విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యం

కళ్యాణదుర్గంలో రాష్ట్ర స్ధాయి హ్యాండ్ బాల్ పోటీలను ఫ్రారంభించిన మంత్రి ఉషాశ్రీచరణ్

కళ్యాణదుర్గం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్ధాయి హ్యాండ్ బాల్ పోటీలకు ముఖ్య అతిధిగా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి కే.వి.ఉషాశ్రీచరణ్ హాజరై హ్యాండ్ బాల్ పోటీలను ప్రారంభించారు.

ఈ‌ సందర్భంగా మంత్రి విధ్యార్ధుల గౌరవ వందనం ను స్వీకరించి పోటీల్లో పాల్గొననున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. అనంతరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నూతనంగా నిర్మించిన అదనపు భవనమును ప్రారంభించటం జరిగింది.