వార్షికోత్సవం రోజు భలే ఉమ్మించాడు వైకాపా సమాధి మీద సజ్జల
భరతమాత గుండెలమీద తాత పోటు
బ్రిటిష్ అరాచకాలపై దేశంలో స్వాతంత్ర్య సమరయోధులు అమరులవుతూ.. రక్తం చిందిస్తున్న రోజుల్లో… ఒక్క “బీఫ్ కాంట్రాక్టర్” (సీమ పంది మాంసం సప్లైర్) వైఎస్ రాజారెడ్డి (జగన్ తాత), భరత మాత ముద్దు బిడ్డల వీరుల మీద రాళ్లు విసిరి, ఇంగ్లండు దొరలకు “ఇది నా డీఎన్ఏ సేవ!” అని సెల్యూట్ చేసాడు.
నమ్మి ఉద్యోగం ఇచ్చిన వారిని హత్య చేసి గని యజమాని అయ్యాడు తాత
బీసీ సామాజిక వర్గానికి చెందిన జింకా వెంకట నరసయ్య తన బెరైటీస్ గనిలో రాజారెడ్డికి ఉద్యోగం ఇచ్చాడు. తరువాత భాగస్వామ్యం ఇచ్చాడు. కానీ, ఈ కృతఘ్నుడు “భాగస్వామ్యం కంటే 100% ఓనర్షిప్ బాగుంటుంది!” అని, మైన్ ఓనర్నే హత్య చేసి, గనిని కబ్జా చేసుకున్నాడు. మన్వడికి బీసీలు తమ ఓట్లతో పవర్ వస్తే, వాళ్లనే తొక్కి ఎక్కే స్కిల్లుకు తాత వేసిన ఫౌండేషన్!
కాంగ్రెస్‌లో తాత, తండ్రులు నల్లుల్లా – మనవడు పాములా కాటేశాడు
కాంగ్రెస్‌ను అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకొని, అదే కాంగ్రెస్స్‌ను కాటేశాడు విషనాగును మించిన జగన్.
తాత గనిని కబ్జా చేసినట్లు పార్టీని కబ్జా చేశాడు.
పార్టీని స్థాపించడం గొప్ప కాదు, వేరే పార్టీని కబ్జా చేయడం అసలైన ‘కళ’ అంటున్నట్టుంది! శివకుమార్ స్థాపించిన వైకాపా పార్టీని కబ్జా చేసి అతనికి కూడా నామాలు పెట్టాడు! నాయన పేరు వినపడతుంది పార్టీ పేరులో కానీ ఆ పేరులోని యువజన,శ్రామికులు,రైతులు మట్టిగొట్టుకుపోయేలా ఐదేళ్లు పాలించాడు.
తన సీటు ఇచ్చిన బాబాయిని గొడ్డలికి బలిచ్చాడు
ఎత్తుకొని పెంచిన బాబాయి, తన ఎంపీ సీటు ఇచ్చాడు జగనుకు రాజకీయ జీవితాన్ని ప్రసాదిస్తూ. ఓట్ల కోసం, ఆయన్ను గొడ్డలితో నరికి చంపిన కిరాతకుల్ని కాపాడాడు, ఎంపీ టికెట్టు ఇచ్చాడు.
తనకోసం కష్టపడ్డ చెల్లిని గెంటేశాడు
రక్తం పంచుకు పుట్టిన చెల్లి, అన్న జైల్లో వుంటే.. పాదయాత్ర చేసింది. అన్న గెలుపు కోసం అహోరాత్రులు కష్టపడింది. గెలవంగానే.. ఇంటి గడప తొక్కనివ్వలేదు. నాయన చెప్పినట్లు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు. మెడపట్టుకొని గెంటేశాడు
కని పెంచిన తల్లిని కోర్టుకు ఈడ్ఛాడు.
పెళ్లి చేసుకొని చిన్నవయసులోనే కని పెంచింది. బైబిల్ పట్టుకొని రాజకీయ ప్రసంగాలు చేసింది కొడుకు కోసం. వైజాగ్‌కు పంపి ఓడించినా గౌరవ అధ్యక్షురాలిగా సేవలు అందించింది. ఆ గౌరవ పదవి ఊడగొట్టాడు, ఇంటి నుండి కూడా తరిమేశాడు.
భారతమాతకు, నమ్మిన యజమానికి తాత – టికెట్ ఇచ్చిన పార్టీకి, ఖాలీ చేసిన బాబాయికి, సొంత ఇంటికే ఆయన మనవడు ద్రోహానికి వెనకాడలేదు. తెలిసీ ఒక్క ఛాన్స్ ఇచ్చి ఓటేసిన ఓటరుకూ అదే చేశాడు జగన్. నిశబ్దంగా వెంట్రుక కూడా పీకలేరు ఎవరూ అన్న జగన్ కోసం మాటు వేసిన వేటగాడిలా ఓటరు ఎదురు చూశాడు.
సరిగ్గా ఏదాది క్రితం ఓటరు జగన్ను రాజకీయంగా వేటు వేశాడు. అదే ఓటరును నేరుగా అనలేక వెన్ను పోటు అని అనలేక కూటమి పాలన ఏడాది వార్షికోత్సవానికి మరికొన్ని రోజులు వున్నా.. వెన్నుపోటు దినం అని తన అక్కసును వెళ్లగక్కుకోడానికి పిలుపు నిచ్చాడు.
గతంలో బస్సులో సామాజీక యాత్ర మొదలైనప్పుడు జనం రాక, రికార్డింగు డ్యాన్సులు పెట్టినా నాటి మంత్రులే చూసుకొన్నట్లు, నేడు వారు కూడా కళ్లు తిరిగి పడిపోయి ఆసుపత్రి పాలై జనంలో అభాసుపాలు అయ్యింది. కావాలని పోలీసులను దుర్బాషలాడి నేను కూడా నిరశన తెలిపా అని నోరున్న అంబటి చేతులు కడుక్కొన్నాడు. పిలుపినిచ్చిన జగన్ పత్తాలేడు.
గతంలో మాకు సపరేట్ సెక్షన్ ఆఫ్ ఓటర్స్ వున్నాడని బడాయి పోయిన సజ్జల, ఈ పిచ్చి ఐడియా ఇచ్చింది తానే కాబట్టి విజయవంతం అయ్యింది అని వచ్చి బడాయి కబుర్లు చెప్పాడు. మహాభారతానికి శకుని లెక్కన వైకాపాకు సజ్జల భలే సెట్ అయ్యాడు. ఐదేళ్ల జగన్ అరాచకాలను రీవైండ్ చేయించి వైకాపా సమాధి మీద కూడా మొదటి వర్ధంతి రోజు ఉమ్మేయించాడు సజ్జల.