టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
అగ్రికల్చర్ అండ్ డొమస్టిక్ విద్యుత్ స్మార్ట్ మీటర్ల టెండర్లకు సంబంధించిన సమాచారాన్ని ఇవ్వాలని సమాచార హక్కు చట్టం కింద నేను కోరి రెండు నెలలు దాటుతోంది. ఒక్క ఈపీడీసీఎల్ సీఎండీ మాత్రమే కొంత సమాచారమిచ్చారు. అసలు కుంభకోణానికి కేంద్ర బిందువైన ఎస్పీడీసీఎల్, సీపీడీసీఎల్ సీఎండీల నుంచి సమాచారమే లేదు. నేనేమైనా వారి తాతల సొత్తు వివరాలు అడిగానా. రూ.17 వేల కోట్లకు సంబంధించిన పబ్లిక్ డీల్ వివరాలు అడిగితే ఎందుకు ఇవ్వరు. భారీ స్కామ్ జరిగింది కాబట్టే ఆ వివరాలు దాచిపెడుతున్నారు.