నెల్లూరు కోర్టులో జరిగిన సాక్ష్యం చోరీ ఘటనపై హైకోర్టు తక్షణమే స్పందించాలి

– సీబీఐతోగానీ, రిటైర్డ్ న్యాయమూర్తితో గానీ విచారణజరిపించి, అసలుదోషులను శిక్షించాలి. నెల్లూరులో జరిగిన సాక్ష్యాల చోరీ ఘటనలో దోషులకు శిక్షపడకుంటే, అదే విధానాన్ని కేసులున్న నేతలందరూ దేశవ్యాప్తంగా అమలు చేస్తారు
• నెల్లూరు కోర్టులో జరిగిన సాక్ష్యం చోరీ ఘటనపై ముఖ్యమంత్రి కిమ్మనకుండా కూర్చోడవమేంటి?
• కోర్టులో జరిగిన సాక్ష్యం చోరీ ఘటనపై నెల్లూరు జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పెట్టిన ప్రెస్ మీట్ చిన్నపిల్లల ప్రెస్ మీట్ లా ఉంది.
• ఒక ఐపీఎస్ అధికారి, ఎవర్నోరక్షించాలన్నతపనతో, ఎవరినో సంతృప్తిపరచాలన్న హడావుడితో మీడియాతో మాట్లాడినట్లుఉంది.
• సాక్ష్యాలున్న సంచి మిస్సయితే ఎవరికి లాభమనే వాస్తవాన్ని ఎస్పీగారు తన ప్రెస్ మీట్లో ఎక్కడాచెప్పక పోవడమేంటి?
• ఎవరిని సంతోషపరచడానికి, ఎవరి లబ్ధికోసం నెల్లూరు ఎస్పీ గారు, సాక్ష్యాలచోరీకేసుని నిశితంగా దర్యాప్తుచేయలేదని ప్రశ్నిస్తున్నాం.
• సీబీఐ విచారణో, రిటైర్డ్ న్యాయమూర్తితోనో విచారణజరిపించి, కుట్రవెనకున్న అసలుదోషులను రాష్ట్ర హైకోర్ట్ కనిపెట్టాలని కోరుతున్నాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

నెల్లూరు జిల్లాలోని నాలుగో అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో ఇటీవల జరిగిన చోరీ, ఇప్పుడురాష్ట్రవ్యవసాయశాఖ మంత్రిగా ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి, గతంలో ఎమ్మెల్యేగాఉన్నప్పుడు మోపబడిన ఛార్జ్ షీట్ లోని సాక్ష్యాలకు సంబంధించినదని, సదరు దొంగతనాన్ని న్యాయవ్యవస్థపై జరిగిన దాడిగా భావించాలని అందరూ అభిప్రాయపడ్డారని, అయినా ప్రభుత్వం కిమ్మనకుండా కూర్చుందని, న్యాయశాఖ ముఖ్యమంత్రి చేతుల్లో ఉన్నట్లుగా అనిపిస్తోందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్లరామయ్య అభిప్రాయపడ్డారు.గురువారం ఆయన మంగళగిరిలోనిపార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే మీకోసం…

నెల్లూరుకోర్టులో జరిగినసాక్ష్యాలచోరీ ఘటనపై ముఖ్యమంత్రి కిమ్మనకుండా కూర్చోడవమేం టి? న్యాయశాఖ కూడా ముఖ్యమంత్రిచేతుల్లోఉందా? చోరీ వ్యవహారంపై ఎవరికి వారు తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండిపోవటం విచిత్రంగాఉంది. కోర్టులోజరిగిన సాక్ష్యాలచోరీ ఘటనపై నెల్లూరుజిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ పెట్టిన ప్రెస్ మీట్ చిన్నపిల్లల ప్రెస్ మీట్ లా ఉంది.

ఒక ఐపీఎస్ అధికారి, ఎవర్నోరక్షించాలన్నతపనతో, ఎవరినో సంతృప్తిపరచాలన్న హడావుడితో మీడియాతో మాట్లాడినట్లుగా అనిపించింది. చిత్తుకాగితాలు ఏరుకునే ఇద్దరుపాతనేరస్తులు కుక్కులు అరిస్తే భయంతో కోర్టులోకి చొరబడి, చేతికిదొరికిన మంత్రిగారి సాక్ష్యాలతాలూకా బ్యాగ్ తీసుకొని పారిపోయారనడం హాస్యాస్పదంకాదా? ఎలాంటిదొంగలైనా సరే కోర్టుల్లో, పోలీస్ వారిఇళ్లల్లో దొంగతనాలు చేయాలంటే చాలాభయపడతారు. శిక్షలుపడే స్థానాల్లో ఎలాంటి దొంగలైనాసరే దొంగతనంచేస్తారా? సాక్ష్యాలున్న సంచి మిస్సయితే ఎవరికి లాభమనే వాస్తవాన్ని ఎస్పీగారు తన ప్రెస్ మీట్లో ఎక్కడాచెప్పక పోవడమేంటి? ఎవరిని సంతోషపరచడానికి, ఎవరిలబ్ధికోసం నెల్లూరుఎస్పీగారు, సాక్ష్యాలచోరీకేసుని నిశితంగా దర్యాప్తుచేయలేదని ప్రశ్నిస్తున్నాం.

డాక్యుమెంట్లు, ల్యాప్ ట్యాప్ దొరికిందన్న ఎస్పీగారు, ల్యాప్ ట్యాప్ లోని సమాచారమంతా యథావిధిగా ఉందో లేదోచూశారా? సెల్ ఫోన్లు మూడుదొరికాయన్నారు.. వాటిలో ఉండాల్సిన సమాచారమంతా ఉందా? కొన్ని డాక్యుమెంట్లు దొరకలేదన్నారు.. కాకాణి గోవర్థన్ రెడ్డి గారి నేరాన్నినిరూపించే డాక్యుమెంట్లే మాయమయ్యాయా? ముద్దాయిల వద్ద దొరికిన సాక్ష్యాధారాల్లోనిసమాచారం ఏమీ మిస్సవ్వకుండా వాటిని తిరిగి కోర్టుకు సమర్పించారా ఎస్పీగారు? మాయమైన సాక్ష్యాధారాలు కాకాణి గోవర్థన్ రెడ్డికిచెందినవి అయినప్పుడు ఆయన్ని ఎందుకు విచారించలేదు? ఇవేవీ చెప్పకుండా, హడావుడిగా ఇద్దరిని తీసుకొచ్చి, మీడియా వారితో దొంగలు దొరికారు చెప్పేస్తే ఎలా ఎస్పీ గారు? సాక్ష్యాలచోరీ వెనకున్న కుట్రకోణాన్ని ఎందుకు మీరు టచ్ చేయలేకపోయారో చెప్పండి ఎస్పీగారు?

కుట్రలో దాగిఉన్న పెద్దతలకాయల వ్యవహారం తేల్చాల్సిన బాధ్యత మీపై లేదా ఎస్పీగారు? కాకాణి గోవర్థన్ రెడ్డికి లబ్దిచేకూర్చడకోసం కోసం పోలీస్ వారు ఇలాంటికట్టుకథలు అల్లారని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతాడు. 1997లో ఢిల్లీలోని ఉపహార్ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగిన కేసు విచారణలో ఆధారాలను రూపుమాపడానికి వాటిపై ఇంక్ పోశారు. దాన్ని గమనించిన న్యాయమూర్తి ఏ సాక్ష్యాలపై అయితే ఇంక్ పోశారో, అవిలేకపోతే ఎవరికి మేలుకలుగుతుందో భావించి, వారికే అదనపు శిక్ష విధించారు. అదేవిధంగా నెల్లూరు కోర్టులో జరిగిన చోరీఘటనపై నిశితంగా, సమగ్రమైన దర్యాప్తుజరపకుండా, సాక్ష్యాలు మాయమైతే ఎవరికి లబ్ధి కలుగుతుందనే దిశగా దర్యాప్తు జరగకుండా, తాడిచెట్టు ఎందుకుఎక్కారంటే దూడమేతకు అన్నట్లుగా నెల్లూరుఎస్పీ కట్టుకథలు చెప్పుకొచ్చారు.

నెల్లూరు కోర్టులో జరిగిన చోరీకి సంబంధించిన అసలైన సాక్ష్యాలన్నీ కాకాణి గోవర్థన్ రెడ్డికి చేరాయా లేదా ఎస్పీగారు? ఈ కేసులో కాకాణి గోవర్థన్ రెడ్డికి నోటీసులు ఇచ్చిఎస్పీగారు ఆయన్ని విచారించారా? కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రయితే ఆయన్ని విచారించరా? ఇతరరాష్ట్రాలకు సంబంధించిన పెద్దనేరస్తులు, మోసం, ఫోర్జరీల్లో ఆరితేరినవారంతా కాకాణితో పాటు సహనిందితులుగా ఉన్న కేసుతాలూకా సాక్ష్యాలుదొంగతనానికి గురైతే, అంతతేలిగ్గా ఎలాతీసుకుంటారు ఎస్పీగారు?

టీడీపీనేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలుచేసిన కాకాణిని కాపాడటానికి ఆయన దర్శకత్వంలోనే ఆయన బృందమంతా కలిసిపనిచేసింది. సింగపూర్ , మలేషియా బ్యాంకుల పేరుతో తప్పడు సమాచారాన్ని, నకిలీబ్యాంక్ ఖాతాలను, తప్పుడు పాస్ పోర్ట్ లను సృష్టించినకేసుని ఎస్పీగారు ఏదోచిన్న పెట్టీకేసులా తేల్చిపారేస్తారా?

గతంలో కూడాకాకాణిపై నకిలీమద్యం తయారీ, నకిలీహలోగ్రామ్స్ సృష్టించిన కేసులున్నాయి. అంతర్జాతీయస్థాయిలో నేరాలుచేసేవారితో సంబంధాలున్న కాకాణి గోవర్థన్ రెడ్డి, ఇనుపముక్కలు ఏరుకునేవారిని దొంగతనానికి పంపిస్తారా? కోర్టులో దొంగతనం చేస్తే ఎలాంటి శిక్షలు వేస్తారో పాతనేరస్తులైన కాగితాలు ఏరుకునేవారికి తెలియదంటారా ఎస్పీగారు? 7కేసుల్లో కాకాణి గోవర్థన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు… ఆ విషయం మీకుతెలియదా ఎస్పీగారు?

కోర్టు రికార్డురూములో మూడుబీరువాలుంటే ఏ మూడు తెవరకుండా, కాకాణి గోవర్థన్ రెడ్డి కేసుకి సంబంధించిన సాక్ష్యాలున్న బీరువానే ఎలా తెరిచారు.. సాక్ష్యాలున్న సంచినే ఎలా తీసుకెళ్లారు? సాక్ష్యాలు మాయంచేసే న్యాయవాది ఒకరు అక్కడికోర్టులోఉన్నారంటున్నారు.. అతన్నిఏమైనా విచారించారా ఎస్పీ గారు? ఇనుపముక్కలు ఏరుకునేవారికి పలానాబీరువాలో పలానాసంచిలో సాక్ష్యాలున్నాయని ఎలాతెలుస్తుంది ఎస్పీగారు?

ప్రజాప్రతినిధులపై ఉన్నకేసులవిచారణ చేస్తున్న విజయవాడలోని ప్రత్యేకన్యాయస్థానం వారు, కాకాణి గోవర్థన్ రెడ్డిపైఉన్నకేసులతాలూకా సాక్ష్యాలను తక్షణమే తమకుపంపాలని నెల్లూరుకోర్టుకి గతంలో లేఖరాశారు. వారు అలా లేఖరాసిన వెంటనే నెల్లూరుకోర్టులో సాక్ష్యాల చోరీ జరిగింది. ఇంతస్పష్టంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న అనేకఅంశాలు కాకాణిగోవర్థన్ రెడ్డి ప్రమేయాన్ని,పాత్రను ఎత్తిచూపుతుంటే, నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చిన్నపిల్లల కంటే దారుణంగా వ్యవహరించారు.

నెల్లూరు న్యాయస్థానం లో జరిగిన దొంగతనం ఆషామాషీగా జరిగిందికాదు. సదరు దొంగతనం వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. కోర్టులో జరిగిన సాక్ష్యం దొంగతనంతో ఎక్కవగా లబ్దిపొందే వ్యక్తి కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రమే. కాకాణిగోవర్థన్ రెడ్డిపై 7కేసులున్నాయనే ముఖ్యమంత్రి ఆయనకు మంత్రి పదవి ఇచ్చారా?

నెల్లూరులోని నాలుగో అదనపు మేజిస్ట్రేట్ కోర్టులోజరిగిన చోరీ వ్యవహారంపై తక్షణమే రాష్ట్ర హైకోర్టు జోక్యం చేసుకోవాలి. సీబీఐ విచారణ ద్వారా, రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారానో విచారణ జరిపించి అసలుదోషులను వెలికితీయాలని కోరుతున్నాం. రాష్ట్రంతో పాటు, అనేక రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా కేసుల్లో ఉన్న నాయకులందరూ ఇదే విధానాన్ని అమలు చేయకముందే, సాక్ష్యాలు మాయమైతే కేసుల నుంచి బయటపడవచ్చన్న ఆలోచనలు చేయకముందే రాష్ట్ర హైకోర్టు స్పందించాలని వేడుకుంటున్నాం. సీనియర్ అడిషనల్ డీజీ ర్యాంక్ అధికారిని ఈ కేసులో పర్యవేక్షకుడిగా ఉండాలని గతంలో డీజీపీకి లేఖ రాయడం జరిగింది.

Leave a Reply