- అంగంగా ప్రదర్శన వీడియో తర్వాత… మేల్ ప్రాస్టిట్యూట్ అంటున్నారు
- చాలా బాధనిపిస్తుంది
- ఆ వీడియో నిజమే అయితే పార్లమెంటేరియన్లకు మాయని మచ్చే
- నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు
అంగాంగ ప్రదర్శన వీడియో తర్వాత
ఎంపీలను కొత్త పేరు పిలుస్తున్నారని… మేల్ ప్రాస్ట్యూట్స్ అంటున్నారని, ఆ వీడియో గనుక నిజమైతే పార్లమెంటేరియన్లకు మాయని మచ్చేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.. ఈ తరహా వ్యాఖ్యలు వింటుంటే బాధనిపిస్తుందని చెప్పారు. నగ్న వీడియో లో ఉన్నది ఒకవేళ మాధవ్ అయితే చర్యలు తీసుకోవాలన్నారు. తమ పార్టీపై పడిన మచ్చ తొలగించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… అనంతపురం ఎస్పీ పకీరప్ప చేసిన ప్రకటనతో ఎవరు ఏకీభవించరని కదా అని ప్రశ్నించారు. ఎవరు కూడా పకీరప్ప గురించి పట్టించుకోరని, మహిళలు మా పార్టీకి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఒకవేళ మాధవ్ పై చర్యలు తీసుకుంటే తప్పు చేశారు కాబట్టి చర్యలు తీసుకున్నారని అనుకుంటారన్నారు. అలా కాకపోతే, మాధవ్ ప్రజాకోర్టు లో దోషిగానే ఉంటాడు తప్ప, నిర్దోషిగా బయటపడరని తెలిపారు. ఏకచిత్ర నటుడైన ఒక ఎంపీ, ఆ శాఖకు సంబంధించిన మంత్రి, నగ్న వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపి పరీక్షలు చేయిస్తామని చెప్పారన్న ఆయన, ఇప్పుడు పకీరప్ప మాత్రం ఒరిజినల్ వీడియో కావాలంటున్నారని ఎద్దేవా చేశారు. ఒరిజినల్ వీడియో లేకపోతే, ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపడం కుదరదని చెప్పడం విస్మయంగా ఉందన్నారు. ఒరిజినల్ వీడియోలో ఉన్న వ్యక్తి, దాని కాపీ వీడియోలో కూడా ఉంటారు కదా అని రఘురామకృష్ణం రాజు అన్నారు. తమకు ఎవరు ఫిర్యాదు చేయలేదని, ఇతరుల ఫోను స్వాధీనం చేసుకోవడం కుదరదని పకీరప్ప పేర్కొనగా , సుమోటోగా కేసు నమోదు చేసి ఫోన్ స్వాధీనం చేసుకోవచ్చు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… సుమోటోగా కేసు నమోదు చేయడానికి వీలు లేదని చెప్పడం ఆశ్చర్యాన్ని కల్పించిందన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైల్స్ మాయం సమయంలో, ఇంకొక చోటా కూడా ఎస్పీలు భలే లాజికులు చెబుతున్నారని అపహాస్యం చేస్తూనే, అభినందిస్తున్నట్లుగా రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.
ప్రధానికి లేఖ రాసిన పంజాబ్ ఎంపీ
గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, స్పీకర్ ఓం బిర్లా కు పంజాబ్ కు చెందిన ఎంపీ జస్బిర్ సింగ్ గిల్ లేఖ రాశారని రఘురామకృష్ణం రాజు, లేఖ ప్రతులను మీడియా ప్రతినిధుల ముందు ప్రదర్శించారు.. ఈ వీడియోను నేరుగా చూడవద్దని, చూస్తే దడుచుకుంటారని సూచించారన్నారు. ప్రధానమంత్రి, స్పీకర్ కు ఎంపీ ఫిర్యాదు చేయడం వల్ల… పకీరప్ప మాదిరిగా ఒరిజినల్ వీడియో ఉంటేనే చర్యలు తీసుకుంటామని వారు అనే అవకాశం లేదన్నారు. వీడియోలో ఉన్నది మాధవ్ కాకపోతే తమ పార్టీతో పాటు ఎంపీలందరూ సురక్షితమని పేర్కొన్నారు. ఏదో ఒక తుంటరి ఈ పని చేశాడని అనుకుంటారన్నారు.
మాధవ్ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లను ఉద్దేశించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని రఘురామకృష్ణం రాజు డిమాండ్ చేశారు.. ఆ ముగ్గురి వద్దకు వెళ్లి ఒరిజినల్ గా చూపిస్తానని పేర్కొనడం… విప్పి చూపించింది నిజమైతే, అంత కంటే దారుణంగా , దరిద్రంగా అతని మాటలు ఉన్నాయన్నారు. ఒరిజినల్ చూపిస్తాననడం పట్ల ఒకవైపు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే, ఒరిజినల్ ఉంటే ఫకీరప్పకు ఇవ్వవచ్చు కదా అని ఎద్దేవా చేశారు.. మాధవ్ నగ్న వీడియో ఆ ముగ్గురు వ్యక్తులు చూడలేదని, ట్రెండింగ్ లో ఉన్న వీడియోను నాలుగు కోట్ల మంది ఆంధ్ర , తెలుగు ప్రజలు చూశారన్నారు.. పంజాబీ లు కూడా చూశారని ఆయన అపాహస్యం చేశారు. ఆ వీడియో ఎవరిదో నిర్ణయించవలసింది ఆ ముగ్గురు వ్యక్తులు కాదని, చూసిన నాలుగు కోట్ల మంది ప్రజలు అన్నారు.
రోజుకు పదివేల మందికి చొప్పున ఆయన ఒరిజినల్ గా చూపించిన 30, 40 ఏళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. సాక్షి సౌజన్యంతో ఒకేసారి అందరికీ ఒరిజినల్ గా చూపించి… వీడియోలో ఉన్నది తానో, కాదోనని ఆన్లైన్ పోల్ నిర్వహిస్తే బావుంటుందని అపహాస్యం చేశారు. ప్రజలే నిర్ణయిస్తారు అంటూ ఎద్దేవా చేశారు.
మాధవ్ నగ్న వీడియో గురించి అయినా, తమ పార్టీ ఫేట్ డిసైడ్ చేయవలసిందైనా ప్రజలేని గుర్తు చేశారు.
ఒక కులాన్ని దూషించడం తప్పు
ఒక కులాన్ని దూషించడం తప్పని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు తాను అన్ని కులాలను అభిమానిస్తానని గౌరవిస్తానని చెప్పారు. తాను రెడ్డి కులస్తులను ఎప్పుడు దూషించలేదని, తన గురించి రాయలేని మాటలతో దూషించిన ఇద్దరు వ్యక్తులను మాత్రమే తప్పు పట్టాలని తెలిపారు.. వారిద్దరి పేరు చివర రెడ్డి ఉందని గుర్తు చేశారు.. తనకు సింహ బాగా మిత్రులు రెడ్డి కులస్తులేనని, ఇక విజయవాడలో తాను పుట్టి పెరిగానని, కమ్మ కులస్తులు చాలామంది స్నేహితులు ఉన్నారని ఆయన, కష్టపడి పని చేసే ఆ కులాన్ని తాను గౌరవిస్తానని తెలిపారు. మాధవ్ ను ఎవ్వరూ కూడా కులం పేరు పెట్టి దూషించలేదన్న ఆయన, ఒకవేళ ఆయన వీడియోలో ఒక సామాజిక వర్గాన్ని దూషించింది నిజమే అయితే… బీసీలు అయితే తప్పు చేయవచ్చునా అని ప్రశ్నించారు. వేరే వ్యక్తులను కులం పేరిట అవమానించడం విప్పి చూపడం కంటే అసహ్యకరమైన చర్య అంటూ విమర్శించారు. లేని కులచిచ్చు రాజకీయాలను ప్రోత్సహించడం సరికాదని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన చర్యలను మానుకోవాలన్నారు.
డమ్మి బటన్ నొక్కితే అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయా?
డమ్మీ బటన్ నొక్కితే అకౌంట్లోకి డబ్బులు వెళ్తాయా అంటూ రఘురామ కృష్ణంరాజు సూటిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.. రాష్ట్రంలోని రెండు మూడు వేల కాలేజీలకు విద్యా దీవెన పథకం కింద నిధులు మంజూరు చేయకుండా, పని భారాన్ని పెంచుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఓట్ల కొనుగోలులో భాగంగా తల్లుల అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ అంటూ మభ్యపెడుతున్నారని విమర్శించారు. ఒకవేళ ఆ డబ్బులను లబ్ధిదారులు వాడుకొని కాలేజీలకు కట్టకపోతే యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలో డబ్బులను పూర్తిగా చెల్లించాలని షరతును విధిస్తున్నారని తెలిపారు. దానితో వారు తమకున్నది అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
కలెక్టర్ నివేదికను కూడా పట్టించుకోరా?… రాఖీ కట్టడానికి పార్టీ గెలుపు కోసం కష్టపడిన చెల్లి లేదు కదా??
విశాఖలోని హయాగ్రీవ ఫౌండేషన్ కు 2007, 2008 లో తన స్నేహితుడైన వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా వృద్ధాశ్రమం నిర్మాణం కోసం స్థలం కేటాయించారని రామకృష్ణంరాజు తెలిపారు. 13 ఎకరాల 80 సెంట్ల భూమిని ప్రభుత్వం ఫౌండేషన్ కు కేటాయించగా, అందులో 20 శాతం స్థలములో వృద్ధాశ్రమం నిర్మించి, మిగతా స్థలంలో మౌలిక వసతులు అభివృద్ధి చేసి, వృద్ధులకు ప్లాట్లను విక్రయించాలని నిర్ణయించారు. అయితే, ఆ స్థలంలో వృద్ధాశ్రమ నిర్మాణం జరగకపోవడంతో ప్రభుత్వం స్థలం వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. కానీ తమ ప్రభుత్వం వచ్చాక స్థానిక ఎంపీ తో పాటు వెంకటేశ్వరరావు అని మరొక ఒక వ్యక్తి కలిసి వెయ్యి గజాల చొప్పున ప్లాట్లుగా 31 బిట్లను విక్రయించారన్నారు. ఈ విషయమై హయాగ్రీవ ఫౌండేషన్ కు ప్రభుత్వం ఇచ్చిన ఉద్దేశం ఒకటి అని, అక్కడ జరుగుతున్న కార్యకలాపాలు మరొకటని కలెక్టర్ మల్లికార్జున్ ప్రభుత్వానికి ఒక నివేదికను ఇచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేయాలని సూచించారు.. దీనితో రంగంలోకి దిగిన తమ పార్టీకి చెందినవారు కలెక్టర్ నివేదికను పక్కన పెట్టారన్నారు.. విశాఖ ఋషికొండపై ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు మిలియన్ల చదరపు అడుగులలో ప్యాలెస్ లు, తన ఆఫీసు భవనాలు నిర్మించుకుంటున్నారన్నారు. ఈ విషయమై తాము కోర్టుకు నివేదిస్తామని చెప్పారు. హయాగ్రీవ ఫౌండేషన్ కు కేటాయించిన భూమి విలువ 500 కోట్లు ఉంటుందని, ఇదే విషయమై స్థానికులు దేశంలో దొంగలు పడ్డారని వ్యాఖ్యానిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత ఆస్తి ఎవరికోసమని, ప్రతిదీ అమ్ముకుంటూ పోతున్నారని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వమే ఆ స్థలం తీసుకొని వృద్ధాశ్రమం నిర్మించితే, వెయ్యి మంది వృద్ధులకు సౌకర్యం కల్పించవచ్చు అన్నారు.. రక్షాబంధన్ సందర్భంగా ఎవరితోనో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాఖీ కట్టించుకుంటున్నారని, మన పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిన నీ చెల్లి నీకు రాఖీ కట్టడానికి లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.