హైకోర్ట్ వ్యాఖ్యలతో తలఎక్కడ పెట్టుకుంటావు జగన్ రెడ్డి?

• దళిత, గిరిజన నిధుల్ని దారిమళ్లించే హక్కు, అధికారం జగన్ రెడ్డి ప్రభుత్వానికి లేవని న్యాయస్థానం తేల్చేసింది
• నిధుల మళ్లింపు జరిగితే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పింది
• ఎస్సీ, ఎస్టీ, గిరిజన నిధుల్ని నవరత్నాలకు మళ్లిస్తే, వారెలా వృద్ధిలోకి వస్తారన్న న్యాయస్థానం వ్యాఖ్యలపై, ఆయావర్గాల మంత్రులు ఏంచెబుతారు?
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు

దళిత, గిరిజన ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, తన చేతగాని పాలనతో ఆయా వర్గాలనే నట్టేట ముంచాడని, ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని దారిమళ్లిస్తూ, వారి గొంతు కోస్తున్నాడని, ఎస్సీఎస్టీల సంక్షేమానికి వినియోగించాల్సిన నిధుల్ని దారిమళ్లించే అధికారం, హక్కు మీకు ఎవరిచ్చారన్న హైకోర్ట్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి తలఎక్కడ పెట్టుకుంటాడని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి నక్కా ఆనంద్ బాబు నిలదీశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“దళితులఓట్లతోనే జగన్ రెడ్డి సీఎం అయ్యాడు. జగన్ రెడ్డిని నమ్మి దళిత,గిరిజనులు దగా పడ్డారు. రాజ్యాంగం ద్వారా వారికి వచ్చిన హక్కులు, అవకాశాల్ని సైకోసీఎం కాలరాస్తున్నా డు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనల్ని అవమానిస్తున్నాడు. దళితుల సంక్షేమానికి జగన్ రెడ్డి రూపాయి ఖర్చుచేయలేదన్న పచ్చినిజం న్యాయస్థానం సాక్షిగా బట్టబయలైంది. దళితపథకాలరద్దుపై, ఎస్సీఎస్టీ నిధుల దారిమళ్లింపు వ్యవహారంలో రాష్ట్ర హైకోర్ట్ లేవనెత్తిన అభ్యంతరాలపై జగన్ రెడ్డి తనతల ఎక్కడపెట్టుకుంటాడో సమాధానంచెప్పాలి. ఎస్సీ కార్పొ రేషన్ నిధుల్లో పైసాకూడా దారిమళ్లించడానికి వీల్లేదని 2003లోనే రాష్ట్ర హైకోర్టు చెప్పింది. ఏకోర్టుచెప్పినా తమకేం పట్టదు…తమకు నచ్చినట్టే చేస్తామన్నట్టుగా జగన్ అండ్ కో వ్యవహరిస్తున్నారు. దళితుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.7వేలకోట్లు కేటాయించిన జగన్ సర్కారు, ఒక్కరూపాయికూడా వారికోసం ఖర్చుచేయలేదన్న పచ్చినిజం నిన్న న్యాయస్థా నం సాక్షిగా బట్టబయలైంది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు ఏమయ్యాయన్న న్యాయస్థానం ప్రశ్న కు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలదా?

హైకోర్ట్ వ్యాఖ్యలపై దళిత, గిరిజన మంత్రులు ఏం సమాధానం చెబుతారు?
దళితుల నిధుల వ్యవహారంపై నిన్న హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీస్తే, పాలకులు తెల్లముఖా లేశారు. దళితులకు జగన్ రెడ్డిచేస్తున్న అన్యాయంపై, రాష్ట్ర హైకోర్ట్ వ్యాఖ్యలపై దళిత, గిరిజన మంత్రులు ఏంసమాధానం చెబుతారు? రాష్ట్రంలోని కోటి40లక్షల దళిత, గిరిజను ల్ని రోడ్డునపడేసిన ముఖ్యమంత్రి, ఐదుగురుకి మంత్రి పదవులిచ్చానంటే సరిపోతుందా? పదవుల పిచ్చితో, డబ్బువ్యామోహంతో దళిత మంత్రులు, ప్రజాప్రతినిధులు సిగ్గులేకుండా ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. కోర్టులో దళితులకు సంబంధించిన కేసుపై విచారణ జరిగినా, ఈ ముఖ్యమంత్రి గిరిజనుల్ని కూడా దారుణంగా వంచిస్తున్నాడని తెలుసుకోవాలి. దళితుల పథకాల్ని జగన్ కావాలనే, కుట్రపూరితంగా రద్దుచేశాడని ఘంటాపథంగా చెప్ప గలం.

చంద్రబాబు ఎస్సీ,ఎస్టీలకు అమలుచేసిన 27సంక్షేమ పథకాల్ని, జగన్ రెడ్డి ఆపేయడం, అతను దళితులకు చేసిన ద్రోహం కాదా?
ఎన్టీఆర్, చంద్రబాబులు దళితులకు చేసిన మేలు మాటల్లోచెప్పలేనిది. జనాభా దామాషా ప్రకారం దళితులకు 14శాతం రిజర్వేషన్లు అమలుచేయాల్సి ఉంటే, స్వర్గీయ ఎన్టీఆర్ 15 శా తం అమలుచేశాడు. చంద్రబాబు 2014-2019లో ప్రత్యేకంగా దళితులకే 27 పథకాలు అమలుచేశాడు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మరుక్షణమే జగన్ రెడ్డి, 27 పథకాల్ని పాత రేశాడు. ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో సబ్ ప్లాన్ నిధులతో ఒక్క దళిత కాలనీలో అయినా 100మీటర్ల రోడ్డు వేశాడా? టీడీపీప్రభుత్వం రూ.1350కోట్లతో దళితవాడల్లో 5,384 కిలోమీ టర్ల సీసీరోడ్లువేసింది. దళితయువత ఉపాధికోసం ప్రత్యేక పథకాలు అమలుచేసి, వేలకోట్ల నిధులు వెచ్చించింది. టీడీపీప్రభుత్వంలో దళితులకు కేటాయించిన వాహనాలు, పనిముట్లు జగన్ రెడ్డి తుప్పుపట్టేలా చేశాడుగానీ, ఒక్కదాన్నికూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. అధికా రులు కమీషన్లు దండుకొని, దళితయువతకు అందించాల్సిన వాహనాలు, యంత్రాల్ని అనర్హులకు కట్టబెట్టారు. మూడున్నరేళ్లలో ఒక్కదళిత యువకుడికైనా స్వయంఉపాధి రు ణం, ఒక పరికరం, ఒక వాహనం ఇచ్చానని జగన్ రెడ్డి చెప్పగలడా?

దళిత, గిరిజనులకోసం పనిచేయని కార్పొరేషన్లు ఎందుకు?
2013లో చట్టంగా మారిన ఎస్సీ సబ్ ప్లాన్ ని జగన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది. కేంద్రం దళితులకు ఇచ్చే ఎన్.ఎస్.ఎఫ్.డీ.సీ నిధుల్నికూడా జగన్ రెడ్డి రాకుండా చేశాడు. రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా, కేంద్రనిధులు నిలిచిపోయేలా చేశా డు. దళితులకోసం ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు, గిరిజనులకోసం ట్రైకార్ పనిచేయనప్పుడు, వాటిని ఈ ప్రభుత్వం ఎవరికోసం నడుపుతోంది? వేలమంది సిబ్బంది ఏంచేస్తున్నారు? కార్యాలయాలు, సిబ్బంది కోసం ప్రజాధనం లూఠీ చేయడం దేనికని ప్రశ్నిస్తున్నాం. దళిత, గిరిజన సంఘాలు గొంతెత్తకపోతే, ఆయావర్గాలభావితరాలు తీవ్రంగా నష్టపోతాయి.
జగన్ రెడ్డి రద్దుచేసిన 27 దళిత పథకాల్ని వెంటనే పునరుద్ధరించాలి. దామాషా ప్రకారం ఈ ప్రభు త్వం ఏర్పాటుచేసిన మూడుకార్పొరేషన్లకు నిధులిచ్చి, దళిత, గిరిజనులకు దక్కాల్సిన రాయితీలు, రిజర్వేషన్లు, పథకాలు సక్రమంగా అందించాలి. జగన్ రెడ్డి దళిత, గిరిజనులకు చేస్తున్న ద్రోహాన్ని బయటపెట్టి, ఆయన బండారం బయటపెడతాం” అని ఆనంద్ బాబు పత్రికాముఖంగా హెచ్చరించారు.

Leave a Reply