Suryaa.co.in

Andhra Pradesh

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కేవలం లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే

– వేదాంత గ్రూపు కూడా చాలా స్పష్టంగా ఏపీలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని చెప్పింది
– ఏపీలో మాత్రం పెట్టబడులు పెట్టబోమని లూలూ సంస్థ బహిరంగంగా ప్రకటించింది
– మీరు తెచ్చిన ఒక్క కంపెనీ ముందు సెల్ఫీ దిగి పోస్ట్ పెట్టండని సవాల్ విసిరా
– ఏపీ ఎఫ్ డీ ఐ లో 14వ స్థానంలో ఉంది
– కాగితాలు లేని ఎంఓయూ లు మార్చుకున్నారు
– 378 ఎంఓయూలు జరిగితే 70 కంపెనీల పేర్లు మాత్రమే బయటపెట్టారు
– ఇండోసోల్ అనే కంపెనీ డైరెక్టర్లు అందరూ పులివెందులకు చెందిన వారు
– ఇండోసోల్ కంపెనీ జగన్ రెడ్డి బినామీ కంపెనీ. ఈ కంపెనీ పేరుతో 25వేల ఎకరాలు దోచుకుంటున్నాడు
– చంద్రబాబునాయుడు పెట్టుబడులకు ఒక బ్రాండ్
– అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తాం
అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గం, పీలేరుమండలం, వేపులబయలు గ్రామంలోని యువగళం విడిది కేంద్రం నుండి టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ విలేకరుల సమావేశం

ప్రెస్‌మీట్‌లో లోకేష్‌ ఏమన్నారంటే… 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబు. 2014-2019 మధ్య అన్ని జిల్లాల్లో అనేక పరిశ్రమలను చంద్రబాబు నెలకొల్పారు. 2014-19 మధ్య ఏపీలో జిల్లాల వారీగా టీడీపీ ఏర్పాటు చేసిన పరిశ్రమలపై వైసీపీ ప్రభుత్వం తరపున మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అసెంబ్లీలో సమాధానం ఇచ్చారు.దానిలో 2014-19 మధ్య 39,450 పరిశ్రమలు తెచ్చామని, వాటి ద్వారా 5,13,350ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు కియా, బర్జర్ పెయింట్స్, జాకీ పరిశ్రమలు తెచ్చాం. కడపకు వెల్ స్పన్ కంపెనీని తీసుకొచ్చాం.చిత్తూరుకు అనేక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు తీసుకువచ్చాం. వీటిలో టీసీఎల్, ఫాక్స్ కాన్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, ఫాక్స్ కాన్, డిక్సన్ కంపెనీలు తెచ్చాం. కర్నూలుకు సిమెంట్ కంపెనీలు, సోలార్ ఉత్పత్తి కేంద్రాలు తీసుకువచ్చాం.

నెల్లూరు హీరోమోటార్స్, అపోలో టైర్స్, సుజల వంటి వందలాది పరిశ్రమలు తెచ్చాం.ప్రకాశం ఏషియన్ పేపర్ మిల్స్.గుంటూరు, కృష్ణాకు అశోక్ లైల్యాండ్,కేసీపీ, హెచ్.సీ.ఎల్ ఉభయగోదావరిలో అనేక ఫిషరీస్ పరిశ్రమలు, ఫార్మా కంపెనీలు తెచ్చాం. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అనేక ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్ తో ఒప్పందం, లూలూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కాంజియెంట్, ఏషియన్ పెయింట్స్ వంటి పెద్ద కంపెనీలు తెచ్చాం. టీడీపీ హయాంలో 31శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో రాయలసీమకు, 23శాతం ఉత్తరాంధ్రకు ఉద్యోగాలు వచ్చాయి. ఇది వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా ఇచ్చిన సమాధానమే. మేం సొంతంగా చెబుతున్నది కాదు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తెలంగాణ కంటే ఏపీకి అధికంగా రూ.19,500కోట్ల ఎఫ్.డీ.ఐ వచ్చింది.మరోప్రక్క 3.5శాతానికి నిరుద్యోగ తగ్గింది.
చిత్తూరు జిల్లాలో మేం తెచ్చిన కంపెనీల వద్ద అనేక సెల్ఫీలు దిగి, సీఎంకు ఛాలెంజ్ విసిరా. మీరు తెచ్చిన ఒక్క కంపెనీ ముందు సెల్ఫీ దిగి పోస్ట్ పెట్టండని సవాల్ విసిరా. ఛాలెంజ్ కి జగన్ స్పందించలేదు.2019-2023 వరకు ఈ ప్రభుత్వం నిద్రపోయింది. వైసీపీ పాలనలో పెద్దఎత్తున పీపీఏలు రద్దు చేసి అనేక పరిశ్రమలను ఏపీ నుండి తరిమేసింది. వీళ్ల బెదిరింపులు, వేధింపులు తట్టుకోలేక పక్క రాష్ట్రాలకు పారిపోయాయి.

కేంద్రం కూడా ఏపీకి లేఖ రాసింది పీపీఏలు రద్దు చేయవద్దని. దీనివల్ల దేశం పరువు కూడా పోతుందని కేంద్రం ఏపీ ప్రభుత్వానికి సూచిస్తే జగన్ రెడ్డి పట్టించుకోలేదు.దేశంలోని అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడతాం. ఏపీలో మాత్రం పెట్టబడులు పెట్టబోమని లూలూ సంస్థ బహిరంగంగా ప్రకటించింది. ఈ కంపెనీని ఏపీ నుండి తరిమేయకపోతే మన రాష్ట్రంలో రూ.2వేల కోట్లు పెట్టబడులు పెట్టేది. 20వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి. వేదాంత గ్రూపు కూడా చాలా స్పష్టంగా ఏపీలో ఎవరూ పెట్టుబడులు పెట్టరని చెప్పింది. జగన్ పాలసీలు మొత్తం మార్చేస్తున్నారని చెప్పింది. జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, లూలూ, హోలీటెక్, అమర్ రాజా, మెగాసీడ్ పార్క్, జాకీ, ఏషియన్ పేపర్ పల్ప్ కంపెనీలు పారిపోయాయి. ఏపీలో పెట్టుబడులు పెట్టిన రాష్ట్రాలు ఏపీలో విస్తరించడం లేదు. ఉదా: ఫాక్స్ కాన్ కంపెనీ. ఈ కంపెనీ తెలంగాణలో, కర్నాటకలో తమ వ్యాపారాన్ని విస్తరించింది. ఒక్కో రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు ఇస్తోంది.అమర్ రాజా కంపెనీ కూడా తెలంగాణకు వెళ్లిపోయింది. దీనివల్ల ఏపీ యువత 20వేల ఉద్యోగాలు కోల్పోయారు. ఏపీ ఎఫ్ డీ ఐ లో 14వ స్థానంలో ఉంది. ఝార్ఖండ్ కంటే మనం వెనుకబడి ఉన్నాం. నిరుద్యోగ సమస్య మూడు రెట్లు పెరిగి 13.5శాతానికి పెరిగింది. గంజాయి సరఫరాలో మాత్రం ఏపీ మొదటి స్థానంలో ఉంది.

ఏపీలో ఉద్యోగాలు నిల్…గంజాయి ఫుల్…
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కేవలం లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే.ఏ ప్రభుత్వం అయినా ఒప్పందాలు జరిగినప్పుడు వాటిని బహిరంగంగా అధికారికంగా ప్రకటిస్తాం. గతంలో మనం అలాగే చేశాం. కానీ వీళ్లు ఒప్పందాల పుస్తకాలు, సంతకాలు చూపించడం లేదు. కాగితాలు లేని ఎంఓయూ లు మార్చుకున్నారు.
378 ఎంఓయూలు జరిగితే 70కంపెనీల పేర్లు మాత్రమే బయటపెట్టారు.చంద్రబాబు పాలనలో ఆన్ లైన్ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు దానిలో చూపించేవాళ్లం. ఇండోసోల్ అనే కంపెనీ డైరెక్టర్లు అందరూ పులివెందులకు చెందిన వారు. 2022లో కంపెనీగా వచ్చింది. మూలధన పెట్టుబడి లక్ష మాత్రమే. ఇటువంటి కంపెనీ రూ.76వేల కోట్ల పెట్టబడులు పెడతామని చెప్పింది. ఎలా నమ్మాలి? ఈ కంపెనీకి 25వేల ఎకరాల భూమిని కర్నూలు, కడప, కృష్ణాలో జగన్ రెడ్డి కట్టబెడుతున్నాడు. ఏబీసీ అనే మరో కంపెనీకి 120కోట్ల టర్నోవర్, దీనిలో కేవలం 250మంది మాత్రమే ఉద్యోగం. రూ.1.20లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ఒప్పందాలు అయ్యాయంటే ఎలా నమ్మాలి? సోలార్ ఎనర్జీ 71శాతం ఉంటుంది. దీనికి రూ.9,57,139కోట్లు మెగావాట్ కు రూ.4.5కోట్ల నుండి 5 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది. 2లక్షల మెగావాట్లకు 10లక్షల ఎకరాలు కావాలి. భారతదేశంలో అత్యధిక విద్యుత్ వాడకం 2.5లక్షల మెగావాట్లు మాత్రమే. 2022 జూన్ లెక్కల ప్రకారం.

ఏపీలో అత్యధిక విద్యుత్ వాడకం 11,448మెగావాట్లు మాత్రమే. కానీ దీనికి 2లక్షల మెగావాట్ల ఉత్పత్తి అంటూ రాష్ట్ర ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోంది. చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఇదొక లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే. దావోస్ కు 12 కోట్లు ఖర్చు పెట్టి జగన్ రెడ్డి చాలా పెద్ద విమానాన్ని తెచ్చుకుని వెళ్లి ఒప్పందాలు అరబిందో, గ్రీన్ కో, అదానీ కంపెనీలతో మాత్రమే చేసుకుని వచ్చారు. ఇవే ఒప్పందాలను ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు తీసుకొచ్చి పదేపదే మూడు సార్లు ఒప్పందాలను జగన్ రెడ్డి చూపించి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ మూడు కంపెనీలు ఏపీలో కూర్చుని ఓ కాఫీ తాగుతూ ఒప్పందాలు చేసుకోవచ్చు. అరబిందో కంపెనీతో ఒప్పందానికి టీ, కాఫీ ఖర్చు కూడా ఉండదు. ఎన్ని కంపెనీలు వస్తాయని అడిగితే ఐటీ,పరిశ్రమలశాక మంత్రి సమాధానం దాటవేస్తున్నారు. బొత్స కూడా దాదాపు ఇదే చెప్పారు.

ఇండోసోల్ కంపెనీ జగన్ రెడ్డి బినామీ కంపెనీ. ఈ కంపెనీ పేరుతో 25వేల ఎకరాలు దోచుకుంటున్నాడు. చంద్రబాబునాయుడు పెట్టుబడులకు ఒక బ్రాండ్. కియా, ఫాక్స్ కాన్ వంటి పెద్ద కంపెనీలు వచ్చాయి.
కియా పరిశ్రమ ఏపీలోని నాయకులకు జే ట్యాక్స్ లు కట్టలేక తమిళనాడుకు వెళ్లిపోయింది.జగన్ రెడ్డి నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కేవలం లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే.ఈ సమ్మిట్ పేరుతో ప్రజా ధనాన్ని, భూములను దోచుకునే ప్రయత్నమే. ఈ సమ్మిట్ వల్ల ఏపీకి ఒరిగేది ఏమీ లేదు..ఇది కేవలం ప్రజల కళ్లుకప్పడం కోసమేనని తెలుస్తోంది. ప్రభుత్వం కూడా ఎక్కడా నమ్మకంగా కంపెనీల పెట్టుబడులపై సమాధానం చెప్పడం లేదు. కంపెనీ పేర్లు కూడా ప్రభుత్వం బయటపెట్టడం లేదు. జగన్ రెడ్డి ఫేస్ వ్యాల్యూ జీరో… జగన్ అంటే జైలు గుర్తు వస్తుంది. అతన్ని చూసి ఏపీ నుండి పరిశ్రమలు, కంపెనీలు పారిపోతున్నాయి. వచ్చే సమస్యే లేదు.

విలేకరుల ప్రశ్నలు – లోకేష్ సమాధానాలు
1. మీరు ఇది ఫేక్ సమ్మిట్ అంటున్నారు. నిజమేనా? జగన్ రెడ్డి 25వేల ఎకరాలు దోచేస్తున్నారని అంటున్నారు. మీ వద్ద ఆధారాలున్నాయా?*
సమాధానం: ఖచ్చితంగా ఇది లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే. ఇండోసోల్ కంపెనీ జగన్ బినామీలది. వాళ్లను అడ్డుపెట్టి భూములు దోచేసేందుకు పెద్దకుట్ర జరుగుతోంది.
2. పెట్టుబడులు పెట్టాక ఎన్ని సంవత్సరాలకు కంపెనీ ప్రారంభం అవుతుంది? ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి?
సమాధానం: కంపెనీలే ఫేక్ అంటే..ఇక ఉపాధి అవకాశాలు ఎందుకు వస్తాయి. వాళ్లు పెట్టుబడులు పెట్టేది లేదు…ఉద్యోగాలు వచ్చేదీ లేదు. ఇది కేవలం లోకల్ ఫేక్ సమ్మిట్ మాత్రమే. నిరుద్యోగులకు ఈ సమ్మిట్ వల్ల ఒక్క ఉద్యోగం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి ఇప్పటికే జగన్ రెడ్డి పలుమార్లు శంకుస్థాపనలు చేశారు. పనులు ప్రారంభం కాలేదు. ఇంక ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి?
3. సరస్వతీ సిమెంట్స్ పేరుతో ప్రభుత్వం భూములు తీసుకుంది. నేటికీ పరిశ్రమ రాలేదు. అసలు కంపెనీ ప్రారంభం అవుతుందా?
సమాధానం: వైసీపీ అధికారంలోకి వచ్చాక బాగుపడింది కేవలం జగన్ రెడ్డి పరిశ్రమలే. ఈ మూడున్నరేళ్లలో భారతీ సిమెంట్స్ కు రూ.850కోట్లు లాభాలు వచ్చాయి. మిగతా కంపెనీలన్నీ నష్టాల్లో కూరుకుపోయాయి. కొన్ని పక్క రాష్ట్రాలకు పారిపోయాయి.
4. వైసీపీ 175 సీట్లు వస్తాయని అంటున్నారు. అవకాశం ఉందా? మీరు నమ్ముతున్నారా?
సమాధానం: 175సీట్లు వస్తాయంటే జగన్ పరదాలు కట్టుకుని ఎందుకు దాక్కుని తిరుగుతున్నాడు. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని బటన్ నొక్కడం ఎందుకు? జీఓ 1 ఎందుకు తెచ్చారు? పీలేరులో నిన్న నాపై దాడికి ఎందుకు ప్రయత్నించారు. 175కు 175సీట్లు వాళ్లకు ఎందుకు రావాలి? నిరుద్యోగశాతం పెంచినందుకా? నిత్యావసరాల ధరలు పెంచినందుకా? పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినందుకా? ఇంటిపన్ను, చెత్తపన్ను వేస్తున్నందుకా? దళితులు, మైనారిటీలపై దాడులు పెరిగినందుకా? ఎందుకు 175గెలుస్తారు?
5. టీడీపీ, జనసేన 175 నియోజజవర్గాల్లో ఎందుకు ఒంటరిగా పోటీ చేయడం లేదు? అని వైసీపీ ప్రశ్నిస్తోంది. మీరు ఏమంటారు?
సమాధానం: జగన్ రెడ్డికి అంత భయం ఎందుకు? టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయని మేం ఎక్కడైనా చెప్పామా? వాళ్లు మేం ఎక్కడ పోటీచేయాలో నిర్ణయిస్తే మేం పోటీ చేయాలా? ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మా రాజకీయ వ్యూహాన్ని అమలు చేస్తాం. టీడీపీ, జనసేన మైత్రిని చూసి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నాడు?
6. వైసీపీ ఫేక్ సమ్మిట్ పెట్టిందని అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు వస్తాయా?
సమాధానం: మా పనితనాన్ని మేం రాష్ట్ర మ్యాప్ వేసి చూపించాం. మేం తెచ్చిన పరిశ్రమలు, ఇచ్చిన ఉద్యోగాలపై అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వమే సమాధానం ఇచ్చింది. ఆ విధంగా వాళ్లు దైర్యంగా చెప్పగలరా?
7. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ద్వారా సంవత్సరానికి లక్ష ఆదాయం వస్తుంది. టీడీపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని ప్రభుత్వం అంటోంది. మీరు ఎలా చూస్తారు?
సమాధానం: 100 సంక్షేమాలు కట్ చేసిన ప్రభుత్వం జగన్ రెడ్డిది. దానిపై చర్చకు నేను సిద్ధం. జగన్ రెడ్డి నాతో చర్చకు సిద్ధమా?
8. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామిపై భూ దోపిడీపై మీరు చేసిన ఆరోపణలపై చర్చకు సిద్ధమని నారాయణస్వామి అంటున్నారు. మీరు సిద్ధమా?
సమాధానం: నేను సిద్ధం రమ్మని చెప్పండి.
9. మీ నెలరోజుల పాదయాత్రలో మీరు గమనించిన ముఖ్య విషయాలు ఏంటి?
సమాధానం: ధరల పెరుగుదల, నిరుద్యోగం, గంజాయి.
10. సీపీఎస్ రద్దుపై జగన్ మాటతప్పారు. మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేస్తారు?
సమాధానం: సీపీఎస్ రద్దుకు సంబంధించిన దానికి బాబుగారు ప్రత్యామ్నాయం చూపించారు. వాళ్లతో కూర్చుని చర్చించి వాళ్లకు అనుకూలంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం.
11. మీరు అధికారంలోకి వస్తే డీకేటీ భూములను రెగ్యులర్ చేస్తారా?
సమాధానం: కర్నాటకలో అమలవుతున్న చట్టాన్ని అధ్యయనం చేసి, ఏపీలోనూ దాన్ని అమలు చేస్తాం.
12. మీరు అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా?
సమాధానం:చంద్రబాబు పాలనలో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు దేన్నీ రద్దు చేయలేదు. ఆరోగ్యశ్రీని రాజశేఖర్ రెడ్డి ప్రారంభించారు. మేం దాన్ని కొనసాగించాం. జగన్ రెడ్డి మేం అమలు చేసిన పథకాలను పూర్తిగా రద్దు చేశాడు. చంద్రాబు పెన్షన్ ను రూ.200 నుండి రూ.2,000లకు పెంచారు. అంటే ఏకంగా రూ.1,800 పెంచారు. జగన్ రెడ్డి సుమారు నాలుగేళ్లలో కేవలం రూ.750 పెంచారు.
-13. సచివాలయ ఉద్యోగులను మీరు వచ్చాక తొలగిస్తారా? కొనసాగిస్తారా?
సమాధానం: జగన్ రెడ్డిలా అబద్దాలు చెప్పడం మాకు రాదు. బాబాయ్ ని చంపి ఆ నేరాన్ని మాపై నెట్టేశారు. మేం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగులను కొనసాగిస్తాం.
14. సర్పంచ్ గా కూడా గెలవని వ్యక్తి పాదయాత్ర చేస్తుంటే ప్రజలు ఎలా సహకరిస్తారు? ఇది టీడీపీకి శవయాత్ర అంటూ అధికార పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. దానికి మీరు ఏమంటారు?
సమాధానం: టీడీపీ ఓడిపోతున్న నియోజకవర్గాన్ని టీడీపీ కంచుకోటలా మార్చేందుకు నేను మంగళగిరిని ఎంచుకున్నా. జగన్ రెడ్డిలా కుటుంబం ఓట్లు ఉన్న చోట పోటీ చేయలేదు. జగన్ రెడ్డికి దమ్ముంటే వైసీపీ గెలవని ప్రాంతంలో పోటీ చేసి గెలవమనండి చూద్దాం. నేను ఛాలెంజ్ విసురుతున్నా.
15. వైసీపీ లో సీట్లపై స్పష్టత ఉంది. మీ పార్టీలో ఆ స్పష్టత కరువైంది. దీనికి మీ సమాధానం?
సమాధానం: వైసీపీలోనే సీట్లపై ఎటువంటి స్పష్టత లేదు. మేం చాలా స్పష్టంగా ఉన్నాం. వైసీపీకి నెల్లూరులో పరిస్థితులను మనం చూశాం. భవిష్యత్తులోనూ మనం ఇంకా చూస్తాం.
16. రాజధాని విషయంలో ప్రజలకు ఎటువంటి స్పష్టత లేదు. రాష్ట్రం పరిస్థితి ఏంటి?
సమాధానం: రాజధానిపై కేంద్రం ఒకమాట, రాష్ట్రం ఒక మాట చెబుతోంది. మూడు రాజధానులు అని చెప్పిన సీఎం ఎక్కడా ఒక ఇటుక కూడా పెట్టలేదు. విశాఖే రాజధాని అంటున్నారు. అక్కడ ఒక్క పరిశ్రమ పెట్టలేదు. ఇదంతా జగన్ రెడ్డి చేస్తున్న టైమ్ వేస్ట్ కార్యక్రమం. బుద్ధి ఉన్నవాడు ఎవడైనా ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా? అమెరికా లాంటి దేశాలను ఆదర్శంగా తీసుకోవాలి. ఆఫ్రికాలో 30శాతం నిరుద్యోగం ఉంది. ఏపీని కూడా జగన్ రెడ్డి అదే మార్గంలో తీసుకెళుతున్నాడు. సమావేశంలో మాజీ మంత్రి ఎన్.అమర్నాథ్ రెడ్డి, టీడీపీ నాయకులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, చల్లా రామచంద్రారెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A RESPONSE