Suryaa.co.in

Telangana

దళిత, బహుజన విద్యార్థుల ప్రాణాలు ప్రమాదంలో పెట్టిన ప్రభుత్వం

– నిఖిల్ మృతి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనం
– మాజీ మంత్రి హరీష్ రావు

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

83 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే కూడా కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ మరణం మరొక ఉదాహరణ. చిన్న జ్వరానికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదొక నిదర్శనం.

ఒక గురుకులంలో 400 మంది విద్యార్థులనే సమర్థవంతంగా చూసుకోలేని ప్రభుత్వం, 2000 మంది ఉండే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్వహణను ఎలా చేయగలదు? గురుకులాల్లో చదువుతున్న దళిత, బహుజన విద్యార్థుల ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టాలని, చనిపోయిన విద్యార్థి నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE