Suryaa.co.in

Andhra Pradesh

నెల్లూరు చోరీఘటనపై రాష్ట్ర హైకోర్టు సుమోటాగా విచారణ చేపట్టాలి

– వైసీపీ కేడీగ్యాంగ్ చేస్తున్న అరాచకాలు చూస్తుంటే చెడ్డీగ్యాంగ్ కూడా నోరెళ్లబెట్టాల్సిందే
– నెల్లూరు కోర్టులోజరిగిన సాక్ష్యాల దొంగతనంపై జిల్లా ఎస్పీ చెప్పిన కట్టుకథలు, గతంలో కాకాణి చేసిన నిరాధార ఆరోపణలకంటే గొప్పగా ఉన్నాయి.
– ఇనుము దొంగిలించడానికి వచ్చిన వారు కుక్కలకు భయపడి కోర్టులోని రికార్డు గదిలోని సాక్ష్యాలు దొంగిలించారా? బస్టాండ్ లో పడుకున్న అనామకుల్ని చోరీ కేసులో ఇరికిించి అసలుదొంగల్ని తప్పించడానికి, అధికారాన్ని ప్రసన్నంచేసుకోవడానికి పోలీస్ వారు ప్రయత్నిస్తున్నారు.
• నకిలీపత్రాలతయారీలో, నకిలీమద్యం అమ్మకాల్లో, ఫోర్జరీ డాక్యుమెంట్లుసృష్టిలో, భూకబ్జాల్లో, అరాచకాల్లో ఆరితేరినవ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏరికోరిమరీ కేబినెట్ లోకితీసుకున్నారు…దానిఫలితమే నెల్లూరుకోర్టులోజరిగిన సాక్ష్యాల దొంగతనం.
• తనపై 38వరకు కేసులున్నాయి.. కాకాణిపై 7కేసులుంటే ఏమవుతుందని భావించే ముఖ్యమంత్రి కాకాణికి మంత్రిపదవి ఇచ్చాడా?
మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

నేరచరిత్రలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే సరికొత్తతీరుగా ముందుకు వెళ్తోందని, అందుకు ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి నాయకత్వమేనని, స్వాతంత్ర్యం వచ్చాక దేశచరిత్రలో ఎన్నడూ జరగనివిధంగా కోర్టులోని రికార్డురూములో భద్రపరిచిన సాక్ష్యాధారాల దొంగతనం జరిగిందని, అదికూడా రాష్ట్రమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తితాలూకా కేసుకు సంబంధించిన సాక్ష్యాలు మాయం కావడమే ఇక్కడ ప్రధానాంశమని టీడీపీసీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అభిప్రాయపడ్డారు.సోమవారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడా రు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే …

కోర్టులో దొంగిలింపబడిన సాక్షాలు, కాకాణి గోవర్థన్ రెడ్డికేసుకు సంబంధించినవి. అదికూడా ఆయనమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారంలోనే చోరీఘటన జరిగింది. ఒకసారి ప్రజలంతా కాకాణి గోవర్థన్ రెడ్డి జీవితం, ఆయనకుసంబంధించిన నేరచరిత్రను గురించి తెలుసుకోవాలి. రాజకీయాల్లోకి రాకముందు.. వచ్చినతర్వాత అని రెండుకోణాల్లో ఆయనచరిత్రను గమనిం చాలి. నకిలీమద్యం, నకిలీ పాస్ పోర్ట్ లు, భూకబ్జాలు, హత్యలు, అరాచకాలు, తనకు అడ్డొచ్చినవారిని, తనను ప్రశ్నించినవారిని అడ్డులేకుండా చేయడం వంటివన్నీ ఆయన నేర చరిత్రకు ఆనవాళ్లు. చట్టానికి వ్యతిరేకంగా ఏమేమీ చేయవచ్చో, అవన్నీ చేసిన ఏకైక వ్యక్తిగా కాకాణి రాష్ట్రనేరచరిత్రలో తనకంటూ ప్రత్యేకంగా ఒక పేజీని లిఖించుకున్నాడు.

తెలుగుదేశంపార్టీలోకీలకనేత, రాష్ట్రవ్యాప్తంగా అందరికీ సుపరిచితుడైన సీనియర్ రాజకీయ నాయకుడైన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై 2016 డిసెంబర్ 23న, కాకాణి గోవర్థన్ రెడ్డి అనేక ఆరోపణలు చేశాడు. సోమిరెడ్డి ఎక్కడో మలేషియాలో భూములుకొన్నాడని, థాయ్ లాండ్ లో విద్యుత్ ప్రాజెక్ట్ లు ఉన్నాయని, సింగపూర్, హాంకాంగ్ లోని బ్యాంకుల్లో మిలియన్ డాలర్ల సొమ్ములు దాచారని ఇలా…రకరకాలుగా తనరాజకీయప్రత్యర్థి అయిన సోమిరెడ్డిపై కాకాణి నోటికొచ్చినట్లుగా ఆరోపణలుచేశాడు. ఆక్రమంలోతానుచేసిన ఆరోపణలు అన్నీ నిజమని నమ్మించేందుకు నకిలీపత్రాలుసృష్టించడమేకాకుండా, తనఆరోపణలధాటిని కాకాణి మరింత తీవ్రతరంచేసి, సోమిరెడ్డి పరువుప్రతిష్టలను మంటగలిపాడు.

కాకాణి ఇష్టాను సారం సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలను నిరూపించాల్సిన బాధ్యత ఆయనపైనేఉంది. తనపై, కాకాణి గోవర్థన్ రెడ్డిచేసిన ఆరోపణలకు స్పందిస్తూ సోమిరెడ్డిచంద్రమోహన్ రెడ్డి గారు “మీరు చేసిన ఆరోపణలను రుజువుచేయాలని, అవన్నీనిజాలని తేలితేతాను దేనికైనాసిద్ధమే” అని తేల్చిచెప్పారు. సోమిరెడ్డి గారి సవాల్ తో అప్పుడే కాకాణిగోవర్థన్ రెడ్డి తోకముడిచాడు.

2016 డిసెంబర్ 28న స్వయంగా చంద్రమోహన్ రెడ్డి గారు కాకాణి తనపై చేసిన ఆరోపణలు, ఆయన చూపిన సాక్ష్యాలు(పత్రాలు) అన్నీ ఫోర్జరీవని, కల్పితాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్ 120(బీ), 468, 469, 471, 506 సెక్షన్లతో పాటు, ఐటీచట్టంలోని 61, 75 సెక్షన్లకింద కూడా సోమిరెడ్డి గారు కాకాణి గోవర్థన్ రెడ్డిపై కేసులు నమోదుచేయించారు. కాకాణి గోవర్థన్ రెడ్డి చేసింది సాదాసీదా నేరం కాదు. సోమిరెడ్డిగారిని ప్రజల్లో, రాజకీయాల్లో బలహీనపరిచేందుకు ఏకంగా అంతర్జాతీయ బ్యాంకుల్లో నకిలీఖాతాలు ఉన్నట్లు చూపడం, ఇమ్మిగ్రేషన్ చట్టాలకు వ్యతిరేకంగా నకిలీపత్రాలు సృష్టించడం, నకిలీపాస్ పోర్ట్ లు తయారు చేయడం వంటివిచేశారు.

నకిలీపత్రాలు… నకిలీసాక్ష్యాలు సృష్టించాడని తేలిన కాకాణి గోవర్థన్ రెడ్డిపై పోలీసులు పలుసెక్షన్ల కింద కేసులునమోదుచేసి, పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలుచే శారు. వాటివిచారణ న్యాయస్థానాల్లో కొనసాగుతోంది. కాకాణి తప్పుచేశాడని న్యాయస్థానాల లో రుజువైతే కనీసం ఆయనకు ఏడేళ్ల వరకు శిక్షపడే అవకాశాలుఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో వైసీపీప్రభుత్వం అధికారంలోకిరాగానే 2020 జూన్ 9న కాకాణిపై ఉన్న అభియోగాలవిచారణలో జరుగుతున్న ప్రాసిక్యూషన్ ను ఉపసంహరించుకుంటున్నట్లు జీవోనెం 560 ని విడుదలచేశారు. జీవో ఇవ్వడాన్ని న్యాయస్థానాలుకూడా తప్పుపట్టాయి.

ఒకవ్యక్తి పరువుప్రతిష్టలు భంగంకలిగించేలా తప్పుడు పత్రాలుసృష్టించడం, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ఫోర్జరీపత్రాలుసృష్టించడం జరిగిన కేసుతాలూకా విచారణకు సంబం ధించి ప్రభుత్వం జీవోలు ఎలాఇస్తుందని ప్రశ్నించడంతో జగన్మోహన్ రెడ్డిసర్కారు తోకముడి చింది. జీవో నెం 560ని వెంటనే జగన్ సర్కారు వెనక్కుతీసుకుంది.

ప్రజాప్రతినిధులైన వారిపై ఉన్నకేసుల విచారణ త్వరగా ముగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల తో విజయవాడలో ప్రత్యేకకోర్టు ఏర్పాటుచేయడంజరిగింది. దానిలోనే కాకాణిగోవర్థన్ రెడ్డి తప్పుడు అభియోగాల కేసువిచారణ జరుగుతోంది. 2022 మేమూడోవారంలో నెల్లూరు కోర్టు నుంచి కాకాణి గోవర్థన్ రెడ్డి కేసుకు సంబంధించిన సాక్ష్యాలుఇతర కీలకపత్రాలను విజయవా డ కోర్టుకి తరలించారు. ఈ నేపథ్యంలో కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయనకు సంబంధించిన కేసుల్లోని సాక్ష్యాలు, ఇతరత్రా ఆధారాలు చోరీకి గురయ్యా యి.

చోరీ ఘటనను దర్యాప్తుచేశామని నెల్లూరుజిల్లాఎస్పీ ప్రకటించారు. ఇనుము దొంగతనానికి వెళ్లినవాడుకుక్కలు వెంటపడితే కోర్టులోకి వెళ్లి, అక్కడి రికార్డురూములోని కాకాణి కేసుకుసంబంధించిన సాక్ష్యాలున్న బ్యాగ్ ను తస్కరించాడని జిల్లాఎస్పీ చెప్పారు. ఎస్పీ ప్రకటన చూస్తుంటే కాకమ్మకబుర్లు కూడా సిగ్గపడతాయేమో. బస్టాండ్ సమీపంలో ఉండే హయత్, రసూల్ అనే ఇద్దరువ్యక్తులు కోర్టులో చోరీకి పాల్పడ్డారని నెల్లూరుజిల్లాఎస్పీ విజయరావు గారు నిన్న(17వతేదీన)ప్రకటించారు.

తలపై మూడుసింహాల టోపీపెట్టుకున్న జిల్లాపోలీస్ బాస్ కట్టుకథలుఅల్లడంలో కాకాణి గోవర్థన్ రెడ్డినే మించిపోయాడు. కోర్టులో జరిగిన చోరీకేసువ్యవహారంలో నెల్లూరుజిల్లాఎస్పీ చెప్పింది వింటే కాకమ్మకథలే కంగుతింటాయనిపించింది. సోమిరెడ్డిపై చేసినతప్పుడు ఆరోపణలతో ఇప్పటివరకు కాకాణి ముందుంటే, తాజాగా జిల్లాఎస్పీ విజయరావు తనప్రకటనతో కాకాణి గోవర్థన్ రెడ్డిని మించిపోయేలా కట్టుకథలు అల్లారు. కోర్టు ప్రాంగణంలో ఏంఇనుము ఉందని, అక్కడేం నిర్మాణం జరుగుతోందని ఇనుముదొంగిలించేవారు అక్కడికి వెళ్లారని ప్రశ్నస్తున్నాం.

కోర్టులోని రికార్డు రూములో ఇనుము దాచి ఉంచితే, దాన్ని దొంగిలించడానికి ఇనుము దొంగలు వెళ్లారా ఎస్పీగారు! కోర్టులోని రికార్డురూములోని కీలక పత్రాలతో ఇనుముదొంగిలించే వ్యక్తలకు పనేంటి పోలీస్ బాస్? ఇనుము దొంగిలించేవారు ఎలాంటి రవానా వాహానాలు లేకుండా, దొంగిలించినఇనుము ఎలా తరలించాలో తెలియకుండానే దొంగతనా నికి వెళతారా? కోర్టులోని రికార్డు రూమ్ తాళాలు పగలగొట్టి, ఆగదిలోని ఇతర విలువైన వస్తువులు ఏవీ తాకకుండా , కాకాణి కేసుకు సంబంధించిన ఆధారాలు మాత్రమే సదరుదొంగలు ఎలాదొంగిలించారో నెల్లూరుఎస్పీ సమాధానంచెప్పాలి?

కాకాణి ముద్దాయిగాఉన్న కేసుఫైల్ లోని పత్రాలు మాత్రమే సదరుఇనుము దొంగలకు ఎందుకు అవసరమయ్యాయో జిల్లాఎస్పీచెప్పాలి? చోరీఘటనకుసంబంధించి, పోలీస్ వారు పరిశీలించిన పూర్తిదృశ్యాలు, సేకరించిన పూర్తిసమాచారాన్ని బయటపెట్టకుండా, కనీకనిపించకుండా ఉన్న సీసీ.టీవీపుటేజ్ మాత్రమే ఎస్సీ ఎందుకు బయటపెట్టారు? అసలు దొంగలను కాపాడుందుకే జిల్లాఎస్పీ బస్టాండ్ లో పడుకున్నఅనామకుల్ని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నంచేస్తున్నారు. కోర్టులోని రికార్డురూములో వివిధ కేసులకు సంబంధించి న వేలాది సాక్ష్యాలుంటే కాకాణి కేసు ఫైల్ మాత్రమే ఎందుకు మాయమవుతుంది ఎస్పీగారు?

మంగళగిరిలోని మంత్రివిల్లాలో మరణించిన మహమ్మద్ కు, నెల్లూరులోజరిగిన సాక్ష్యాల చోరీకి సంబంధం ఉంది.మంగళగిరిలోని మంత్రికాకాణి విల్లాలో ఏసీ మెకానిక్ షేక్ మహ్మద్ అనుమానాస్ప దంగా ఎందుకు మృతిచెందాడు? ఏసీమెకానిక్ 16వతేదీన చనిపోతే, 17వతేదీవరకు ఆవార్త ఎందుకు బయటకురాలేదు? ఏం చేయాలని, ఏ ఉద్దేశంతో మహమ్మద్ మృతివిషయాన్ని దాచిపెట్టారు? కోర్టులోని రికార్డురూములోజరిగిన సాక్ష్యాల దొంగతనానికి, మంగళగిరిలో కాకాణి విల్లాలో మెకానిక్ మృతికి సంబంధంఉంది. రెండుఘటనల మధ్యన ఉన్న సంబంధంఏమిటో, నెల్లూరుకి, మంగళగిరికి మధ్యన నడిచిన మంత్రాంగమేంటో పోలీసులు తేల్చాలి.

భూకబ్జాలు, హత్యలు, అరాచకాల్లో మునిగితేలేవారిని కేబినెట్లోకి తీసుకుంటే ఎంతటిప్రమాదకర పరిస్థితులు ఎదురవుతాయో చెప్పడానికి కోర్టులో చోరీఘటనే పెద్దనిదర్శనం. జగన్మోహన్ రెడ్డి కాకాణికి మంత్రిపదవి ఇచ్చి, మరిన్ని దారుణాలు చేయమని ప్రోత్సహించినట్టుంది. నిత్యం వందలాదిమంది పోలీసులు తిరిగే ప్రదేశం, నెల్లూరుజిల్లాఎస్పీకి కూతవేటు దూరంలో ఉన్న ప్రదేశంలోని న్యాయస్థానంలో పట్టపగలే చోరీజరగడమేంటి ఎస్పీగారు? సదరుచోరీ జరిగినతీరుని బట్టే, దానివెనుక భారీస్కెచ్ ఉందని అర్థమవుతోందికదా!

నకిలీపత్రాలతయారీలో, నకిలీమద్యం అమ్మకాల్లో, ఫోర్జరీ డాక్యుమెంట్లుసృష్టిలో, భూకబ్జాల్లో, అరాచకాల్లో ఆరితేరినవ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఏరికోరిమరీ కేబినెట్ లోకి తీసుకున్నారు.దాని ఫలితమే నెల్లూరుకోర్టులోజరిగిన సాక్ష్యాల దొంగతనం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రోత్సాహమే కోర్టులోజరిగిన దొంగతనానికి ప్రధానకారణం.

గతంలో కాకాణి గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై లెక్కకుమిక్కిలిగా నిరాధార ఆరోపణలు చేశారు.రూ.1500కోట్ల సొమ్ముని సింగపూరులో దాచారని, దానికోసమే సోమిరెడ్డి తరచూ సింగపూర్ వెళ్తుంటాడని చెప్పాడు. తానుచేసిన తప్పుడు ఆరోపణల్ని సమర్థించుకోవడానికి కాకాణిగోవర్థన్ రెడ్డి ఏకంగా నకిలీ పత్రాలు, తప్పుడు సాక్ష్యాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు, నకిలీపాస్ పోర్ట్ లే సృష్టించాడు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిగారు, కాకాణిపైపెట్టిన కేసులకుసంబంధించి పోలీస్ వారు నమోదుచేసిన ఛార్జ్ షీట్లో కాకాణి గోవర్థన్ రెడ్డి ఏ1గాఉంటే, నకిలీపత్రాలు తయారుచేసిన పుసుపులేటి చిరంజీవి ఏ2గా, పీ.వెంకటకృష్ణయ్య ఏ3గా, జీ.హరిహరన్ లు ఏ4గా ఉన్నారు.

ఈ అంశాలన్నీ పోలీస్ వారు ఛార్జ్ షీట్లో పేర్కొన్నవే. కాకాణి సృష్టించిన పత్రాలు మొత్తం నకిలీవేనని ఫోరెన్సిక్ నివేదికలో కూడా తేలిపోయింది. ఎన్నికలసమయంలో నకిలీమద్యాన్ని నకిలీహలోగ్రామ్స్ తో పంచిన కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డిపై సర్వేపల్లిపోలీస్ స్టేషన్లోనే అనేకకేసులున్నాయి. అలానే 2016లో జరిగిన భూకబ్జాలు (సీసీనెం-442) నకిలీపత్రాలు, ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన ఘటనతాలూకా 2016లో నమోదైన కేసు(సీసీనెం:521). సీసీనెం:69 ప్రభుత్వాధికారులపై దౌర్జన్యం ఇలాఅనేకకేసులున్నాయి.

ఇన్ని గొప్ప ఘనకార్యాలు సాధించాడనే జగన్మోహన్ రెడ్డి, కాకాణికి మంత్రిపదవిఇచ్చాడా? తనపై దాదాపు 38వరకు కేసులున్నాయి.. కాకాణిపై 7కేసులుంటే ఏమవుతుందని ముఖ్యమంత్రి భావించినట్లున్నాడు. రాష్ట్రంలో వైసీపీ కేడీగ్యాంగ్ చేస్తున్న అరాచకాలు చూస్తుంటే చెడ్డీగ్యాంగ్ కూడా నోరెళ్లబెట్టాల్సిందే. దొంగతనానికి వచ్చేవాడు.. డబ్బుకోసమే, బంగారంకోసమో..ఇతరత్రావిలువైన వస్తువులకోసమో వెళతారు. కానీ కోర్టురూములోని పత్రాలు దొంగిలించడానికి చోరవృత్తిని నమ్ముకున్నవారు ఎవరూ పనిగట్టుకొని వెళ్లరు. నేరప్రవృత్తి కలిగిన ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తుండబట్టే, రాష్ట్రంలో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి.

కాకాణిపై ఉన్నకేసులు విచారణ విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానంలో జూన్ మొదటివారం నుంచి ప్రారంభంకానుంది. అందుకనే పక్కాప్రణాళికతోనే తనపై ఉన్న కేసులతాలూకా సాక్ష్యాలను దొంగిలింపచేశారు. న్యాయవిచారణకు హాజరుకాకుండా ఇన్నాళ్లనుంచి కాకాణి తప్పించుకు తిరుగుతున్నారు. న్యాయవిచారణ జరక్కకుండా, సాక్ష్యాలు దొంగించి, తాను ఎలాగైనాచేసిన నేరంనుంచి బయటపడాలనే కాకాణి ఈ పనిచేయించాడని ప్రజలందరి అనుమానం.

ఆ క్రమంలోనే కోర్టులో చోరీచేసిన వారిని వదిలేసి, ఎక్కడో బస్టాండ్ లో పడుకున్నవారిని దొంగలుగాచూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నెల్లూరుకోర్టులో జరిగిన సాక్ష్యాలదొంగతనం స్ఫూర్తితో నేరగాళ్లు, నేరారోపణలు ఎదుర్కొంటున్నరాజకీయనేతలు దేశవ్యాప్తంగా రెచ్చిపోతే, పరిస్థితి ఎంతదారుణంగా ఉంటుందో ప్రతిఒక్కరూఆలోచించాలి. నెల్లూరు కోర్టులోని రికార్డు గదిలోజరిగిన చోరీవ్యవహారాన్ని రాష్ట్రహైకోర్టు తక్షణమే పరిగణనలోకి తీసుకొని, సుమోటాగా విచారణ చేపట్టాలని కోరుతున్నాం.

కోర్టులకు, న్యాయమూర్తులకు రక్షణ లేకపోతే, ఇకసామాన్యుల పరిస్థితేమిటన్నది ఇప్పుడుప్రతిఒక్కరి మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. ఈఘటనపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం జోక్యంచేసుకోకుంటే, భవిష్యత్ లో ఎలాంటి కేసులతాలూకా విచారణజరగదని, వాటికి సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలు ఇంతకంటే ఘోరంగా మాయమవుతాయని చెప్పడానికిఎలాంటి సందేహంలేదు.

LEAVE A RESPONSE