Suryaa.co.in

Andhra Pradesh

పబ్లిక్ హాలిడేస్ లో పాఠశాలలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం కక్షసాధించడానికే!

– తమపై కక్షసాధించడానికే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నాడన్న అభిప్రాయం ఉపాధ్యాయుల్లో ఉంది.
• గుడ్ ఫ్రైడే, బాబూజగజ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి వంటి పబ్లిక్ హాలిడేస్ లో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలకు వస్తే ఏం అద్భుతం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి.
• మంత్రి బొత్స, విద్యాశాఖాధికారులు తక్షణమే సెలవురోజుల్లో పాఠశాలలు నిర్వహించాలన్న ఉత్తర్వుల్ని వెనక్కుతీసుకోవాలి.
• ఉపాధ్యాయుల్ని దెబ్బమీదదెబ్బ కొడుతూ, ప్రభుత్వం విద్యారంగాన్ని సర్వనాశనం చేస్తోంది.
– మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ

విద్యారంగం పరిస్థితి దారుణంగా తయారైందని, విద్యార్థులతోపాటు, బోధనా బోధనేతర సిబ్బంది సంతృప్తికరంగా లేరని, జీవో 117తో ప్రభుత్వం విద్యార్థులకు విద్యను దూరంచేసింద ని, చివరిఏడాది ముగిసేనాటికి విద్యావ్యవస్థను సర్వనాశనంచేయడమే లక్ష్యంగా పాలకులు పనిచేస్తున్నారని, సెలవురోజుల్లో ఉపాధ్యాయులను పాఠశాలలకు రమ్మనడంవల్ల ఎవరికి ఎలాంటి ప్రయోజనమో మంత్రి బొత్స, విద్యాశాఖాధికారులు చెప్పాలని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్సీ ఏ.ఎస్.రామకృష్ణ డిమాండ్ చేశారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

“పాఠశాలలకు వేసవిసెలవులుఇచ్చాక, సిలబస్ పూర్తయ్యాక ఉపాధ్యాయులు, విద్యార్థుల్ని పాఠశాలలకు రమ్మంటూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. తక్షణమే మంత్రి బొత్ససత్యనారాయణ, విద్యాశాఖాధికారులు సదరు ఉత్తర్వులపై పునరాలోచన చేసి, వాటిని వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం తమపై కక్షసాధిస్తోందని ఇప్పటికే ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి ఉత్తర్వులతో ప్రభుత్వంపై వారికి ఉన్న కొద్దొగొప్ప సానుకూలతను కూడా దూరంచేసుకోవద్దని పాలకులకు సూచిస్తున్నాం.

ఉపాధ్యాయులకు, విద్యారంగానికి సంబంధించి ఇచ్చిన ఏఒక్కహామీని జగన్ నెరవేర్చలేదు. 6వ తేదీవచ్చినా 24శాతం ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వలేదు. 5పాతడీఏలు, 3 కొత్తడీఏ లు బకాయిపెట్టాడు.
2019 ఎన్నికలకు ముందు ప్రతిఏటా మెగాడీఎస్సీ ప్రకటిస్తానని, ఉపాధ్యాయుల కొరత లేకుండా చేస్తానని, ప్రపంచంలోనే అత్యంత ఉన్నతప్రమాణాలతో రాష్ట్రవిద్యా విధానాన్ని తీర్చి దిద్దుతానని జగన్ హామీలు ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ తీసుకున్న నిర్ణ యాలతో రాష్ట్ర విద్యారంగంలో అల్లకల్లోలం ఏర్పడిందనే చెప్పాలి. విద్యార్థుల్ని తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు ఎప్పుడైతే నిరాశానిస్పృహలకు లోనవుతారో, అప్పుడు విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. దానివల్ల బోధనాభ్యాసన దిగజారిపోయి విద్యాప్రమాణాలు పడిపోతాయి. ఇప్పటికే విద్యాప్రమాణాల్లో రాష్ట్రం 19వస్థానం నుంచి 3వస్థానానికి పడిపోయింది.

ఉపాధ్యాయులు వారిహక్కులకోసం పోరాడినప్పుడు, ఛలోవిజయవాడ కార్యక్రమం విజయ వంతంచేసిన వారిలో ఉపాధ్యాయులే అగ్రభాగాన నిలిచారన్న అక్కసుతో ముఖ్యమంత్రి వారి పై కక్షకట్టాడు. 6వతేదీ వచ్చినా ఇప్పటికీ 24శాతంమంది ఉపాధ్యాయులకు జీతాలు అందలేదు. పెన్షన్ దారుల పరిస్థితి మరీదారుణంగా ఉంది. 5పాతడీఏలు, 3కొత్తడీఏలు ప్రభు త్వం ఉపాధ్యాయులకు బకాయిఉంది. డీఏలు ఇవ్వని ప్రభుత్వం వాటికి సంబంధించిన ఇన్ కంటాక్స్ మాత్రం పక్కాగా కట్టించుకుంటోంది. హెల్త్ కార్డులు ఇవ్వకుండా వాటికోసం నెలనె లా రూ.300లు వసూలుచేస్తున్నారు. హెల్త్ కార్డులు పనిచేయక ఉపాధ్యాయులు చాలామం ది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి.

తమపై కక్ష సాధింపుల కోసమే జగన్ సెలవు రోజుల్లో పాఠశాలలకు రమ్మంటూ ఉత్తర్వులిచ్చాడని ఉపాధ్యాయులు అనుకుంటున్నారు
పదోతరగతి పరీక్షలు జరిగే కేంద్రాల్లో 6, 7, 8 తరగతుల విద్యార్థులకు సెలవుప్రకటించిన ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని పాఠశాలలకు రమ్మనడం దుర్మార్గంకాదా? 220రోజుల పనిదినాలు తగ్గుతున్నాయన్న వంకతో గుడ్ ఫ్రైడే వంటి సెలవుదినాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల్ని పాఠశాలలకు రమ్మనడం సముచితంకాదు. సెలవురోజుల్లో ఉపాధ్యాయు లు, పిల్లలు పాఠశాలలకు వస్తే ఏంఅద్భుతం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలి. జగన్ కావాలనే తమపై కక్షసాధింపులకోసమే ఈ ఉత్తర్వులిచ్చాడని ఇప్పటికే ఉపాధ్యాయులు అనుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే, బాబూజగజ్జీవన్ రామ్ జయంతి వంటి పబ్లిక్ హాలిడేస్ లో పాఠశాలలు పెట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వఒత్తిడితో ఉపాధ్యాయులు వస్తారు..పోతారుతప్ప, దానివల్ల విద్యార్థు లకు, విద్యారంగానికి ఒరిగేదేం లేదు. అసలు సెలవురోజుల్లో తల్లిదండ్రులు పిల్లలను పాఠశాల లకు పంపడానికి ఇష్డపడరు. సిలబస్ మొత్తం పూర్తయ్యాక విద్యార్థులుకూడా రావడానికి ఇష్టపడరు. ఉపాధ్యాయుల్ని దెబ్బమీదదెబ్బ కొడుతూ ఇలాంటి ఉత్తర్వులతో ప్రభుత్వం పైశా చిక ఆనందం పొందుతోంది. నిజంగా ప్రభుత్వానికి విద్యారంగంపై అంతటి శ్రద్ధాసక్తులే ఉంటే 360 రోజులు పాఠశాలలు నిర్వహించవచ్చు కదా!

కరోనా మహమ్మారి సమయంలో కూడా జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని నానా ఇబ్బందులుపెట్టింది. ప్రాణాలుపోయినా సరే ఉపా ధ్యాయులు రావాల్సిందేనని ప్రభుత్వం మొండితనానికి పోవడంతో 1200మంది చనిపోయా రు. అంతమంది ఉపాధ్యాయుల ప్రాణాలవిలువను ఈ ప్రభుత్వం లెక్కకట్టగలదా? కరోనా వల్ల చనిపోయిన ఆరోగ్యశాఖసిబ్బంది, హెల్త్ వర్కర్లు, పారిశుధ్యసిబ్బంది కుటుంబాలకు రూ.50లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చిన ప్రభుత్వం, ఉపాధ్యాయుల కుటుంబాలకు మాత్రం పైసా ఇవ్వలేదు. టీచర్లను వేధిస్తూ ఈప్రభుత్వం ఏం సాధించాలనుకుంటోంది? పబ్లిక్ హాలిడేస్ లో పాఠశాలలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మనుషుల్ని తయారుచేసే గొప్పవ్యక్తులుగా ఉపాధ్యాయుల్ని చెప్పుకుంటారు. టీచర్ల వల్లే ఇ ప్పుడున్నవారు అధికారంలోకి రాగలిగారు అనేది కూడా కాదనలేని వాస్తవం. అలాంటి వారి ని వేధిస్తూ ఈ ప్రభుత్వం ఏంసాధించాలి అనుకుంటోంది? ఉపాధ్యాయులు మంచి విదార్థుల్ని తయారుచేస్తేనే దేశాలు అభివృద్ధి చెందాయనే వాస్తవాన్ని పాలకులు విస్మరించడం సిగ్గుచే టు. విద్యావిధానాన్ని నాశనంచేస్తే, రాష్ట్రంలో ఏరంగం నిలవలేదనే వాస్తవాన్ని రాష్ట్రప్రభుత్వం గుర్తించాలి. రాష్ట్రంలో విద్యారంగం పరిస్థితి ఏమీబాగోలేదు. బోధనా, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థులు కూడా సంతోషంగా లేరు. 117 జీవోతో పిల్లలకు పాఠశాలలు అందుబాటు లో లేకుండా చేసి, ఏం సాధించారో పాలకులుచెప్పాలి. వైసీపీప్రభుత్వానికి ఇంకా ఒక్కసంవ త్సరమే మిగిలింది.

ఆఖరిసంవత్సరంలో విద్యావ్యవస్థను సర్వనాశనంచేసేవరకు నిద్రపోరా? మంత్రి బొత్స సత్యనారాయణ, విద్యాశాఖాధికారులు సెలవురోజుల్లో ఉపాధ్యాయుల్ని పాఠ శాలలకు రమ్మంటూ ఇచ్చిన ఉత్తర్వులపై ఆలోచనచేయాలి. వెంటనే వాటిని రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నాం. జగన్ విద్యారంగానికి సంబంధించి తీసుకుంటున్న నిర్ణయాలతో ఏం సాధించారో చెప్పాలని ఆ రంగంలో 38సంవత్సరాలు అనుభవం ఉన్నవ్యక్తిగా అడుగుతున్నా ను. సెలవులు ఉపాధ్యాయులు, పిల్లలకు ఇద్దరికీ ఇవ్వాలి. కానీ, పిల్లలకు సెలవులు అయితే ఉపాధ్యాయులు ఎందుకు పాఠశాలలకు రారనే వితండవాదన చేయడం మంచిపద్ధతికాదు. పబ్లిక్ హాలిడేస్ లో పాఠశాలలు నిర్వహించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకుంటే, ఉపాధ్యాయులు కూడా పాలకుల్లో కొంతమార్పు వచ్చింది.” అని సంతోషిస్తారని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

LEAVE A RESPONSE