– అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ సభలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి ధన్యవాదాలు. తెలంగాణ ప్రభుత్వం మీపైన చాలా నమ్మకం పెట్టుకుంది. తెలంగాణ కొత్త రాష్ట్రం దేశంలో 29 వది. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం అడగలేదు. మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహాయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
మా ప్రాంత ప్రజలకు ఉపయోగపడే హైదరాబాద్ కరీంనగర్ మీదుగా రామగుండం వెళ్ళే రాజీవ్ రహదారి ని 8 లేన్ రోడ్డుగా మార్చగలరు. రవాణా శాఖ నుండి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఈవి పాలసీ తీసుకొచ్చాం. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆటోమేటిక్ డ్రైవింగ్ స్టేషన్, పొల్యూషన్ చెకప్ ఏర్పాటు చేస్తున్నాం. మీ పై నమ్మకం ఉంది.. మాకు సహకరించి సహాయం చేయగలరు. అంబర్ పేట ఫ్లై ఓవర్ ప్రారంభించినందుకు మీకు తెలంగాణ ప్రభుత్వం తరుపున ధన్యవాదాలు