Suryaa.co.in

Andhra Pradesh

దశలవారీ మద్య నిషేధానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

• గత ప్రభుత్వ హయాంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని 2934కి తగ్గించాం
• 43వేల బెల్టు షాపులను,4380 పర్మిట్ రూమ్ లను రద్దు చేశాం
• గతంలో మద్యం షాపుల సమయాలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకు ఉండగా ప్రస్తుతం ఆసమయాలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశాం
• 2018-19లో 661 లక్షల మద్యం బాక్సులు విక్రయిస్తే 2021లో 224 లక్షల బాక్సులు వినియోగం
• దశల వారీ మద్య నియంత్రణ చర్యలతో 63శాతం మద్యం వినియోగం తగ్గింది
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్,వాణిజ్యపన్నులు కె.నారాయణ స్వామి
అమరావతి:రాష్ట్రంలో దశల వారీ మద్యపాన నిషేదానికి ప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్ మరియు వాణిజ్యపన్నుల శాఖ ఉప ముఖ్యమంత్రి కె.నారాయణ స్వామి పేర్కొన్నారు.బుధవారం అమరావతి సచివాలయం ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దశల వారీ మద్య నియంత్రణకు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల 63శాతం మద్య వినియోగం తగ్గిందని గతంలో 4380 మద్యం దుకాణాలుంటే వాటిని ఈప్రభుత్వం 2వేల 934 షాపులకు అనగా 33శాతం కుదించడం జరిగిందని తెలిపారు.
అదే విధంగా 43వేల బెల్టు షాపులను పూర్తిగా రద్దు చేయడంతోపాటు 4380 పర్మిట్ రూమ్ లను కూడా రద్దు చేశామని చెప్పారు.మద్యం వినయోగాన్ని తగ్గించడానికి పేదలు మద్యానికి బానిస కాకుండా ఉండేందుకు మద్యం ధరలను పెంచడం జరిగిందని దాని మూలంగానే మద్యం వినియోగం 63 శాతం తగ్గిందని ఆయన స్పష్టం చేశారు.అంతేగాక గతంలో మద్యం దుణాకాణాల వేళలు ఉ.10గం.ల నుండి రాత్రి 10గం.ల వరకూ ఉంటే ఆవేళలను ఉ.11గం.ల నుండి రాత్రి 8గం.లకు పరిమితం చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు.అలాగే ఒక వ్యక్తి కలిగి ఉండే మద్యం బాటిళ్ళ సంఖ్య 6నుండి 3కు తగ్గించడం జరిగిందని తెలిపారు.రాష్ట్రంలో మద్య నిషేధ కమిటీలను ఏర్పాటు చేయడం ద్వారా మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని నారాయణ స్వామి పేర్కొన్నారు.
నవరత్నాలు అమలు ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల హృదయాలను దోచుకున్నారని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు.ఉద్యమం అంటే పేదల ఇళ్ళ స్థలాల కోసం లేదా రైతు సంక్షేమం కోసం లేదంటే పేదల సంక్షేమానికై చేయాలి తప్ప, మద్యంపై ఉద్యమం చేయడం ఏమిటని ప్రతిపక్షాల తీరును విమర్శించారు. ప్రస్తుతం ఉన్నమద్యం ఉత్పత్తి డిస్టిల్లరీలు అన్నీ గత గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినవేనని, ఈప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిల్లరీనీ కూడా ఏర్పాటు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.అంతేగాక ఎపి డిస్టిల్లరీ రూల్స్ 2006 మద్యం తయారీకి అనేక ప్రమాణాలు నిర్ణయించడం జరిగిందని, ఆప్రకారమే మద్యం తయారు అవుతోందని చెప్పారు.ఇతర రాష్ట్రాల నుండి అక్రమంగా మద్యం రాష్ట్రంలోకి రవాణా చేయకుండా రాష్ట్ర సరిహద్దు చెక్కు పోస్టుల్లో సిసి కెమెరాల నిఘాను ఏర్పాటు చేశామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి చెప్పారు.
స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో(SEB)ఏర్పాటుతో నమోదైన కేసులు:
రాష్ట్రంలో స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరో ఏర్పాటు చేశాక.. గత ఏడాది మే నుండి ఇప్పటి వరకూ మద్యం అక్రమాలకు సంబంధించి, లక్షా 14వేల 689 కేసులను నమోదు చేసి 2లక్షల 786 మందిని అరెస్టు చేయడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.అలాగే 51వేల 103 వివిధ వాహనాలను స్వాధీనం చేసుకోవడం తోపాటు 7లక్షల 71వేల 288 లీటర్ల నాటు సారాను,2కోట్ల 19లక్షల 55వేల 812 బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగిందని తెలిపారు.అంతేగాక ఇతర రాష్ట్రాలకు చెందిన 7లక్షల 12వేల 557 లీటర్ల ఎన్డిపిఎల్ మద్యాన్ని,95వేల 238 లీటర్ల డ్యూటీ పెయిడ్ మద్యాన్ని,2లక్షల 49వేల 162 కిలోల గంజాయిని స్వాధీన పర్చుకున్నామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వెల్లడించారు.

LEAVE A RESPONSE