ముఖ్యమంత్రి,మంత్రులు చంద్రబాబుపై పడి ఏడవడం తప్ప చేసిందేమీ లేదు

– ముఖ్యమంత్రి నవరత్నాలు పేదల జేబులకు నవరంధ్రాలు పెట్టాయి.
– కొడాలినానీ, వల్లభనేని వంశీలు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేలా మాట్లాడుతున్నారు.
– మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
రాష్ట్రంలోని అరాచకపాలనను, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తగిన సాక్ష్యాధారాలతో రాష్ట్రపతికి వివరించి, రాష్ట్రపతిపాలన విధిం చాలని, ఆర్టికల్ 356విధించాలని, డీజీపీని రీకాల్ చేయాలని, రాష్ట్రపతిపాలన విధించాలని కోరిన కొన్నిగంటల్లోనే ఇక్కడి ప్రభుత్వానికి పూనకం వచ్చిందని, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాష్ట్రంలో 25వేలఎకరాల్లో దాదాపు రూ.8వేలకోట్ల విలువైన గంజాయి సాగు జరుగుతోంది. పక్కరాష్ట్రంలోని పోలీసులు తమరాష్ట్రాలకు వస్తున్న గంజాయి మూలాలు ఏపీలో ఉన్నాయని చెబుతుంటే, వారికి సమాధానం చెప్పలేని అసమర్థప్రభుత్వం, ఇక్కడిప్రతిపక్షంపై దాడులకు పాల్పడుతోంది. ప్రతిపక్ష కార్యాలయంతోపాటు, ప్రతిపక్షనేతల ఇళ్లు, కార్యాలయాలపై కూడా దాడులకు పాల్పడుతోంది
. ఈ విధంగా జరుగు తున్న అరాచకాలన్నీంటినీ చంద్రబాబునాయుడు రాష్ట్రపతికి వివరిస్తే, ఏంచేయాలో దిక్కుతోచని ప్రభుత్వం, తనపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను మీడియాముందుకు వదిలి పైశాచిక ఆనందం పొందింది. గతకొన్ని నెలలుగా మీడియాకు ముఖంచాటేసిన ఇరిగేషన్ మంత్రి నేడు మీడియాముందుకొచ్చాడు. ఇరిగేషన్ గురించి ఆయన చెప్పేదేమీ లేదు. తాడేపల్లి ప్యాలెస్ లోని సజ్జల ఆదేశాలప్రకారం ధనుంజయరెడ్డి పనిచేస్తుంటాడు. మరో ఎమ్మెల్యే ఇరిగేషన్ రంగంపై మాట్లాడతాడు.
ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే ఇరిగేషన్ రంగం మొత్తం వారి చేతుల్లోకి వెళ్లిపోయింది. రూ.65వేలకోట్లను ఏసంవత్సరం, ఎక్కడ దేనికి ఖర్చుపెట్టామో మా దగ్గరున్న సమాచారం మొత్తాన్ని మీడియాకు అందిస్తాను.
అలానే ఇప్ప్పుడు అధికారంలో ఉన్నవారు మీడియాకు చెప్పకుండా, ఎన్నిరోజు లు ఇంకా టీడీపీపై పడిఏడుస్తారని ప్రశ్నిస్తున్నాం. అధికారంలోకి వచ్చి 29 నెలలైంది. ఒక్కప్రాజెక్ట్ అయినా పూర్తిచేశారా? మా ప్రభుత్వంలో 62ప్రాజెక్టులకుగాను, 23 ప్రాజెక్టులు పూర్తిచేశాము. 26ప్రాజెక్టులు పనులు పరుగులుపెట్టించాము. 13 ప్రాజెక్టులు పైపులైనులో ఉన్నాయి. ఇదీ మే 2019 నాటి ముఖచిత్రం. ఈ సమాచారం మొత్తం మీడియాకు ఇస్తాము. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నవ్యక్తికి ధైర్య ముంటే, మేంప్రారంభించిన ప్రాజెక్టులకుఎంత సొమ్ముఖర్చుపెట్టారో చెప్పాలి.
ఇరిగేషన్ మంత్రిగా నీదగ్గర ఏదైనా సమాచారముందా? మా దగ్గర చేసిన పనులకుసంబంధించిన కాగితాలు ఉన్నాయి. మీ దగ్గర బుల్లెట్ దిగిందా లేదా అంటూ అరవడం, ఊకదంపుడు ఉపన్యాసాలు.. ఉత్తుత్తికేకలు తప్ప. బాధ్యతగా మాట్లాడటం ఇరిగేషన్ మంత్రికి తెలుసా ? ఆయనకు దమ్ముంటే, ఈ 29నెలల్లో ఏం ఉద్ధరించారో చెప్పాలి. రివర్స్ టెండరింగ్ డ్రామాలు ఆడారు. ఆ డ్రామా గురించి నేడు ఈ మంత్రి చెప్పలేదు. టీడీపీప్రభుత్వం 62ప్రాజెక్టులు ప్రారంభిస్తే, ఈ ప్రభుత్వం రెండు తీసేసి 6 ప్రాజెక్టులను మాత్రమే ప్రయార్టైజ్ చేసుకుంది.
ఆ 6 ప్రాజెక్టుల్లో వంశధార నాగావళి అనుసంధానం చాలాచిన్నది. కేవలం రూ.6కోట్లుఖర్చుపెడితే సరిపోతుంది. అదికూడాచేయలేక ఊరికే దద్దమ్మ ల్లా చేతగాని కబుర్లుచెబుతున్నారు. వంశధార నాగావళి అను సంధానాన్ని గాలికి వదిలేశారు. పోలవరాన్ని పండబెట్టారు. బహుళార్థ సాథకప్రాజెక్ట్ లో మీ అయ్యా, మా అయ్యా విగ్ర్రహాలు పెడతారా? ఎవరు ఇచ్చారు మీకు ఆ అధికారం? పోలవరం ప్రాజెక్ట్ ను లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గా మార్చారు. పవర్ ప్రాజెక్ట్ ను పూర్తచేయలేకపోయారు. ఇప్పుడు యూనిట్ రూ.20కి విద్యుత్ కొంటున్నారు.
అదే పోలవరం పూర్తిచేసి, పవర్ ప్రాజెక్ట్ ను రూ.3,500కోట్లతో పూర్తిచేసుంటే, ఇప్పుడు సంవత్సరానికి రూ.3వేలకోట్ల వరకు ఆదాయం తీసుకొచ్చేది. రాష్ట్రానికి 960 మెగావాట్ల జలవిద్యుత్ వచ్చిఉండేది. అవేవీచేయకుండా కేవలం మీస్వార్థంవల్ల, అడ్డగోలు ఆరోపణలుచేసి, జరుగుతున్న పనులను పండబెట్టారు. జూన్ 2019లో పోలవరం అంచనాలు ఆమోదించబడ్డాయ ని, నిధులగురించి వై.ఎస్.జగన్ రెడ్డి గారు, ప్రధానిని కలిసికోరారని, దానికి ప్రధాని సానుకూలంగా స్పందించారని, రూ.55,548కోట్ల అంచ నాలకు అనుమతులు లభించాయని, ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించిన ఘనవిజయమని ట్విట్టర్ పిట్ట సాయిరెడ్డి ట్విట్లర్ లో పెట్టాడు దానిపై అనిల్ కుమార్ ఏంసమాధానం చెబుతాడు?
28 మంది ఎంపీలను చేతిలో ఉంచుకొని కూడా, తాడేపల్లిలో కూర్చొని పబ్జీ ఆడుకుంటూ, సాగునీటి రంగాన్ని భ్రష్టుపట్టించారు. ఈ మంత్రి సైంటిఫిక్ గా కట్టామంటున్నారు..ఏం కట్టాడు.. ఈయనెవరు కట్టడానికి? పోలవరం ప్రాజెక్ట్ అథారి టీ, సెంట్రల్ వాటర్ కమిషన్, డ్యామ్ డిజైన్ రివ్యూకమిటీ అందరి అధ్వర్యంలో రాష్ట్రజలవనరుల శాఖాధికారులు పనిచేస్తారు. ఈ యన సైంటిఫిక్ గా కట్టేదేంటి? డ్యామ్ లో నీళ్లు నిలబడ్డాయని అక్కడికి వెళ్లి ఫొటోలుదిగారు. నిర్వాసితులను గాలికి వదిలేశారు. 18వేలఇళ్లు కడతామన్నారు… ఎక్కడైనా ఒక్కఇల్లుకట్టారా? పోలవరం జూన్ 2021 కి పూర్తి అవుతుంది అన్నారు…నవంబర్ కూడా వచ్చింది. ఇంతవరకు అతీగతీలేదు. పోలవరం ప్రాజెక్ట్ లో ఎలాంటి అవినీతి లేదని, పెంటపాటి పుల్లారావు ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ కు సమాధానంగా, కేంద్ర జల వనరులశాఖాధికారులే స్వయంగా రివ్యూపిటిషన్ వేశారు.
ఇవేవీ తెలు సుకోకుండా చంద్రబాబునాయుడిని ఎన్నాళ్లూ తిడతారు..ఇంకా ఎంత కాలంఇలా కాలక్షేపం చేస్తారు? నెల్లూరు సంగం బ్యారేజీ పనులు పూర్తి కాలేదు. వెలిగొండ టన్నెల్ పనులుకాలేదు. అవుకుటన్నెల్ ను గాలికి వదిలేశారు? ప్రాజెక్టులను గాలికివదిలేశారు, ప్రణాళికలేకుండా పనులు జరుగుతున్నాయని ఒకపత్రికలో రాస్తే, దానికి మంత్రికి కోపం వచ్చింది. జిల్లాలవారీగా ఏప్రాజెక్ట్ పరిస్థితి ఎలాఉందో వివరిస్తూ, రూ.24,781కోట్ల పనులకు పాలనాఆమోదం ఇచ్చి, పనులుచేయకుండా గాలికివదిలేస్తే, దానిగురించి ఒకప్రధాన పత్రికలో రాస్తే, కులాలను తిడతారా? ఇంకా ఎన్నాళ్లూ ఇలా కులాలు, మతాలమధ్యన చిచ్చుపెట్టి పబ్బం గడుపు కుంటారు?
రూ.1270కోట్లను నీరుచెట్టు కింద పనులుచేసిన కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి ఉంది.
అది ఇవ్వకుండా సదరు కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి ఎవరని అడిగి ఏపీ ఆస్తులను తెలంగాణకు కట్టబెట్టాడు? ఎవరిని అడిగి కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లాడు? కాళేశ్వరం ప్రారం భోత్సవానికి వెళ్లిన సిగ్గులేని వ్యక్తి మమ్మల్ని విమర్శిస్తాడా? పాలమూరు రంగారెడ్డి పై గతంలోనే రివ్యూపిటిషన్ వేశాము. ఆ విషయం ఈ మంత్రికి తెలుసా? రూ.4వేలకోట్లు ఖర్చుపెట్టామని ఈ మంత్రి చెబుతున్నాడు. ఏ ప్రాజెక్టులో ఎంతఖర్చుపెట్టాడో, ఏ ఏ పనులు పూర్తిచేశారో పూర్తిసమాచారంతో శ్వేతపత్రం విడుదలచేయగలడా? ఇవీ ఈ మంత్రికి తెలియదు.. తాడేపల్లిలో కూర్చొని సజ్జల రాసిచ్చిన స్క్రిప్ట్ ను వల్లెవేస్తే సరిపోతుందా? ఈ ముఖ్యమంత్రి నవరత్నాలు పేదల జేబులకు నవరంధ్రాలు పెట్టాయి. సాగునీటిరంగం గురించి, ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతికఅర్హత ఈ ముఖ్యమంత్రికి, మంత్రికి లేదు.
ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంతో టీడీపీ కార్యాలయంపైదాడిజరిగితే దానికి నిరసనగా చంద్రబాబునాయుడు 36 గంటలపాటు దీక్షచేశారు. దానిపై నారాలోకేశ్ స్పందిస్తే, పశువులకన్నా హీనంగా వల్లభనేని వంశీ, కొడాలి నానీ మాట్లాడారు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దేలా తెలుగు దేశాన్ని, తెలుగుదేశం అధినేతను ఉద్దేశించి, నీచమైన భాష మాట్లాడు తున్నారు. పరిటాలరవి బొమ్మపెట్టుకొని తిరిగినవ్యక్తి, నేడు సునీతమ్మ ను ఉద్దేశించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. బూతులు మాట్లాడే మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ టీడీపీఅధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలు తరిమితరిమి కొడతారు.
జగన్మోహన్ రెడ్డి కళ్లల్లో ఆనందంచూడటానికి, హైదరాబాద్ లోని మీ ఆస్తులనుకాపాడుకోవడానికి ఇంతనీచంగా మాట్లాడతారా? రాజీనామా పత్రాలు మాకు పంపించ డంకాదు.. స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామాఇస్తే సరిపోతుంది. గన్నవరం ఇంఛార్జ్ గా బచ్చు అర్జునుడిని నియమించాము. రాజీనామాచేసి, రోడ్లపైకి వస్తే, అప్పుడే తేలుతుంది, ఎవరేంటో? మూడుకార్లు, 20 మందిని వెంటేసుకొని తిరిగితే మీ రౌడీయిజానికి భయపడాలా? జగన్మోహన్ రెడ్డి అరాచకాలపై మేము, మ నాయకుడు పోరాడుతుంటే శాపనార్థాలు పెడతారా? కొడాలినానీ గుర్తుపెట్టుకో… ఎన్టీఆర్ భిక్షతోనే నువ్వు ఈనాడు ఆస్థాయిలోఉన్నావని గుర్తుంచుకో. కొడాలినానీ భాషతో ప్రతినాయకుడు, కార్యకర్త రక్తం ఉడికిపోతోంది. రాజీనామాలు చేయకుం డా మీడియాముందు బూతులు మాట్లాడటం మగతనంకాదు.
కృష్ణా జిల్లాలో కొడాలినానీ, వంశీచేస్తున్న దోపిడీని, అవినీతిని ఎవరుఅడిగినా చెబుతారు. పట్టాభి ఇంటిపై, టీడీపీకార్యాలయంపై దాడి చేయించినవారికి, చేసిన వారికి ఈ ముఖ్యమంత్రి 1 ప్లస్ 1 గన్ మెన్లను ఇస్తావా? అంటే మరింతగా దాడులుచేయమని ఈ ముఖ్యమం త్రి ప్రోత్సహిస్తున్నాడా? కొడాలినానీ, వల్లభనేని వంశీల భాషపై ముఖ్యమం త్రే సమాధానంచెప్పాలి. పేకాట ఆడించడం, లారీలకు బాడీలుకట్టించడం తప్ప, ఈ నానీకి ఏమైనా తెలుసా? తనశాఖలో ఏంజరుగుతోందో తెలు సా? రేషన్ బియ్యం పక్కదారి పడుతుంటే , ఈనాని ఏంచేస్తున్నాడు? కొడాలినానీ, లోకేశ్ పెళ్లి జరిగినప్పుడు ఇంటిముందు తాటాకుల పందిరి వేశాడు. అది మర్చిపోతే ఎలా? టీడీపీప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈప్రభుత్వంలో చేస్తున్న అవినీతి కార్యకలాపాలపై కమిషన్ వేసి, ప్రతిఒక్కరినీ శిక్షిస్తాం.