– హామీలు అమలు చేయనప్పుడు బిజెపికి ఏపీలో పార్టీలు ఎందుకు మద్దతునిస్తున్నాయి?
– ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
కాంగ్రెస్ చేసే పోరాటానికి మా మద్దతు : డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ
ఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం,రాష్ట్ర విభజన హామీల కోసం ఇవ్వాళ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను, డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ ని కలిశాం. పదేళ్లయినా విభజన చట్టంలోని హామీలు అమలుకు నోచుకోవటం లేదు. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు ఇస్తామని మోడీ చెప్పారు. కానీ ఇప్పటికీ ప్రత్యేకహోదాని ఇవ్వలేదు హామీఅమలు చేయలేదు.
పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదు.రాజధాని నిర్మాణానికి సహకారం సహా కడప స్టీల్ ప్లాంట్ సహా ఏ హామీ అమలుకు నోచుకోలేదు. దుగరాజపట్నం పోర్ట్ ను నిర్లక్ష్యం చేశారు. విశాఖ రైల్వే జోన్ ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు. హోదా కాదు కదా ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇవ్వలేదు. ఒక్క హామీ అమలు పరచలేదు.
బుందేల్ ఖండ్ తరహాలో రాయలసీమ,ఉత్తరాంధ్ర కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. వైజాగ్ – చెన్నై కారిడార్ ను ఏర్పాటు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. హామీలు అమలు చేయనప్పుడు బిజెపికి ఎందుకు ఏపీలో పార్టీలు మద్దతునిస్తున్నాయి. పదేళ్లవుతుంది కీలకమైన పది హామీల్లో ఒకటి అమలు కాలేదు. మా పోరాటం ఇకముందు కూడా కొనసాగుతుంది. అన్ని పార్టీల నేతలు కలవడంతో పాటు అందరికీ లేఖలు రాస్తాం. చట్టాన్ని గౌరవించి అమలు చేయాల్సిన అవసరం ఉంది
డిఎంకె ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ.. సీఎం స్టాలిన్ విదేశీ పర్యటనలో ఉన్నారు, స్టాలిన్ రాగానే చర్చించి మద్దతు ఇస్తాం. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాలి. సవితితల్లి ప్రేమ చూపించడం సరికాదు. రాజ్యసభలో ఏపీ హక్కుల కోసం కాంగ్రెస్ చేసే పోరాటానికి మా మద్దతు ఉంటుంది