-మట్టి, ఇసుక మాఫియాలకు తెరాస సర్కారే ఆద్యురాలు
-పెద్దపల్లి జిల్లా అధికార ప్రతినిధి ఇనుముల
హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చిన తరువాత ఇసుక పాలసీని మార్చి బి ఆర్ ఎస్ నాయకులు కోట్లు సంపాదించు కున్నారని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిది ఇనుముల సతీష్ పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్ లో ని గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు.
2014 నుండి 2018 వరకు ఎలాంటి అనుమతులు లేకుండా 4వేల కోట్ల మేర ఇసుక ను మంథని నియోజకవర్గం నుండి తరలించారని ఆయన అన్నారు. ఇసుక అక్రమ రవాణా అడ్డుకున్న ఆనాటి కాటారం సి ఐ బదిలీ చేయించారు. ఇసుక దోపిడీ గురించి ఆనాడు అన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని అన్నారు. మంథని నియోజకవర్గంలో ఎంతో మంది అమాయకులు ఇసుక లారీల కింద పడి చనిపోయారని, చనిపోయిన వారి కుటుంబాలను టిఆర్ఎస్ నాయకులు ఎందుకు ఆదుకోలేదు అన్నారు.
మంథని నియోజకవర్గం లో జరుగుతున్న ఇసుక దందా పైన…అమాయక ప్రజల ప్రాణాలు పోతున్న సంఘటన పైన రాష్ట్ర గవర్నర్కు ఆనాటి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు 2022 లో ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం ఇసుక క్వారీ ల పైన కోర్టుల నుండి నిలిపివేయాలని ఉత్తర్వులు పట్టించుకోకుండా, తమ అధికార బలంతో ఇసుకను తోడేసారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉన్న ఇసుక క్వారీల నుండి ఇసుకను తరలించవద్దని గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గౌరవ కోర్టు ఆదేశాలను పక్కాగా అమలు చేస్తున్నారని అన్నారు. గోదావరి నదిపై బినామీ అక్రమ సంస్థల ద్వారా టిఆర్ఎస్ నాయకులు అనుమతులు తీసుకొని అడ్డగోలుగా ఇసుక దోపిడీ చేశారని, కమిషన్లు తీసుకున్న మంథని మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే, కండ్లు మూసుకొని దోపిడీ కి కారణమయ్యారని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇనుముల సతీష్ టిపిసిసి మీడియా ప్రతినిధులు వెదిరే యోగేశ్వర్ రెడ్డి, కమాన్ పూర్ మండల పార్టీ అధ్యక్షులు వైనాల రాజుతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.