Suryaa.co.in

Andhra Pradesh

అర్ధమయిందా రాజా?

– నాకు క్లాస్‌మేట్స్ ఉన్నారు.. మీకు జైల్‌మేట్స్ ఉన్నారు
– నాకు కాలేజీ జీవితం..మీకు జైలు జీవితం
– జగన్‌పై మంత్రి లోకేష్ వ్యంగ్యాస్త్రాలు

అమరావతి: “జగన్ గారూ! మీ కపట బుద్ధి చూస్తే నవ్వొస్తోంది. నాకు కాలేజీ జీవితం ఉంది, మీకు జైలు జీవితం ఉంది. నాకు క్లాస్‌మేట్స్ ఉన్నారు, మీకు జైల్‌మేట్స్ ఉన్నారు. అర్థం అయ్యిందా రాజా?” ” అంటూ మంత్రి నారా లోకేశ్ వైసీపీ అధినేత జగన్ ను ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు.

తమ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, జైళ్లలో పెట్టించారని, ఆంధ్రప్రదేశ్‌ను పోలీస్ రాజ్యంగా మార్చారని దుయ్యబట్టారు.

” మహిళలను గౌరవించడం తనకు నేర్పించా రు. కానీ జగన్ మాత్రం కన్నతల్లిని, సొంత చెల్లిని ఇంటి నుంచి గెంటేసి, కోర్టుకు లాగారు. వారిపై రోజూ మీడియా, సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారు. జగన్ ఐదేళ్ల ముఖ్యమంత్రి పాలన ఒక చీకటి అధ్యాయం. ఈ కాలంలో కక్ష సాధింపు రాజకీయాలు, దళితులు, మహిళలపై అఘాయిత్యాలు, మీడియా ద్వారా అబద్ధాల ప్రచారం జరిగాయి. మీ హయాంలో జరిగిన నేరాలకు మమ్మల్ని నిందించే ప్రయత్నం కూడా చేయొద్దు. కప్పిపుచ్చే రోజులు పోయాయి ” అని లోకేశ్ స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE