– కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు
విజయవాడ : విదేశీ విద్యా పథకం కింద అర్హులై ఉన్నత విద్య అభ్యసించేందుకు విదేశాలకు వెళ్ళిన కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థుల తల్లితండ్రులు బుధవారం తాడేపల్లి లోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ని కలిసి తమ సమస్యను వివరించారు.
ఆనంతరం చైర్మన్ తో వారు మాట్లాడారు
విదేశాలలో ఉన్నత విద్య అభ్యశిస్తున్న అర్హులైన తమ పిల్లలకు విడుదల చేయవలిసిన విదేశీ విద్య ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని, తమ తరపున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి బకాయి నిధులను విడుదల చేయవలిసిందిగా చైర్మన్ కి ఆర్జీలను అందించారు. ఈ సందర్భంగా చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషీ చేస్తానన్నారు.