ఇండియా పేరు వలసపాలకుల పుణ్యమే

Spread the love

– స్వతంత్ర దేశంలో ఆ వాసనలు అవసరమా?
– బానిస భావజాలమే విపక్షాలకు అవసరమా?
– రాహుల్ యాత్రకు భారత్ జోడో పేరెందుకు పెట్టారు?
– ఎన్నో దేశాలు తమ పేర్లు మార్చుకున్నాయి
– ఇండియాను భారత్‌గా మారిస్తే తప్పేంటి
– భారతీయులు గర్వించే పేరది
– భారత్ అంటే నిరంతరం జ్ఞానం కోసం అన్వేషించటం
– భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ ఇప్పుడు భారత్ పేరు వద్దని అంటారా?
– వైకాపా ను రాజకీయంగా సంహరించేందకు ప్రజలుముందుకు రావాలి
– అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తున్నారు
– తాను చేసే తప్పులను కేంద్రంలోనిమోదీ ప్రభుత్వం పై మోపాలని చూస్తున్నారు
– ప్రజల ఆస్తులమీద కన్నేసి రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు
– బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్
– సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి
– గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా “రుక్మిణి శ్రీకృష్ణుల” కళ్యాణం లో పాల్గొన్న బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి

శ్రీ శ్రీనివాస కళ్యాణ ట్రస్ట్ మరియు వాసవి పరివార్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తాళ్లాయపాలెం శైవ క్షేత్రం పీఠాధిపతి శివ స్వామి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఏమన్నారంటే … ధర్మ రక్షణ కోసం పాటుపడిన భగవంతుడు శ్రీ కృష్ణుడు.ధర్మ రక్షణ కోసం ఎందరో అసురులను సంహరించాడు. గతంలో దేశ వ్యతిరేక శక్తులు దేశాన్ని అంధకారంలోకి నెట్టాయి. మన రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన సాగుతోంది. ప్రశ్నించిన వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

ప్రజల్లో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది.ప్రజా కంటక పాలన సాగిస్తున్న వైకాపా ను రాజకీయంగా సంహరించేందకు ప్రజలుముందుకు రావాలి.అభివృద్ధి పక్కన పెట్టి అవినీతిలో ఏపీనిముందుకు తీసుకెళ్తున్నారు.మూడేళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ కు పరిమితమై ఇప్పుడే బయటకు వస్తున్నారు. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేస్తున్నారు.

భూముల డిజిటలైజేషన్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులను దారిమళ్లించారు.జగనన్న భూ రక్ష పేరిట పట్టా పుస్తకాల పై తన ఫొటో వేసుకున్నారు.తాను చేసే తప్పులను కేంద్రంలోనిమోదీ ప్రభుత్వం పై మోపాలని చూస్తున్నారు. ప్రజల ఆస్తులమీద కన్నేసి రిజిస్ట్రేషన్ విధానంలో మార్పులు తెచ్చారు. గతంలో ఏ యుగంలో కూడాఎవరూ వైకాపా మాదిరిగా ప్రజా కంటక పాలన చేయలేదు.

మొన్నటి వరకూ భారత్ జోడో యాత్ర నిర్వహించిన రాహుల్ గాంధీ ఇప్పుడు భారత్ పేరు వద్దని అంటారా? భారతదేశానికి ఎంతో మంచి చరిత్ర ఉంది. వలస పాలకులు ఇండియా అని పేరు పెట్టారు. భారత్ అంటే నిరంతరం జ్ఞానం కోసం అన్వేషించటం. పేరు మార్చడం ఏమీ నేరం కాదు, గతంలో చాలా దేశాలు మార్చాయి. భారత్ అనేది నిషేధించిన పదం కాదు .

ఈ సందర్భంగా బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏమన్నారంటే.. సనాతన ధర్మం పై దాడి జరుగుతుంది. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా తో పోలుస్తూ మాట్లాడటం చూశాం. అన్ని ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలి. మన ప్రాంతంలో ఇటువంటి వేడుకలు జరగటం మన అదృష్టం.

ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, రాష్ట్ర మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, సీనియర్ నాయకులు జూపూడి రంగరాజు, వనమా పూర్ణ చంద్రరావు, యడ్లపాటి స్వరూపరాణి, పాలపాటి రవికుమార్, సురేష్ జైన్, రాచుమల్లు భాస్కర్, అప్పిశెట్టి రంగ, ఈదర శ్రీనివాసరెడ్డి, వనమా నరేంద్ర, పాండురంగ విట్టల్, అనుమోలు ఏడుకొండలు, కొక్కెర శ్రీనివాస్, వెలగలేటి గంగాధర్, ఏలూరి లక్ష్మి, దర్శనం శ్రీనివాస్, జితేంద్ర గుప్తా, ప్రసాదు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply