పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరుల వీరంగం

మచిలీపట్నం లో మాజీ మంత్రి పేర్నినాని కొడుకు పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. తెలుగుదేశం బ్యానర్లు కడుతున్నాడని ఉల్లిపాలెంకు చెందిన యశ్వంత్ అనే యువకుడిని పేర్ని కిట్టు అనుచరులు చితకబాదారు. వైసీపీ శ్రేణులు యశ్వంత్‌ను కారులో ఎక్కించుకుని చితకబాది పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర, జనసేన నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నిలదీశారు. వైసీపీ శ్రేణుల దాడిలో తీవ్రంగా గాయపడిన యశ్వంత్‌ను కొల్లు రవీంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పేర్ని కిట్టు అరాచకాలపై బాధిత యువకుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply