Suryaa.co.in

Andhra Pradesh

బాబు పాలనతోనే రాష్ట్రానికి భవిష్యత్

– టిడిపి ఆచంట నియోజకవర్గ పరిశీలకులు బోళ్ళ సతీష్ బాబు

పెనుమంట్ర, ఆగస్టు 21: చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుంటేనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని టిడిపి జోన్-2 మీడియా కోఆర్డినేటర్, ఆచంట నియోజకవర్గ టిడిపి పరిశీలకులు బోళ్ళ సతీష్ బాబు తెలిపారు. ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం నెగ్గిపూడి గ్రామంలో భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంపై సోమవారం నాడు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు ఇంటింటికీ వెళ్ళి మహాశక్తి కార్యక్రమ కరపత్రాలు పంచారు. టిడిపి అధికారంలోకి వస్తే తల్లికి వందనం పేరిట ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకోవడానికి ఏటా రూ.15 వేల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మహిళల ఆర్ధిక పరిపుష్టి కోసం నెలకు రూ.1500 అక్కౌంట్లలో వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని సతీష్ బాబు గుర్తు చేశారు.

యువగళం పేరిట నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేలు భృతితో పాటు రానున్న ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.

ఈ కార్యక్రమంలో పెనుమంట్ర మండల టిడిపి అధ్యక్షులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి, పెనుమంట్ర మండల తెలుగు యువత అధ్యక్షుడు తమనంపూడి దుర్గారెడ్డి,ఆచంట నియోజకవర్గం క్లస్టర్ ఇంచార్జ్ గణపతినీడి రామమోహన్ రావు, టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస్, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకటరమణ, నెగ్గిపూడి గ్రామ ఇంచార్జ్ తేతలి రాజారెడ్డి, నెగ్గిపూడి గ్రామ టిడిపి అధ్యక్షుడు చీర్ల బాలాజీ రెడ్డి, పెనుమంట్ర మండల క్లస్టర్ ఇన్చార్జిలు కర్రి అచ్యుత రామారెడ్డి, చింతపల్లి రామకృష్ణ, వెలగల బుల్లి రామిరెడ్డి, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం పెనుమంట్ర మండల అధ్యక్షులు పాల ప్రసాద్, పెనుమంట్ర మండల మాజీ వైస్ ఎంపీపీ కట్ట బాలాజీ పవన్ కుమార్, కారేపల్లి భాస్కరరావు, మార్టేరు గ్రామ టిడిపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నెగ్గిపూడి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెలగల మల్లిఖార్జున రెడ్డి, చైతన్య పితాని ఫాలోవర్స్‌, మహిళలు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE