మంత్రి ఆదిమూలపు బుకాయింపులతో వాస్తవాన్ని దాచలేరు

– కమీషన్ల కోసం చిక్కీ టెండరు నిబంధనలను మార్చింది ముమ్మాటికీ నిజం!
– మారుతీ ఆగ్రోస్ వంటి డబ్బా కంపెనీలను ఎందుకు వెనకేసుకొస్తున్నారు?
– ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తానని బెదిరిస్తారా? ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరేదిలేదు
– చిక్కీ స్కాంలో వైసీపీ ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తి లేదు
– ఇప్పటికే ఒక సిబిఐ కేసు ఎదుర్కొంటున్న మంత్రి చిక్కీ స్కామ్ లో మరో సీబీఐ కేసుకు సిద్ధంగా ఉండాలి
* నిజనిజాలు తేల్చుకోవడం కోసం ఈరోజు సాయంత్రం 4గంటలకు ఆధారాలతో వస్తా…మీరు సిద్దమా? సవాల్ కు కట్టు లోబడి చిక్కీస్కామ్ పై ఆధారాలతో వెళ్లిన పట్టాభి బృందం….తోకముడిచిన మంత్రి
టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం

ముఖ్యమంత్రి, మంత్రి కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిక్కీ టెండర్లలో నిబంధనలు మార్చి తమకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టి అవినీతికి పాల్పడ్డారు, దీనిపై మేం ప్రశ్నిస్తే మంత్రి ఆదిమూలపు సురేష్ బుకాయిస్తున్నారు. బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరు. టీడీపీకి సంబందించిన కంపెనీలకు టెండర్లు దక్కలేదనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని అవినీతి బురద పత్రిక సాక్షిలో రాశారు. కేంద్రీయ భండార్ టీడీపీ కంపెనీనా? కేంద్రీయ బండార్ లో 68.19 శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. కాదని మంత్రి చెప్పగలరా?

ఎన్.సి.సి.ఎఫ్ కేంద్ర భాగస్వామ్యంతో ఉన్న కంపెనీ కాదా? ప్రభుత్వ రంగ సంస్ధలకు కాదని వేరే కంపెనీలకు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తే.. ఆ కంపెనీలు టీడీపీవి అంటూ అసత్య ప్రచారం చేస్తారా? మీరు టెండర్లు ఇచ్చిన కంపెనీలపై ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నారో చెప్పగలరా? వాటి నుంచి మంత్రికి ఎంత ముట్టిందో తేలుస్తాం. మారుతి ఆగ్రోస్ లాంటి కంపెనీలను మంత్రి ఎందుకు వెనకేసుకొస్తున్నారు? టెండర్ డాక్యుమెంట్లలో నిబంధనలు మార్చలేదని మంత్రి నిస్సిగ్గుగా అబద్దాలు చెబుతున్నారు.

1). ఏ ప్యాకేజీకైతే టెండర్ దాఖలు చేస్తున్నారో దానికి సంబందించి బిడ్ వ్యాల్యూకు సరిసమానంగా కానీ అంతకంటే ఎక్కువగానీ గత 3 సంవత్సరాల్లో ప్రతి ఏటా ఆ కంపెనీ నిర్ణీత టర్నోవర్ ఉండాలని పాత టెండర్లలో పేర్కొన్నారు. కానీ కొత్త టెండర్ డ్యాక్కుమెంట్ లో …ఏదైనా ఒక సంవత్సరం టర్నోవర్ ఉంటే చాలని పేర్కొన్నారు. ఇది నిబంధనలు మార్చటం కాదా? మంత్రి బుకాయిస్తే వాస్తవాలు అవాస్తవాలు అయిపోతాయా?
2). పాత టెండర్ డాక్యుమెంట్ నిబంధనల్లో టెండర్ దాఖలు చేసే కంపెనీలు..గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన డిపార్ట్ మెంట్స్, సంస్ధలు, లోకల్ బాడీస్, పబ్లిక్ సెక్టార్లకు ‎ సరఫరా చేసిన అనుభవ డాక్కుమెంట్స్ దాఖలు చేయాలని ఉంది. కానీ కొత్త టెండర్ డాక్కుమెంట్ లో వాటితో పాటు ప్రవేట్ కంపెనీ అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటామని ఎందుకు యాడ్ చేశారు? మీ కొత్త కంపెనీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్ధలకు సరఫరా చేసిన అనుభవం లేదు కాబట్టి… నకిలీ సర్టిఫికెట్లు తెచ్చుకునేందుకు వీలుగా ‎ప్రవేట్ కంపెనీ అనుభవం అనే దాన్ని యాడ్ చేశారు.
3). పాత టెండర్ డ్యాక్కుమెంట్ లో ‎బిడ్డర్స్ ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ సర్టిఫికెట్ తో పాటు… హెచ్.ఎ.సి.సి.పి, ఐ.ఎస్.వో సర్టిఫికెట్స్ కూడా ఉండాలని పేర్కొన్నారు. కానీ కొత్త టెండర్ల లో ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ సర్టిఫికెట్ ఉంటే చాలు అని ముగించేశారు. కోవిడ్ టైంలో పిల్లలకు కంటామినేషన్ లేకుండా స్వచ్చమైన ఆహారం ఇవ్వాలంటే హెచ్.ఎ.సి.సి.పి సర్టిఫికెట్స్ ఉండాలి. అటువంటి కీలకమైనవి అవసరం లేదని ఎందుకు తొలగించారు? . అన్ని సర్టిఫికెట్లు కరెక్ట్ ఉన్నాయన్న మంత్రి దీనికి ఏం సమాధానం చెబుతారు? మీకు అనుకూలమైన కంపెనీల కోసం టెండర్లలో నిభంధనలు మార్చటం ‎ కుంభకోణం కాకపోతే ఇంకేంటి?
4). మారుతీ ఆగ్రోస్ మీద మంత్రి ఎందుకంత ప్రేమ ఒలకబోస్తున్నారు. బిడ్ దాఖలు చేయాలంటే ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్స్న్ , జీఎస్టీ వివరాలు గత మూడేళ్ల వివరాలు ఉండాలి. కానీ ఈ కంపెనీ 30.09.2020 న జీఎస్టీ రిజిష్ట్రేషన్ తీసుకున్నారు. దీనిపై మేం ప్రశ్నిస్తే.. జీఎస్టీ రిటర్న్స్ అక్కర్లేదు, కేవలం ఇన్ కమ్ ట్యాక్స్ అడిగామని మంత్రి చెప్పారు. ఇన్ కమ్ ట్యాక్స్ రిటర్న్ పైల్ చేయాలన్నా .. జీఎస్టీ రిజిష్ట్రేషన్ ఉండాలి కదా? గూడ్స్ అండ్ కర్వీసెస్ సప్లై చేసే కంపెనీలకు…20 లక్షలపైన టర్నోవర్ ఉన్న ఏ కంపెనీ అయినా జీఎస్టీ రిటర్స్ తీసుకోవాలి, జీఎస్టీ లేకుండా ఐటి రిటర్స్ పైల్ చేసే అవకాశం ఉండదు. ఇంకోపక్క యాన్యువల్ టర్నోవర్ క్లాజ్ మార్చలేదని బుకాయిస్తున్న మంత్రి నేడు అదే నిబంధన ప్రకారం గడచిన మూడు సంవత్సరాల్లో మారుతీ ఆగ్రోస్ కు బిడ్ వాల్యూతో సమానంగా టర్నోవర్ ఉందని చూపించగలరా? బిడ్ వాల్యూకు సరిసమానంగా టర్నోవర్ ఉండాలంటే మూడు సంవత్సరాలకు ముందే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉండి ఉండాలి కదా? టెండరులో ఏ ప్యాకేజి తీసుకున్నా కనీసంగా బిడ్ వాల్యూ రూ.30కోట్లకు పైనే ఉంది. మారుతి ఆగ్రోస్ కంపెనీ జీఎస్టీ రిజిష్ర్టేషన్ లేకుండా రూ. 30 కోట్ల టర్నోవర్ ఎలా రీచ్ అవుతుందో చెప్పాలి? ముఖ్యమంత్రి, మంత్రి కమీషన్ల కోసం కక్కుర్తి పడి మారుతి ఆగ్రోస్ కంపెనీ కోసం నిభంధనలు మార్చి అవినీతికి పాల్పడ్డారు.
5). ఒక్క ఏడాదిలోనే విద్యార్దుల సంఖ్య భారీగా పెరిగిందని అంటున్నారు. 2020-21లో 36.6 లక్షలున్న విద్యార్ధుల సంఖ్య 2021.22 నాటికి 43 లక్షలకు పెరిగిపోయందని చెబుతున్నారు. అంటే దాదాపు 7లక్షల విద్యార్థుల సంఖ్య పెరిగినట్లు మంత్రి బుకాయిస్తున్నారు. కానీ జగనన్న గోరు ముద్ద వెబ్ సైట్ (ఎపిఎండిఎం.ఎపి.సి.ఎఫ్.ఎస్.ఎస్.ఇన్ ) లో చూస్తే 2022 జనవరిలో 1. నుంచి 10 వ తరగతి విధ్యార్ధులు హాజరు‎ ‎నెలమొత్తానికి 5,34,97,950 మంది విద్యార్ధులుగా ఉంది. ‎ఈ నెలలో‎ సెలవులు పోగా 18 రోజులే స్కూలు నడిచింది. సగటున చూస్తే రోజుకు చూస్తే….29 లక్షల 72వేల 108 మంది విద్యార్ధులు హాజరయ్యారు. మరి మంత్రి సురేష్ బుకాయిస్తున్నట్టు 43లక్షల పైబడి విద్యార్థుల హాజరు వారి సొంత వెబ్ సైట్ లో ఎందుకు కనబడటం లేదు? విద్యార్ధుల సంఖ్య ఎక్కడ పెరిగిందో సురేష్ చెప్పాలి? 2021 ఆగస్టు నుంచి 2022 జనవరి వరకు 120 పని దినాల్లో 34 కోట్ల 44 లక్షల 89 వేల 633 మంది విద్యార్థులు హాజరైనట్లుగా ఉంది., అంటే సగటున 28 లక్షల 70 వేల 746 మందిగా ఉంది. ఇందులో చిక్కీ తీసుకునే వారి సంఖ్య సగటున 21.5లక్షలు మాత్రమే ఉంది. కానీ మంత్రి ఎందుకు అబద్దాలు చెబుతున్నారు? ఆయన చెప్పిన 7 లక్షల మంది విద్యార్దుల పెరుగుదల సంఖ్య ఎక్కడ? మంత్రిగా ఉండి అబద్దాలు చెప్పటానికి సిగ్గనిపించటం లేదా? ముఖ్యమంత్రి, మంత్రులకు అబద్దాలు చెప్పటం అలవాటుగా మారింది.

మంత్రి ఎంత నిస్సిగ్గుగా ‎ఎన్ని అబద్దాలు చెప్పారో ఈ అంకెలనుబట్టి రాష్ట్ర ప్రజలు గమనించాలి. అవినీతిని ప్రశ్నించినందుకు నామీద, మీడియా మీద పరువు నష్టం దావా వేస్తానని మంత్రి బెదిరిస్తున్నారు. మంత్రికి సవాల్ చేస్తున్నా… నా వద్ద ఉన్న ఆధారాలతో మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆఫీస్ కి ఈరోజు సాయంత్రం 4గంటలకు వస్తా… మీరు రండి, మీడియా సమక్షంలో టెండర్లు కండీషన్లు మార్చారో, లేదో నిరూపిస్తాం. నామీద మీరు పరువు నష్టం దావా వేస్తారో, లేక అవినీతికి పాల్పడినందుకు మీ మీద నేను 420, క్రిమినల్ కేసులు వేస్తానో తేల్చుకుందాం.

మంత్రి సురేష్ కి దైర్యముంటే మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ ఆపీసుకి సురేష్ రావాలి. ఎవరు ప్రజలకు నిజాలు చెబుతున్నారో… ఎవరు ప్రజలను దోచుకుంటున్నారో, ఎవరు బుకాయిస్తున్నారో తేలిపోతుంది. ఈ అవినీతి సొమ్ములో ముఖ్యమంత్రి, మంత్రి ఎంత వాటాలు పంచుకున్నారు? ముఖ్యమంత్రిని ప్రశ్నించకూడదా? ఆయనేమైనా భగవత్ స్వరూపమా? ముఖ్యమంత్రి ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తి కాదా? ఈ రాష్ట్ర పౌరునిగా ప్రశ్నిస్తున్నా. సమాధానం చెప్పకుండా అక్రమ కేసులు పెడతామంటే భయపడే ప్రశ్నే లేదు.

మధ్యాహ్న భోజన పథకం కార్యాలయానికి టీడీపీ నేతలు.. రాని మంత్రి
(టిడిపి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్….టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధులు పిల్లి మాణిక్యాలరావు, సయ్యద్ రఫీ, తెలుగుదేశం వాణిజ్యవిభాగం అధ్యక్షుడు డూండీ రాకేష్, తెలుగుయువత

నాయకులు భండారు వంశీ, సజ్జా అజయ్, స్థానికనాయకులతో కలిసి చెప్పిన మాట ప్రకారం ఈరోజు సాయంత్రం 4గంటలకు ఇబ్రహీంపట్నలో మధ్యాహ్న భోజన పథకం కార్యాలయానికి చేరుకుని దాదాపు గంటసేపు వేచిచూశారు. మంత్రి ఆదిమూలపు సమాధానం చెప్పలేక ముఖం చాటేశారు. మంత్రి…దీనినిబట్టే వారు తప్పు చేశారని నిరూపితమవుతోంది. ఏ తప్పూ లేకపోతే మంత్రి ఎందుకు చిక్కీ స్కామ్ పై ఆధారాలతో ముందుకు రాలేకపోయారు)

ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, మంత్రి సురేష్ మీద సీబీఐ కేసులున్నాయి, జగన్, సురేష్ లది ఒకే స్కూల్. అందుకే ఇద్దరు కలిసి స్కూళ్ల మీదపడి దోచుకుతింటున్నారు. అందుకే జగన్ రెడ్డి మేనమామ కాదు దొంగ మామ. నిన్న ప్రెస్ మీట్ లో మంత్రి సురేష్ చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు. వాళ్ల అవినీతిని ఆధారాలతో సహా వివరించా. ‎టీడీపీ హయాంలో మద్యాహ్న భోజనం సరిగా లేదని బురద జల్లుతున్నారు. నేడు వైసీపీ హయాంలో కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం బియ్యంతో భోజనం పెడుతున్నారని విధ్యార్దులు వాపోతున్నారు. అది ఆయనకి కనిపించటం లేదా? ‎ ఎంతసేపు చిక్కీల్లో ఎంత తిందాం, గుడ్లలో ఎంత తిందామని అని ఆలోచన తప్ప మధ్యాహ్న భోజనంపై పర్యవేక్షణ చేయరా? నా టెండర్లు నా ఇష్టం అన్నట్టు మాట్లాడటం సరికాదు. మీ జేబుల్లో నుంచి తీసి పిల్లలకు భోజనం పెడుతున్నారా? ఇది ప్రజాధనం, ప్రజాధనాన్ని దోచుకుతింటుంటే ప్రశ్నించకుండా ఎలా ఉంటాం?

కేంద్రీయ భండార్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారు. ధర్డ్ పార్టీతో విచారణ చేశామని చెబుతున్నారు. ఏ ప్యాకేజీ ఏ కంపెనీ దక్కించుకుందో 6 కంపెనీల అనుభవం, టర్నోవర్, తదితర అంశాలతో టెండర్లకు సంబందించి శ్వేతపత్రం విడుదల చేయాలి. ఆ కంపెనీల టర్నోవర్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్, మ్యానుప్యాక్చరింగ్ సర్టిఫికెట్స్ వంటి ‎వివరాలు బహిర్గతం చేయాలి. మధ్యాహ్న భోజన పథకం చిక్కీ స్కాంలో ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం. చిక్కీ స్కామ్ భాగస్వామి మంత్రి ఆదిమూలపు సురేష్ తక్షణం రాజీనామా చేయాలి. ఆదాయాన్ని మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సిబిఐ కేసులో దర్యాప్తును ఎదుర్కొంటున్న మంత్రి ఆదిమూలపు చిక్కీస్కాంలో ఇంకొక సిబిఐ కేసు ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలి. దీనిపై కేంద్రప్రభుత్వం సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు పిలవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

Leave a Reply