– ప్రజల ప్రాణాలు కాపాడాలి
– ప్రజల దగ్గర టాక్స్ వసూలు చేయడమే కాదు
– ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
– చేవెళ్ల మండలం, మీర్జగూడ దగ్గర ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొన్న ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్: వెస్ట్ హైదరాబాద్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ట్రాఫిక్ కూడా బాగా పెరుగుతుంది. చేవెళ్ల దగ్గర ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని 19 మంది చనిపోవడం అత్యంత బాధాకరం. అందరినీ కలచివేసే ఘటన.
ఈ రోడ్డు 2015-16 లోనే నేషనల్ హైవే గా అభివృద్ధి చెందాల్సి ఉండే. కేసులు వేయడం ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పనులు జరగలేదు. దీనివల్ల సామాన్య ప్రజలు బలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి తక్షణమే పనులు పూర్తి చెయ్యాలని డిమాండ్ చేస్తున్నా.
ప్రజల దగ్గర టాక్స్ వసూలు చేయడమే కాదు. పదే పదే ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ మధ్య రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
మొన్న రాజస్థాన్, నిన్న కర్నూల్, ఇవాళ చేవెళ్ళ. ఇంత టెక్నాలజీ వచ్చాక కూడా ఇలా చనిపోవడం సభ్య సమాజం తల దించుకునే పరిస్థితి. నిర్లక్ష్యం వహించకుండా రాష్ట్రంలో ఉన్న అన్ని రహదారులపై సమీక్ష నిర్వహించి తక్షణమే పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరుతున్నాను.