జగన్ ప్రారంభించింది ‘జగనన్న విద్యా దీవెన’ కాదు ‘జగనన్న విద్యా దగా’

టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ…

జగన్ మోహన్ రెడ్డి ‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో ఆర్భాటంగా బటన్ నొక్కి విద్యాదీవెన మొదటి విడత ను ప్రారంభించారు. ఇది విద్యా దీవెన కాదు విద్యా దగా దీవెన. ఈ విద్యా దీవెనతో విద్యార్థులు, విద్యార్థుల తల్లితండ్రులు ఘోరంగా నష్టపోతున్నారు. 20 సంవత్సారాల నుండి రాష్ట్రంలో ఫీజు రియింబర్స్ మెంట్ నేరుగా ఒకే విడతలో ఒకే సారి కాలేజీ యాజమాన్యాలకు వెళ్ళేది. అటువంటి రీయంబర్స్ మెంట్ ని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి నాలుగు ముక్కలు చేశారు. నాలుగు విడుతలు అని చెప్పి మూడు విడుతలు ఇచ్చి ఒక విడత ఎగ్గొడుతున్నారు. అటువంటి విద్యా దీవెన విద్యా దగ అవునా? కాదా? అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. స్టూడెంట్ అకాడమిక్ ఇయర్ అనేది జూన్ లో ప్రారంభమవుతుంది. 29/07న మొదటి, 30/11న రెండవ, 16/3 న మూడవ విడత ఇచ్చారు. ప్రస్తుతం 11/08/2022 న విద్యా దీవెన ఇస్తూ నేడు ఇచ్చే విద్యా దీవెన మొదటి విడత అని చెబుతున్నారు. ఆగష్టు నెలలో ఇచ్చేది మొదటి విడత అయితే గత విద్యా సంవత్సరానికి సంబంధించి 07, 11, 03 నెలలకు సంబంధించి మూడు విడతలు ఇచ్చి ఒక నెల ఎగ్గోట్టడమే. దీని ద్వారా ఆ విద్యార్ధులు చాలా నష్టపోతున్నారు. ఒక విడత విద్యా దీవెనని జగన్ రెడ్డి ఎగ్గొట్టడం ద్వారా కాలేజీ యాజమాన్యం విద్యార్థుల దగ్గర నుంచి ముక్కు పిండి నాలుగో విడత వసూలు చేస్తున్నారు. లేదంటే వాళ్ళ హాల్ టికెట్లని, సర్టిఫికెట్లని నిలిపి వేస్తున్నారు. ప్రతి సారి ఒకే విడతగా వచ్చే ఫీజు రియింబర్స్ మెంటుని నాలుగు ముక్కలు చేశారు. అందులో మూడు విడుతలు ఇచ్చి ఒక విడత ఎగ్గొడుతున్నారు. జగన్ రెడ్డి ఇచ్చేది విద్యా దీవెనో, దగా దీవెనో తెలియడంలేదని విద్యార్థులు అంటున్నారు.

ఏదైనా పథకానికి అర్హులవ్వాలంటే తెల్ల రేషన్ కార్డు ఉండాలి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు అర్హులు కాకుండా పోయారు. ఇది చాలా దుర్మార్గమైన విషయము. ఒక కోటి 45లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారు తాము సంక్షేమ పధకాలకు అర్హులం అనే భరోసా, భద్రత ఉండేది. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెల్ల రేషన్ కార్డు దారుడు అర్హుడు కాదు అని అనేక నిబంధనలు పెట్టారు. 300 అడుగుల స్థలంకు మించి ఇల్లు ఉండకూడదు, 300 యూనిట్లకు పైబడి కరెంటు బిల్లు రాకూడదు, కారు ఉంటే అర్హులు కాదు. లోన్ల కోసం ఐటి రిటన్స్ పెట్టినవారు అర్హులు కారు అనే నిబంధనలు పెట్టారు. ఇది విద్యా దీవెన కాదు.. దగా దీవెన. ఒక విద్యార్థి ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ నిలిపేస్తే 4వేల రూపాయలు కట్టుకునే పరిస్థితి లేక ఇనుప సామాన్ల అంగట్లో చేరాడు. ఫీజు రీయంబర్స్ మెంట్ రాదని ముందే చెప్పి ఉంటే ముందే ఏ బీఏనో, బిఎస్సీనో చదువుకునేవాడిని అని ఆ అబ్బాయి చెప్పాడు. ప్రభుత్వం అర్ధాంతరంగా ఫీజురీయంబర్స్ మెంట్ నిలిపేయడంవల్ల ఇంజనీరింగ్ కాలేజిలోనూ చదువుకోవడానికి, బీఏ, బీఎస్సీ డిగ్రీలోనూ చేరడానికి అవకాశం లేకుండా పోయింది.

ఇంటర్మీడియట్ చదివిన కాలేజీవారు టీసీ, సర్టిఫికెట్స్ ఇవ్వమంటే ఫీజు కడితేనే టీసీ ఇస్తామని ఇబ్బందులు పెడుతన్నారు. ఇలా అనేకమంది విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. ఏవీధికి వెళ్లినా, గ్రామాల్లో, మండలాల్లో ఇలాంటి నిరుత్సాహపరులే కనిపిస్తారు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. నాలుగు విడతలుగా విద్యాదీవెన అందిస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకే విడతలో తన వాటా కింద ఫీజు రీయంబర్స్ మెంట్ కింద రాష్ట్రానికి అందజేస్తుంది. కేంద్రం ఇచ్చిన వాటాని తన అవసరాలకు వాడుకొని, వేరే సంస్థలకు మళ్లించుకుంటున్నారు. విద్యార్థులకు నాలుగు విడతలుగా ఇస్తూ ఒక విడత ఎగ్గొట్టడం విద్యాదగ కాదా? నాలుగు సార్లు కలర్ ఫుల్ గా పత్రికల్లో యాడ్స్ వేస్తున్నారు. నాలుగు సార్లు బటన్ నొక్కుతున్నానని ముఖ్యమంత్రి అంటున్నారు. బటన్ నొక్కినప్పుడల్లా ప్రచార నిమిత్తం దాదాపు రూ.25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఒక్క విద్యా దీవనకు నాలుగు సార్లు బటన్ నొక్కితే వంద కోట్ల రూపాయలు ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు.

ప్రచారానికి ఉపయోగించే వంద కోట్లు విద్యా దీవనెకు ఉపయోగిస్తే 40 వేల మంది విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ అందుతుంది. విద్యార్థులకు అందే లబ్ది కంటే ప్రకటనల వల్ల సాక్షి పత్రికకు వచ్చే లబ్దే ఎక్కువగా ఉంటోంది. అందుకే దీన్ని విద్యా దగా అని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అంటున్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్, ఎయిడెడ్ కాలేజీల్లో చదివే ఇంజనీరింగ్, పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ రాదు అని 2020-21లో జీవో నెంబర్ 77 విడుదల చేయడంతో వారికి ఫీజు రీయంబర్స్ మెంట్ రాకుండా పోయింది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు దగా చేసినట్లే. మెస్, కాస్మోటిక్ ఛార్జీలు ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రావాల్సిన 500 రూపాయలు రద్దు చేయడం విద్యా దగా కాదా? హాస్టల్ మేనేజ్ మెంట్ ని రద్దు చేశారు. బడుగు, బలహీన వర్గాలకు అత్యంత అవసరమైన బెస్ట్ అవలబుల్ స్కూల్స్ ని రద్దు చేశారు. చంద్రబాబునాయుడు పేద విద్యార్థులకు విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పెట్టిన విదేశీ విద్యను రద్దు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు కోరారు.