Suryaa.co.in

Telangana

మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం

– బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
– ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో ఎండిపోయిన పంట పొలాలని పరిశీలించిన బీజేపీ బృందం

రామన్నపేట: ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించకుండా, డీ లిమిటేషన్ పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాత్రలు చేస్తున్నాడని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి , కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి మండిపడ్డారు.

కరెంట్ సమస్యలతో ఎండిపోయిన రైతు కుటుంబాలకు ఎకరానికి 30000 రూ||ల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ,రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని కోరారు.

రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఎకరానికి 12 వేల రూపాయలు అందజేస్తామని నేటికీ రైతులకు అందకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని తెలిపారు. ఎన్నికల సమయంలో కౌలు రైతు కుటుంబాలని ఆదుకుంటామని హామీలు ఇచ్చి, నేడు వారిని ఆదుకోని ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు.

ధర్మారెడ్డి,ఫిలాయిపెల్లి కాలువలకి నిధులు కేటాయించి, మరమ్మత్తులు చేసి రైతులకు సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో రైతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి,రైతులకు న్యాయం జరిగే వరకూ రైతు పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించడమైనది.

ఈ కార్యక్రమం లో నకిరేకల్ ఇంచార్జ్ నకిరేకంటి మొగులయ్య, స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య , జిల్లా కార్యదర్శి తాటిపాముల శివకృష్ణ , బిజెపి రామన్నపేట మండల అధ్యక్షులు బండ మధుకర్ రెడ్డి , నార్కట్ పల్లి మండల అధ్యక్షులు కొరివి శంకర్, చిట్యాల మాజీ పట్టణ అధ్యక్షులు కూరెళ్ళ శ్రీను ,బట్టి రమేష్ మల్లికార్జున చారి ,గోపగోని అశోక్ గంజి శ్రీనివాస్ ,రేపాక లింగస్వామి ,జాల చంద్రయ్య బెల్లీ కేశయ్య బెజ్జంకి శివకుమార్ నోముల శ్రీనివాస్ భాషాకారుల నరేందర్ రెడ్డి సింగు శంకర్ రెడ్డి బోయపల్లి ప్రవీణ్ వీరమల్ల వీరేష్ గురజాల నవీన్ రెడ్డి మచ్చ మహేష్ కంచి రమేష్ బెల్లి ముత్యాలు ఐలాపురం అశోక్ శ్యామల గణేష్ మచ్చ సింహాద్రి మోరే రాజయ్య ఆకిటి యాదయ్య ఆకిటి వేణు బాత్క జానీ ఎర్ర కిరణ్ తిరుపాల మల్లేష్ డాకోజి నాగరాజు నల్లబోతు తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE