– ప్రాజెక్టుల్లో నీళ్ల నీటి నిల్వపై కేబినెట్ వేయడం విచిత్రం
– రేషన్ కార్డుల అర్హుల నిర్ణయానికి సబ్ కమిటీ అనాలోచిత నిర్ణయం
– కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగి- ఖరీఫ్‌లోనే పొలాలు ఎండిపోయే పరిస్థితి
– మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్రంలో పరిపాలన పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదని.. ప్రభుత్వం నడపడంపై అవగాహన, బాధ్యత ఉన్నట్లుగా కనిపించడం లేదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జల్సాలకే పరిమితమై రాష్ట్ర అభివృద్ధిని మరిచినట్లు కనబడుతుందన్నారు. ప్రాజెక్టుల్లో నీళ్ల నీటి నిల్వపై కేబినెట్ వేయడం విచిత్రంగా ఉందన్నారు. ప్రపంచంలో ఇలాంటి పని కోసం సబ్ కమిటీ ఎక్కడా లేదన్నారు. ప్రొజెక్టుల ప్రోటోకాల్ ముందే నిర్ణయం చేసి ఉంటుందన్నారు.
రేషన్ కార్డుల అర్హుల నిర్ణయానికి సబ్ కమిటీ అనాలోచిత నిర్ణయమని.. తప్పించుకునేందుకు కాంగ్రెస్ దొంగబుద్ధి ప్రదర్శిస్తుందని విమర్శించారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాళేశ్వరం పంప్‌హౌస్ నుంచి పంపింగ్ చేసి సాగునీరు అందించాలన్నారు. ఎగువ ప్రాజెక్టుల్లో నీళ్లు లేకున్నా పంపింగ్ పంపింగ్ జరుపడం లేదని.. సుమారు 140 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వానికి పట్టింపు లేదని.. సోయి, అవగాహన లేక నీటిని ఎత్తిపోయడం లేదన్నారు.
ఎస్సారెస్పీ ఫేస్-2కి ఎందుకు నీళ్లు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రయోజనాలు పొందడంలేదన్నారు. లక్షల క్యూసెక్కుల నీటినంతా కాంగ్రెస్ సముద్రం పాలు చేస్తుందన్నారు. వరద పోయాక హడావుడి చేస్తే ప్రయోజనం ఉండదని.. ఒక్క ఒకరం ఎండినా ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. రైతాంగంపై ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. హెలికాఫ్టర్లలో విహారయాత్రలు మాని ప్రొజెక్టుల పర్యటనలు చేయాలని హితవు పలికారు.
ప్రాజెక్టుల్లో గ్రౌటింగ్ సర్వసాధారణ ప్రక్రియని.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతో యాసంగిలో పొలాలు ఎండినట్లు ఇప్పుడు ఖరీఫ్‌లోనే ఎండిపోయే పరిస్థితి కనపడుతుందన్నారు. ఎన్‌డీఎస్‌ఏకి నివేదికలు పంపి.. అనుమతులు తీసుకోవాలని.. వర్షాలు ఆగి వరద రాకపోతే తెలంగాణ రైతుల ప్రాణాలు పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ఎత్తిపోతల ప్రారంభించాలని.. రివ్యూ చేసి ఎత్తిపోతలు మొదలుపెట్టకపోతే రైతులకు ద్రోహం చేసినట్టేనన్నారు.
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం జీవో 33 తో నష్టం జరుగుతుందన్నారు. నేటివిటీ నిర్భయం గుడ్డిగా చేసినట్లుందన్నారు. నష్టపోయిన వారితో కలిసి పోరాటం చేస్తామన్నారు. జీవోపై న్యాయ పోరాటానికి సైతం వెనుకాడమన్నారు. పిల్లల భవిష్యత్ ప్రమాదంలో పడిందని.. పాత విధానాన్నే కొనసాగించాలని.. పాత బాసులను సంతృప్తి పరిచేందుకే రేవంత్ చేస్తున్న ప్రయత్నం ఇదని విమర్శించారు.