Suryaa.co.in

Devotional

పునర్జన్మ భావన

పునర్జన్మ భావాన్ని మొట్టమొదటిగా ప్రకటించిన ఉపనిషత్తు ఛాందోగ్యం.

”కర్మల్ని బట్టి మళ్ళీమళ్ళీ పుడతారు” అని చెప్పింది ఈ ఉపనిషత్‌.
ఛాందోగ్యోపనిషత్తు, ఉపనిషత్తులో చనిపోయాక ”ఆత్మ” ఎలా తన యాత్ర కొనసాగిస్తుందో చెప్పే వివరణ ఉంది.

ఈ యాత్ర 2 యానాలుగా ఉంది.

1. పితృయానం, 2. దేవయానం.

పితృయానంలో జీవుడు చనిపోయాక ఆత్మ తొలుత పొగలోకి వెళ్తుంది. అక్కడ నుండి రాత్రికి, రాత్రి నుండి కృష్ణపక్షానికి, అక్కడి నుండి దక్షిణాయనానికి , అటునుండి 6 మాసాలకు, ఆ తర్వాత పితృలోకం, అక్కడినుండి ఆకాశం, ఆకాశం నుండి చంద్రమండలం చేరుతుంది.

ఆ ఆత్మ గడువు తీరేదాకా అక్కడే ఉంటుంది. గడువు తీరాక తిరిగి భూలోక ప్రయాణం చేస్తుంది. తిరుగు ప్రయాణంలో …

తిరిగి ఆకాశం, అక్కడి నుండి వాయువును, వాయువు నుండి పొగకూ, పొగనుండి మేఘాలకు చేరి, వర్షంతో కలిసి భూమికి చేరుతుంది. అక్కడ వరిధాన్యంగానో, ఔషధిగానో, వనస్పతిగానో, అపరాలుగానో మారుతుంది. ఇలా వివిధ ఆహార పదార్థాల నుండి ఆత్మ తిరిగి జీవుడిగా జన్మిస్తుంది”

ఇదీ .. ఛాందోగ్యోపనిషత్‌లో ఆత్మ షటిల్‌ సర్వీస్‌.

ఆత్మ వృక్షాలు, వనస్పతులు, అంతరిక్షం నుండి వస్తుందని చెప్పిన వేద ఋషుల భావాలకు ఒక నిర్దిష్టరూపం ఈ ఉపనిషత్తు కల్పించింది. ఈ భావనే భగవద్గీతలో ”అన్నాద్భవంతి భూతానీ…” అనే శ్లోకంలో కన్పిస్తుంది.

ఇక, రెండోయాత్ర దేవయానం. ఈ యాత్ర ముక్తిపొందిన వారిది. జీవన్ముక్తులు ఈ యాత్ర కొనసాగిస్తారు. వీరిది నిష్కామకర్మ. వీరు తిరిగి మరలా పుట్టరు. వీరి ఆత్మకు మానవ జీవనం నుండి విముక్తి కల్గుతుంది.

ఛాందోగ్యం వీరి యాత్ర ఇలా కొనసాగుతుందని చెప్పింది…

”మరణించిన వారి ఆత్మ మొదటిగా కిరణాల్ని చేరుతుంది. అక్కడి నుండి పగలు, అక్కడి నుండి శుక్లపక్షం, అక్కడి నుండి ఉత్తరాయనం 6 నెలలు, అక్కడి నుండి సంవత్సరం, అక్కడి నుండి సూర్యలోకం అక్కడి నుండి చంద్రలోకం, అక్కడి నుండి విద్యుత్తుకు చేరి అక్కడ నుండి బ్రహ్మలోకం పోతుంది. అక్కడ ‘అ-మానవులు’ ఉంటారు. వారు ఈ జీవుణ్ణి బ్రహ్మ దగ్గరకు తీసుకుపోతారు. ఆత్మ అక్కడే ఉండిపోతుంది.

ఈ భావనే ఆ తర్వాత కైవల్యంగా మారింది. శైవులు శివైక్యం పొందటం, విష్ణు భక్తులు నారాయణ పథం చేరడం (వైకుంఠానికి పోవడం) జైనులు, బౌద్ధులు నిర్వాణం పొందడం- ఇలా విభిన్న పద్ధతులుగా వ్యక్తం అయ్యింది.

అయితే, ఛాందోగ్యంలో గమనించాల్సిన విషయం ఒకటుంది. ముక్తి పొందిన ఆత్మ- వేదాల్లో సూపర్‌ పవర్‌గా ఉన్న ఇంద్రలోకం పోలేదు. కొత్తగా రూపొందిన బ్రహ్మలోకం వెళ్ళింది. ఇది వేదాన్ని బలంగా తిరస్కరించడమే.

బృహదారణ్యకం

”జీవుడు చనిపోయాక అతని శరీరంలోని ఇంద్రియాలు తిరిగి భూతాల్లో కలిసిపోతాయి. ఆత్మ మాత్రం ఆకాశంలో కలిసిపోతుంది” – అని బృహదారణ్యకోపనిషత్‌లో వుంది.

ఈ ఉపనిషత్‌ ‘ఆత్మ’ అనేది ‘ఆకాశం’ అనే ఇంద్రియానికి సంబంధించిందిగా చెప్పింది.

అయితే, మనం ఇక్కడే ఒక విషయాన్ని గుర్తించుకుంటే బావుంటుంది.

బుద్ధుడు ఉపనిషత్తులు చెప్పిన పంచభూతాల్లో ”ఆకాశం” అనే భూతాన్ని ఒప్పుకోలేదు. అలాగే ఆకాశభూత నిర్మితిగా చెప్పిన ”ఆత్మ”నూ అంగీకరించలేదు.

ఐతరేయం

ఈ ఉపనిషత్‌ లో ”పునర్జన్మ” భావాలు ఒక కల్పనగానే కన్పిస్తాయి. దీనికి ముందున్న ఉపనిషత్తులు పునర్జన్మ గురించి ఎంతగా చెప్పినా అది ఈ ఉపనిషత్‌ కాలానికి ఈ దేశప్రజల్లో బలంగా నాటుకుపోలేదు. ఈ ఉపనిషత్‌ జన్మల్ని 3 రకాలుగా వర్గీకరించింది.-

మొదటి జన్మ: పాలలో వెన్నలా, చెరకురసంలో బెల్లంలా పురుషుని దేహంలో ”రేతస్సు”(వీర్యం) ఉంటుంది. ఇది స్త్రీ గర్భంలో పడడమే మొదటి జన్మ. గర్భధారణ ప్రక్రియ మూలం పురుషుడేే. స్త్రీ కాదు. అని చెప్తుంది ఈ ఉపనిషత్‌.

రెండవ జన్మ: స్త్రీ గర్భాశయంలో పెరిగి పెద్దయి- పుట్టడం జీవుని రెండో జన్మ.

మూడవ జన్మ: ఈ జీవుడు పెరిగి పెద్దవాడై, తండ్రిగా మారి, తిరిగి పుత్రునిగా పుట్టడం మూడో జన్మ-

ఇలా ప్రతి జీవికి తను తల్లి కడుపున పుట్టడం, భూమ్మీద పడడం, తిరిగి తను భార్యవలన బిడ్డగా పుట్టడం ఈ మూడు జన్మలూ ఒక పరంపరగా ఉంటాయి. ఇలా ఈ లోకం ‘సంతానం’ రూపంలో తెంపు లేకుండా ఉంటుంది. – అంటుంది ఈ ఉపనిషత్‌. ఈ భావాలు బౌద్ధంలోని ప్రతీత్య సముత్పాదానికి నకలే.

ఇక ఆ తర్వాత ఉపనిషత్తుల్లో ‘ఆత్మ’ భావాలు ఎన్నెన్ని ఉన్నా అవన్నీ బుద్ధుని తర్వాత కాలానివే. దాదాపుగా ఇదే కాలంలో కొందరు స్వతంత్ర దార్శనికులు ఉన్నారు. వారు కూడా ‘ఆత్మ’ ‘దేవుడు’ ‘పునర్జన్మ’ మీద తమ తమ అభిప్రాయాలు చెప్పారు. వాటినీ చూద్దాం-

చార్వాకుడు: ‘భగవంతుడు లేడు. ఆత్మలేదు. పునర్జన్మలేదు. పరలోకం లేదు.’ అని చెప్పాడు.

అజితకేశకంబళి: పరలోకం లేదు. మూర్ఖుడైనా, పండితుడైనా చనిపోగానే ఉచ్ఛిన్నుడవుతాడు.

మక్కలిగోశాలి: ”జీవుల పాపపుణ్య కర్మలు ముందే నిర్ణయించబడతాయి. ప్రత్యేక పూజల వల్ల, శీలం వల్ల, దానం వల్ల అవి మారవు. ఆరు జన్మల వరకూ జీవులు సుఖదుఃఖాలు అనుభవించాల్సిందే.

ప్రకృథ కాత్యాయన్‌: ప్రతి వస్తువూ అచలమైంది. నిత్యమైంది. ఏ కర్మా దాని మూలాన్ని మార్చలేదు. (అంటే కర్మ ప్రభావం వస్తువు మీద పడదు) కాబట్టి పాపపుణ్యాలు అంటవు.

పూరణ కశ్యపుడు: ‘ఎంత మంచిపని చేసినా పుణ్యం రాదు. ఎంతచెడ్డ పనిచేసినా పాపం అంటదు’- అంటాడు. ఆయన అక్రియతావాది. అహేతువాది. అ ప్రత్యయవాది. అంటే కార్యకారణవాదాన్ని ఒప్పుకోడు. అసత్తు నుండి (లేని దాన్నుండి) సత్‌ (ఉన్నది) ఉత్పత్తి అవుతుంది అంటారు. ఈయన వాదాన్ని ‘అదిత్య సముత్పాదం’ అంటారు.

ఆత్మ ఉండొచ్చు. ఆత్మ లేకపోవొచ్చు. ఆత్మ ఇదని చెప్పలేనిది కావొచ్చు…’ అని మహావీరుడు చెప్పాడు.

ఇవీ, బుద్ధుని కాలం వరకూ ఉన్న దైవ, ఆత్మ, పునర్జన్మ భావాలు.

ఇవి నిజాలైనా కాకపోయినా, సత్యాలైనా కాకపోయినా మానవ విజ్ఞాన ప్రవాహంలో ఇవన్నీ మైలురాళ్ళే. తీసిపారేయాల్సినవి కావు. ప్రపంచంలో ఈనాటికీ ఈ భావాలన్నీ ఉన్నాయి. ఇంకా బ్రతికే ఉన్నాయి. అక్కడక్కడా కొద్దిగా రూపుమార్చుకున్నాయి తప్ప, దాదాపుగా అన్ని ధోరణులూ ఏదొక ప్రాంతంలో, ఏదొక జాతిలో బ్రతికే ఉన్నాయి.

ఇవి మైలురాళ్ళని ఎందుకన్నానంటే… ఒక్కసారి చిన్నతనంలో ‘ఆవు-పెద్దపులి’ పాఠంలోని ఒక పద్యం గుర్తుకు తెచ్చుకుంటే ఈ విషయం తేలిగ్గా అర్థం అవుతుంది.

”నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటే…” అనే పద్యాన్ని చూద్దాం. దాని అర్థం ఇది…..

వంద మంచినీటి కయ్యలకంటే ఒక బావిమేలు.
వంద బావులకంటే ఒక్క జలాశయం మేలు
వంద జలాశయాల కంటే ఒక్క క్రతువు మేలు
వంద క్రతువుల కంటే ఒక్క కొడుకు మేలు
వందమంది కొడుకుల కంటే ఒక సత్యవాక్యం మేలు…” అన్నట్టు…

జనన మరణాల గురించి పట్టించుకోని ఇతర జీవప్రపంచం కంటే …
జననమరణాల ప్రాధాన్యతను గురించి మానవులకు తొలిగా కలిగిన భావనలు వందరెట్లు మేలు.

దానికంటే …మరణానంతర సంస్కారాలు సాగించడం వందరెట్ల మేలైన ఆలోచన.
ఈ ఆలోచనే మరణానంతర జీవితం గురించి ఆలోచించడానికి పునాది అయ్యింది కాబట్టి.. దేవుడు, దైవలోక భావనలు వందరెట్లు మేలు.
ఈ దైవభావనలో మానవ సమాజ జీవనానికీ, సామాజిక నియమాలకూ సంబంధించిన మంచి-చెడులకు ముడిపెట్టి ”స్వర్గ-నరకాలు” భావన చేయడం ఈ మంచి చెడులతో తిరిగి మరలా, మరలా పుడతాం అనే ఆలోచన ఇంకాస్తమేలు.
ఇలా తిరిగి పుట్టేది ఒకటుందనీ, అదే ”ఆత్మ” అని ఆలోచించడం, ఇంకా మేలైన ఆలోచనే…..

మహాభారతం లోని ఒక చిన్న భక్తి కథ
కలికాలం మెదలయింది……
పంచ పాండవులలో ఒకరైన సహదేవుడు ఒకరోజు గుర్రాలు సంతలోకి వెళ్లారు. ఆ సంతలో అతను ఒక అందమైన గుర్రాన్ని చూసారు. అరెరె ఇంత అందమైన గుర్రాన్ని నేను ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు. ఎలాగైన సరే నేను ఈ గుర్రాన్ని ఎంత దరకైన కొనాలి ఆనుకొని గుర్రం యజమాని గారిని గుర్రం ధర ఎంత అని అడిగారు.

గుర్రాన్ని నేను ఎవరకూ అమ్మను కానీ ఎవరైతే నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెపుతారో వారికి నా గుర్రాన్ని ఉచితంగా ఇస్తాను అని చెప్పారు. సహదేవుడు సరే నన్ను అడుగు ఎటువంటి ప్రశ్నలకైన నేను సమాధానం చెపుతాను అని చెప్పారు.

దానికి గుర్రం యొక్క యజమాని, సరే నేను అడిగే ప్రశ్నలు చాలా జాగ్రత్తగా విని సమాధానాలు చెప్పి గుర్రాన్ని ఉచితంగా తీసుకుని వెళ్లు అని ప్రశ్నలు అడుగుట మెదలుపెట్టారు.

మెదటి ప్రశ్న:

ఒక పెద్ద బావి ఉంది. ఆ పెద్ద బావి లోని నీరు ని తీసుకుని వెళ్లి ఏడు చిన్న బావులను పెద్ద బావి లోని నీటితో నింపవచ్చు కానీ ఆ ఏడు చిన్న బావులలోని నీటితో పెద్ద బావిని నింపలేము ఎందుకు అని అడిగారు. మరల
గుర్రం యొక్క యజమాని, బాగా ఆలోచించి నాకు సమాధానం చెప్పండి అని అడిగారు.

సహదేవుడు కొంచెం సమయం దాకా బాగా ఆలోచించిన కూడా సమాధానం చెప్పలేకపోయారు. చేసేది ఏమి లేక అక్కడే ఉండి పోయాడు. కొంచెం సమయం తరువాత నకులుడు సహదేవుడు ను వెతుక్కుంటూ వెతుక్కుంటూ సహదేవుడు ఉన్న గుర్రాలు సంతకు చేరుకున్నారు.

సహదేవుడు ని చూసిన నకులుడు ఎందుకు ఇక్కడ కూర్చుని పోయునావు అని అడిగారు. దానికి సహదేవుడు ఆ గుర్రం మరియు గుర్రం యొక్క యజమాని గురించి నకులుడు కి వివరంగా చెప్పారు. ఆ గుర్రమును చూసిన నకులుడు ఆశ్చర్యపోతూ , సహదేవ నీవు చెప్పినట్లు ఈ గుర్రం ఎంత అందంగా ఉంది. ఎలగైన సరే దీనిని మనం మన రాజ్యానికి తీసుకుని వెళ్లాలి అని గుర్రం యొక్క యజమానిని నకులుడు కలిసి నన్ను అడుగు ఎటువంటిప్రశ్నలయున నేను నీకు సమాధానం చెప్పి ఆ గుర్రాన్ని మా అన్నయ్య సహదేవుడు కి బహుమతి గా ఇస్తాను అని చెప్పారు.

గుర్రం యొక్క యజమాని సరే నీవైన జాగ్రత్త గా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పు అని రెండోవ ప్రశ్నను అడిగారు .

రెండోవ ప్రశ్న

మనము బట్టలు కుట్టటం కోసం ఉపయోగించే సూది రంధ్రం ద్వారా పెద్ద ఏనుగు ఇవతలి వైపు నుండి రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లింది కానీ ఆ ఏనుగు తోక మాత్రం ఆ సూది రంధ్రంద్వారా వెళ్ల లేకపోయింది . అది ఏమిటి అని అడిగారు.
ఈ ప్రశ్నకు నకులుడు సమాధానం చెప్పలేకపోయారు. చేసేదేమీ లేక సహదేవుడు మరియు నకులుడు ఆ సంతలో ఉండి పోయారు. ఎంతసేపటికి తమ్ముళ్ళిద్దరూ రాజ్యానికి రాక పోయే సరికి కంగారుగా ధర్మరాజు భీముడు ను పిలిచి తమ్ముళ్ళిద్దరు ను వెతుక్కుని ఎక్కడఉన్న రాజ్యానికి తొందరగా తీసుకుని రావాలి అని చెప్పారు.

అన్నగారు మాటలు ప్రకారం భీముడు తమ్ముళ్ళిద్దరను వెతుక్కుంటూ వెళ్ళాడు.
చివరికి తమ్ముళ్ళిద్దరను ఒక సంతలో చూసి
తమ్ముళ్ళిద్దరను ఎందుకు ఇక్కడ కూర్చుని ఉన్నారు అని అడిగారు. అన్నయ్య ధర్మరాజు గారు చాలా కంగారు పడుతున్నారు. వెంటనే రాజ్యానికి బయలుదేరి వెళ్లదాము అనగానే తమ్ముళ్ళిద్దరను అక్కడ వారు ఎందుకు ఉన్నారో వివరంగా చెప్పారు.

అంతా వినిన భీముడు గుర్రం యొక్క యజమాని గారిని కలిసి నేను మీ ప్రశ్నలకు సమాధానాలు చెపుతాను అన్నారు. గుర్రం యొక్క యజమాని చూడండి నేను వేసిన రెండు ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీ
తమ్ముళ్ళిద్దరు ఓడిపోయారు. కావున నీవు బాగా ఆలోచించి ఆలోచించి సమాధానం చెప్పాలని అన్నారు. దానికి సరే అన్నారు భీముడు.

మూడవ ప్రశ్న

ఒక పొలంలో ధాన్యం బాగా పండింది. ఆ పొలం చుట్టూ పెద్ద పెద్ద గట్టులు ఉన్నాయి. ఆ ధాన్యం పంట కోసే సమయంలో ధాన్యం మాయమైంది. అది ఎలా అని అడిగారు. భీముడు కూడా సమాధానం చెప్పలేకపోయారు. తమ్ముళ్ళిద్దరను రాజ్యానికి తీసుకుని వెళ్లి జరిగింది జరిగినట్లు అన్ని అన్న ధర్మరాజు గారు కి వివరంగా చెప్పారు.

అన్న ధర్మరాజు గారు ఆ ప్రశ్నలన్నీ వినిన తరువాత చెమటలు పట్టి భయపడ్డారు. అన్నయ్య ధర్మరాజు గారు లో భయాన్ని చూసిన తమ్ముళ్ళందరూ ఏమిటి అన్నయ్య మీరు సమాధానాలు చెప్పలేక భయపడుతున్నారా అనగానే అన్నయ్య ధర్మరాజు గారు నేను బయటపడుతుంది సమాధానాలు చెప్పలేక కాదు. మిమ్మల్ని ఆ ప్రశ్నలన్నీ అడిగింది కలిపురుషుడు. అతను కలికాలం లో జరిగే యధార్థ సంఘటనలను ప్రశ్నల రూపంలో మిమ్మల్ని అడిగారు.
మెదటి ప్రశ్నకు సమాధానం. పెద్ద బావి అనేది తల్లి తండ్రులు. ఏడు చిన్న బావులనేవి వారి పిల్లలు. తల్లి తండ్రులు ఎంత మంది పిల్లల కైనా ప్రేమ ఆప్యాయతలతో పెంచి పోషిస్తారు.

కానీ అదే తల్లి తండ్రులు వృద్ధులు అయినా తరువాత ఆ ఏడుగురు పిల్లలు తల్లి తండ్రులను భారంగా చూస్తారు.

రెండో వ ప్రశ్నకి సమాధానం . ఏనుగు అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు. ఏనుగు తోక అంటే చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు.

ఏనుగు రంధ్రం ద్వారా అవతలి వైపుకు వెళ్లిపోతుంది అంటే పెద్ద పెద్ద అవినీతి పరులు చట్టానికి దొరక్కుండా రంధ్రం ద్వారా వెళ్లిపోతారు. కానీ చిన్న చిన్న దొంగతనాలు చేసేవారు ఆ రంధ్రం దాటలేక ఆ ఏనుగు తోక లాగా ఇరుక్కు పోతారు.

మూడవ ప్రశ్నకు సమాధానం. ఇక్కడ ధాన్యం అంటే ప్రజలు. చుట్టూ ఉన్న పెద్ద పెద్ద గట్టులు అంటే అధికారులు. ఎంతమంది అధికారులు ఉన్న ప్రజలకు దక్కాల్సిన ఫలాలు అధికారులు స్వాహా చేస్తారు. ఆ విధంగా ధాన్యం మాయమైనట్లు ప్రజల ఫలాలు కూడా అధికారులు మాయం చేస్తారు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు మీకు కలిపురుషుడు ముందుగా తెలియ చేసారు అని ధర్మరాజు గారు తమ్ముళ్ళందరకూ వివరంగా చెప్పారు.

 

LEAVE A RESPONSE