– ప్రజా నాయకులు కావాలనుకునే వాళ్లకు రేవంత్ రెడ్డి ట్రెండ్ సెట్టర్
ముఖ్యమంత్రి పర్యటన అంటే… అబ్బో… ఆ హంగు ఆర్భాటమే వేరు.
భారీ కాన్వాయ్, ప్రభుత్వం సకల హంగులతో రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సు…
ఆ బస్సులో ముందు సీట్లో కూర్చుని ప్రజలకు అభివాదం చేస్తూ అలా వెళ్లిపోవడం… అదే ప్రజలకు మహద్భాగ్యం.
కానీ, తొలి సారి ఒక ముఖ్యమంత్రి పర్యటనలో ఆ ఆర్భాటం లేదు. హంగు లేదు. అత్యంత సాదాసీదాగా, మనలో ఒకడి లాగా, మన ఇంట్లో మనిషి లాగా జరిగింది ఇవ్వాళ కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన.
చుట్టూ పోలీసులు, బారికేడ్లకు అల్లంత దూరం నుండే చేతులు ఊపి వెళ్లిపోవడం లాంటి దృశ్యాలు లేవు.
ముఖ్యమంత్రి కాలనీలన్నీ కాలి నడకన కలియ తిరిగారు. నాయకులు, అధికారుల మధ్య ఆయన ఇరుక్కుపోలేదు. నేరుగా ప్రజల మధ్యకు వెళ్లిపోయారు. బాధితులను తన వద్దకు పిలుపించుకోలేదు. ఆయనే బాధితుల వద్దకు వెళ్లిపోయారు. పొలాల గట్ల పై… మడుల మధ్యకు నడిచి వెళ్లారు. కూలిపోయిన బ్రిడ్జిని స్వయంగా క్షుణ్ణంగా పరిశీలించారు.
కాలనీల్లో, పొలాల్లో సామాన్య జనంతో నేరుగా మాట మంతీ చేశారు. మైకుల్లో స్పీచ్ ఇచ్చి చేతులు దులుపుకోలేదు. మీ మధ్యకు వచ్చా. చెప్పండి అని గోడు విన్నారు. ఈ దృశ్యాలు చూసి ఈయన ముఖ్యమంత్రా? ప్రతిపక్ష నేతనా!? అని డౌట్ వచ్చేటంత దగ్గరగా జనం దగ్గరకు వెళ్లిపోయారు.
డెఫినెట్ గా… ప్రజా నాయకులు కావాలనుకునే వాళ్లకు రేవంత్ రెడ్డి ట్రెండ్ సెట్టర్ గా మారారు అనడానికి ఈ రోజు కామారెడ్డి టూర్ ఒక ఉదాహరణ.