత్తం కూడా రూ.66కోట్లేమో.. దాన్ని గుర్తించింది కాగ్గే.

దానిపైకేంద్రం జోక్యంచేసుకొని సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆకుంభకోణంలో ప్రధానసూత్రధారులు జైల్లోఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన రూ.48వేలకోట్లప్రజలసొమ్ము దుర్వినియోగంకూడా అలాంటిదే.
సీఎఫ్ఎంఎస్ విధానం అనేది చాలాచాలా పారదర్శకమైనది. అలాంటి విధానం ఈ ప్రభుత్వానికి నచ్చలేదంటే..ఇలా దొడ్డిదారిన ప్రజలసొమ్ముని దారి మళ్లించడానికే.

సీఎఫ్ఎం ఎస్ విధానంలో మూడోవ్యక్తి ప్రమేయంలేకుండా ప్రజలసొమ్ముసక్రమంగా వారికే చేరేలా చేరుతుంది. అలాంటి విధానంపై అనేకరాష్ట్రాలు స్టడీచేశాయి. ఆ విధానం వీళ్లకు నచ్చలేదంటే.. ఇప్పుడు చేసినట్టు రూ.48వేలకోట్లసొమ్ముని లెక్కాపత్రం లేకుండా కాజేయడానికే అనుకోవాలి.

బడ్జెట్ ఫిగర్స్ లో కేపిటల్ ఎక్స్ పెండేచర్స్ అన్నీ జీరోలేకనిపిస్తుంటాయి. ఈప్రభుత్వం ఏఏ రంగాలకు ఎంతెంత కేటాయిస్తోంది..ఎంతఖర్చుపెడుతోందనికూడా ఎందుకుచెప్పలేకపోతోంది?
ఆఖరికి కాంట్రాక్టర్లకు బిల్లులుకూడా చెల్లించలేని దుస్థితికి వచ్చారంటే ఏమనుకోవాలి? పీఏసీ సమావేశానికికూడా ప్రతిపక్షాన్ని పిలవకుండా.. కాగ్ కు సమాధానంచెప్పకుండా… ప్రభుత్వం దొడ్డిదారిలో ప్రజలసొమ్ముని దుర్వినియోగంచేస్తోంది. పీఏసీ ఛైర్మన్ ను సమావేశా నికి పిలిస్తే, ఆయన అడిగేప్రశ్నలకు సమాధానంచెప్పాల్సి వస్తుందనే పిలవడం లేదా?

పీఏసీ సమావేశంకూడా నిర్వహించకుండా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఇప్పుడేచూస్తున్నాం.
చట్టాలకు పవర్ లేదని కోర్టుఎక్కడా అనలేదు.. అమరావతిపై హైకోర్టు ఏంతీర్పు ఇచ్చిందో కూడా ప్రభుత్వం చదవకుండా.. చట్టసభలో ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఫండమెంటల్ లా స్ కు వ్యతిరేకంగా చట్టాలుచేసినప్పుడే కోర్టులు కొట్టేస్తుంటాయి. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఎవరు చేశారు.. దాన్ని ఆమోదించింది ఎవరు.. అనేది కూడా తెలియకుండా ప్రజల్ని రాంగ్ ట్రాక్ లో పెట్టేలా, మేంచెప్పిందే రాజ్యం అన్నట్లుగా మాట్లాడారు.

ముఖ్యమంత్రి కూడా న్యాయ మూర్తులను తప్పుపట్టేలా మాట్లాడితేఎలా? న్యాయమూర్తులపై ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదనే నిబంధన రాజ్యాంగంలోనే ఉంది. శాసనసభలను, చట్టాలను, కోర్టులను గౌరవించినప్పుడే రాజ్యాంగానికిఒక విలువ ఉంటుంది.. అది నిలబడుతుంది.

LEAVE A RESPONSE