– బీసీ నేతలను టార్గెట్ చేసి భయపెట్టాలని చూస్తున్నారు
– టీడీపీ ప్రోగ్రామ్స్ కమిటీ ఇంఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు
సీఐడీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది. అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తడంలో లీనమైపోయారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ను అక్రమంగా అరెస్టు చేయాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇంటిగోడ కూల్చి ఇబ్బంది పెట్టారు. నేరుగా ఇంటికి ఎందుకు వెళ్లారో, కేసు ఏంటో చెప్పకుండా పోలీసులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. పోలీసుల వికృత చేష్టలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఖాకీ చొక్కాలకు కళంకం తెస్తున్నారు. విజయ్ చేసిన తప్పేంటి.? నోటీసులు ఇవ్వడానికి వెళ్తే ఇంట్లోకి దూరి కుటుంబ సభ్యులను బెదిరిస్తారా? సమాచారం లేకుండా, ఎవరో చెప్పకుండా ఇంట్లో సోదాలు నిర్వహించే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు? పరిధి దాటి వ్యవహరిస్తే చట్టం ముందు చేతులు కట్టుకుంటారని గుర్తుంచుకోండి. చిన్నపిల్లన్న కనికరం లేకుండా వారిని కూడా బెదిరిస్తున్నారు. పోలీసు వ్యవస్థను అడ్డంపెట్టుకుని బీసీల గొంతు నొక్కే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రయత్నించడం దుర్మార్గం.