– కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి
– దేశానికి ఎనలేని సేవలు అందించారంటూ కొనియాడిన వైసీపీ నేతలు
తాడేపల్లి : తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్ధుల్ కలాం జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు.
విద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన చూపించిన బాటలోనే గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను ఆ రంగాల్లో తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కడు పేదరికంలో జన్మించి, పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, ఈ దేశాన్ని విజ్ఞానపరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అబ్ధుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, రమేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆలూరు సాంబశివరారెడ్డి, షేక్ ఆసీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణ మూర్తి, పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పార్టీ నాయకులు నారమల్లి పద్మజ, కాకాణి పూజిత, బత్తుల రామారావు, దుర్గారెడ్డి, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, దొడ్డ అంజిరెడ్డి, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.