– ఫర్నిచర్ షాపుకు చెందిన గోదాంలోని మరమ్మతు ఫర్నిచర్
– సోషల్ మీడియాలో పూర్తిగా తప్పుడు వార్తలే
– ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్
ఏలూరు: “ఏలూరులో జరిగిన అగ్నిప్రమాదం సాక్షి మీడియాకు చెందిన కార్యాలయం కు చెందినది కాదు. ఇది ఒక ఫర్నిచర్ షాపుకు చెందిన గోదాంలోని మరమ్మతు ఫర్నిచర్ మాత్రమే” అని డీఎస్పీ శ్రవణ్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనలో తమ ఆస్తి దగ్ధమైందని ఫర్నిచర్ షాప్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశాము. మంటలను పోలీసులు కాస్త అదుపు చేస్తుండగానే, దెందులూరు నుండి వచ్చిన మహిళలు అక్కడకు చేరుకున్నారు – ఇది ఘటన సమయంలో తీసిన వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ అగ్నిప్రమాదానికి సాక్షి కార్యాలయం కు ఎలాంటి సంబంధం లేదు – మంటలు ఎగిసిన సమయానికి ర్యాలీ కనీసం 200 మీటర్ల దూరంలో ఉంది. సాక్షి కార్యాలయంపై దాడి జరిగినట్టు, లేదా సాక్షికి చెందిన ఫర్నిచర్ దగ్ధమైనట్టు సోషల్ మీడియా వార్తలు పూర్తిగా తప్పుడు వార్తలే. ఎవరైనా ఇలాంటి తప్పుదోవ పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేస్తే, వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం.