Suryaa.co.in

Andhra Pradesh

ఉద్యమంపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా గర్హనీయం

– బిజెపి శాసనమండలి పక్ష నాయకుడు పివిఎన్ మాధవ్

ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం నిర్భందానికి గురిచేయడం ప్రభుత్వ అవివేకం.ఉద్యోగులు ప్రభుత్వానికి ఛోదక శక్తులే కాని చోరులు కారు ప్రభుత్వం గుర్తించాలి, ఉద్యోగుల పై పోలీసుల దమనకాండ నిర్వహించడం అన్యాయం.

సమస్యలను జఠిలం చేయకుండా ప్రభుత్వం అనవసరమైన ప్రతిష్టకు పోకుండా ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఒక వైపు ఉద్యమం కొనసాగుతుండగా మరో వైపు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఉద్యమం తీరు పై వ్యాఖ్యలు చేయడం అనేది ప్రజాస్వామ్య విరుద్దంగా భావించాలి.

ఉద్యోగుల సమస్యల పై ఆదినుండి ప్రభుత్వం ఒక వింత పోకడను అనుసరిస్తోంది అందువల్లనే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి అందువల్ల వెంటనే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంభించాలి.

LEAVE A RESPONSE