Suryaa.co.in

Telangana

తెలంగాణ ఉద్యమ తొలి, మలి దశ చరిత్రను భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచాలి

– అందుకు ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి లోని సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కృషి చేయాలి
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పిలుపు

హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, చరిత్ర తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ ఘట్టాల నేపథ్యాన్ని విస్తృత స్థాయిలో ప్రజలకు వివరించేందుకు సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ కృషి చేయాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పిలుపునిచ్చారు.

మంగళవారం డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ( ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి ) లో సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ విభాగం అధిపతిగా కెప్టెన్ పాండురంగారెడ్డి బాధ్యతలు తీసుకున్న కార్యక్రమానికి చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గొప్పతనం, చారిత్రక విశిష్టతను రాబోయే తరం తెలుసుకునే విధంగా రచనలు అందుబాటులో ఉండే విధంగా తెలంగాణ చరిత్రకారులు, కవులు, రచయితలు, సంస్థలు, ఉద్యమకారులు కృషి చేయాలని సూచించారు.

LEAVE A RESPONSE