గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి

– మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ హాల్ లో తెలంగాణ బంజారా ఎంప్లాయిస్ సేవాసాంగ్ 25.వ సిల్వార్ జూబ్లీ వేడుకలలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు ఉపాధ్యాయ MLC రగొత్తమ్ రెడ్డి ఎమ్మెల్యే గూడెం మహిపల్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు ఏమన్నారంటే..గిరిజనులకు ఇచ్చిన ప్రతీ మాట కేసీఆర్ నిలబెట్టుకున్నారు.తెలంగాణ వచ్చిన తర్వాత రిజర్వేషన్లు 6 శాతం నుంచి 10 శాతానికి పెరిగాయి. 81 వేల ఉద్యోగ నియమాకాల్లోనూ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయబోతున్నాం.సీఎం కేసీఆర్ హైదరాబాద్ ఆత్మగౌరవ భవనానికి ఎకరం స్థలం, 23 కోట్లు ఇచ్చారు.

తెలంగాణ వచ్చాక 75 గిరిజన కళాశాలలు ఇచ్చాము.గిరిజనులను ఇతర పార్టీలు ఓటు బ్యాంకుగా చూసారు.దేశంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.రాష్ట్రంలో 2, 471 తాండలను గ్రామపంచాయతీలుగా చేశాము.తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలేదో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

గిరిజన యూనివర్సిటీ నిర్మాణం కోసం స్థలం రెడీగా ఉంది.లంబాడాలకు రిజర్వేషన్లు తొలగించాలని రాష్ట్రానికి చెందిన ఓ ఎంపీ కోరుతున్నారు. మతతత్వ బిజెపి పట్ల గిరిజనులు అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి. ఖాళీలను భర్తీ చేయకుండా ప్రభుత్వ రంగ సంస్థలను బిజెపి ప్రభుత్వం అమ్మడం దారుణం.

Leave a Reply