-
రేవంత్ రెడ్డి తమ్ముడు ఆ కంపెనీకి డైరెక్టర్
-
ఈ వ్యవహారం పై దర్యాప్తు జరగాలి
-
15 రోజుల క్రితం ఏర్పాటైన సంస్థ తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడమేమిటీ ?
-
గోడీ సంస్థతో ఒప్పందం అంటూ సీఎం రేవంత్ గతం లో బోడి మాటలు చెప్పారు
-
నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరకే ఎందుకు వెళ్లారు ?
-
రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్నీ బోగసే
-
కేటీఆర్ లాగా తనకు ఇంగ్లీష్ రాదని రేవంత్ కు అసూయ
-
కేటీఆర్ లాగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి మంచి ట్యూటర్ ను పెట్టుకోవాలి
-
రెసిడెన్షియల్ స్కూళ్ళు బాగున్నాయి అని ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా
-
ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల ను మూసివేసే కుట్ర
-
బీఆర్‌ఎస్ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి , డాక్టర్ కె సంజయ్
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి తమ్ముడు డైరెక్టర్ గా ఉన్న స్వచ్ బయో తో ఒప్పందం పెద్ద కుంభ కోణం. ఈ వ్యవహారం పై దర్యాప్తు జరగాలి. 15 రోజుల క్రితం ఏర్పాటైన సంస్థ తో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవడమేమిటీ ? గోడీసంస్థ తో ఒప్పందం అంటూ సీఎం రేవంత్ గతం లో బోడి మాటలు చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి తో పాటు సీ ఎస్ ,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అమెరికా వెళ్లారు. మొత్తం పాలన అంతా అమెరికా నుంచే నడుస్తోంది. ఇలా ముఖ్యమైన అధికారులు విదేశీ పర్యటన కు వెళ్లిన సందర్భం గతం లో లేదు. రాష్ట్రం లో పాలన పడకేసింది. రేవంత్ రెడ్డి ఎన్నారై లను నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నారు. మరి వారి దగ్గరకే ఎందుకు వెళ్లారు ? రేవంత్ రెడ్డి తెచ్చానని చెబుతున్న పెట్టుబడులు అన్నీ బోగసే.
కే టీ ఆర్ మీద సీఎం రేవంత్ కు అసూయ తప్ప మరొకటి లేదు. కేటీ ఆర్ లాగా తనకు ఇంగ్లీష్ రాదని రేవంత్ కు అసూయ ఉండొచ్చు. కే టీ ఆర్ లాగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి మంచి ట్యూటర్ ను పెట్టుకోవాలి కానీ పిచ్చి విమర్శలు చేయొద్దు. కే టీ ఆర్ ఇంగ్లీష్ పై రేవంత్ చేస్తున్న పిచ్చి విమర్శలు చూసి అందరూ నవ్వుకుంటున్నారు.
రాష్ట్రం లో వైద్యరంగం పడకేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్ల కొరత తో సామాన్యులు సైతం ప్రైవేట్ దవఖానాలకు వెళ్తున్నారు. నెలకు రెండు వందల డెలివరీలు జరిగే ప్రభుత్వ ఆస్పత్రుల్లో, ఇపుడు ఒక్కటి కూడా జరగడం లేదు. మా నియోజక వర్గం లో నా మీద కోపం తో ఈ ప్రభుత్వం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. కేసీఆర్ కిట్ ఇవ్వక పోవడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు తగ్గాయి. అవసరమైతే కేసీఆర్ పేరు తొలగించి వేరే పేరు పెట్టుకుని కిట్ పథకం కొనసాగించండి.
కేసీఆర్ హయం లో తెలంగాణ విద్యా రంగం అన్ని విధాల వేరే రాష్ట్రాల కన్నా మెరుగ్గా ఉండేది. తెలంగాణ కన్నా వేరే రాష్ట్రాల్లో రెసిడెన్షియల్ స్కూళ్ళు బాగున్నాయి అని ఎవరైనా నిరూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా. ఐటీ మంత్రిగా కే టీ రామారావు రాష్ట్రానికి గణనీయమైన పెట్టుబడులు తెచ్చారు. ఐటీ ఎగుమతులు పెంచారు .లక్షలాది ఉద్యోగాలు సృష్టించారు.
గత ఏడు నెలల్లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్ధులు చనిపోయారు. దాదాపు 500 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడ్డారు. మా నియోజక వర్గం లో ఇప్పటి వరకు ఆరుగురు విద్యార్థులు ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడ్డారు .అందులో ఇద్దరు చనిపోయారు. పెద్దాపూర్ అనే గ్రామం లో ఓ విద్యార్ధి నిన్ననే చనిపోయారు. ఇంకో విద్యార్ధి వెంటి లెటర్ మీద మృత్యువు తో పోరాడుతున్నారు. ఇంతకు ముందు మంచానపడ్డ మన్యం అనే వార్తలు వచ్చేవి. ఇపుడు మంచాన పడ్డ రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలలు అనాల్సి వస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే ఈ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే. ఈ మరణాల పై ప్రభుత్వం లో ఏ స్థాయి లో సమీక్షలు జరగడం లేదు. కేసీఆర్ హాయం లో 1200 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు అయ్యాయి. గురుకులాలను సమీక్షించేందుకు గతం లో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేది. ఇప్పుడు అలాంటి కమాండ్ సిస్టం లేదు.
ప్రతి రెసిడెన్షియల్ స్కూల్ కు ఓ హెల్త్ సూపర్ వైజర్ ఉండాలి. విద్యార్థులు జబ్బు పడితే కనీస మందులు అందుబాటు లో లేవు. విద్యార్థులు పాములు ,ఎలుకల బారిన పడుతున్నారు ..వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. విద్యార్థులు పడుకునేందుకు కనీసం మంచాలు లేవు ..కింద పడుకోవడం వల్ల పాము కాట్ల బారిన పడుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి కి రెసిడెన్షియల్ స్కూళ్ల పై సదభిప్రాయం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల ను మూసివేసే కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోంది. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
కేసీఆర్ హాయం లో రెసిడెన్షియల్ స్కూళ్ల వల్ల విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. రెసిడెన్షియల్ స్కూళ్లలో ఇటీవల 3 వేల సీట్ల కోసం లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు ..దీన్నీ బట్టే రెసిడెన్షియల్ స్కూళ్లకు డిమాండ్ ఎంత ఉందో అర్థం అవుతుంది. మా నియోజకవర్గం లో ఎంతో మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూళ్ల లో సీట్ల కోసం నా దగ్గరకు వస్తుంటారు .అందరికీ సీట్లు రాని పరిస్థితి. భేషజాలకు పోకుండా రెసిడెన్షియల్ స్కూళ్ల కున్న పేరును పాడు చేయొద్దు.