– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన నమో యాప్ వికాసిత్ భారత్ అంబాసిడర్ క్యాంపెయిన్ వర్క్ షాప్ కార్యక్రమాంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వర్కుషాప్ ను ప్రారంభించారు.
ఈ సందర్బంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి నుంచి ప్రజల ప్రాణాలు కాపాడారు ప్రధాని మోదీ ప్రభుత్వానిదే. నరేంద్ర మోదీ నాయకత్వంలో, సుపరిపాలనతో పాటు అనేక సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారు. మోదీ నాయకత్వంలో అద్భుత సంస్కరణలు తీసుకువచ్చారు. అనేక ఘనతలు సాధించారు. జమ్ము కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక సమస్యలను పరిష్కరించుకోవడం జరుగుతోంది.
స్వదేశంలోనే వ్యాక్సిన్ ను తయారుచేసుకునేలా దోహదపడ్డారు. శ్రీరామజన్మభూమి అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుగనుంది. 500 ఏండ్లుగా అయోధ్య రామమందిర పునర్ నిర్మాణం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేశారు. బానిస మనస్తత్వానికి ప్రతీకగా ఉన్న బ్రిటీషు హయాంలోని 500 చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలను రూపొందించుకున్నాం.
బాబరు కూలగొట్టిన రామమందిరాన్ని రక్తపుబొట్టు చిందకుండా ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక, ఉత్సాహవంతమైన, క్రమశిక్షణతో కూడిన వాతావరణంలో పున:ప్రారంభించుకుంటున్నాం. వచ్చే 25 సంవత్సరాలు భారతదేశపు అమృతకాలం. భారతదేశంలోని యువత ప్రపంచమంతా రాణిస్తున్నారు.నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందేలా కృషి చేస్తోంది.
2047 వ సంవత్సరం వరకు భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలో నిలవాలనేది మన లక్ష్యం. నరేంద్ర మోదీ ప్రభుత్వం అభివృద్ధి ఫలాలు, ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలను ప్రతి ఒక్కరికి చేరువ చేయడమే వికసిత భారత్ సంకల్ప్ యాత్ర లక్ష్యం. ప్రభుత్వ పథకాలు.. సేవలు ప్రతి ఒక్కరికి అందించడమే వికసిత భారత్ లక్ష్యం.దేశంలో కొన్ని కుటుంబ పార్టీలు ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నాయి. వాటి నుంచి విముక్తి చెందేలా మార్పు రావాలి. నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మెచ్చుకుంటూ అమెరికా నుంచి రష్యా వరకు అనేక దేశాల అధిపతులు పొగడ్తలు కురిపిస్తున్నారు.
గతంలో నరేంద్ర మోదీ కి వీసా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిందో.. నేడు అదే అమెరికా వైట్ హౌస్ లో మోదీ గారికి అద్భుతరీతిలో సత్కరించి స్వాగతించింది.నరేంద్ర మోదీ సుపరిపాలనను అందిస్తూ.. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచేలా, యువతను ప్రోత్సహించేలా, భారతీయ సంస్కృతిని, జీవన విధానాలను భావితరాలకు తీసుకెళ్లాలా, యోగాను ప్రపంచదేశాలకు తీసుకెళ్లేలా పాలన అందిస్తున్నారు.2047 వరకు భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ప్రతిఒక్కరం వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలి.
నేను సైతం నరేంద్ర మోదీ తో అంటూ అనేక మంది వికసిత్ భారత్ లో పాల్గొంటూ అంబాసిడర్ గా నిలుస్తున్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందాలనే సంకల్పంతో వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రతిఒక్కరిని భాగస్వామ్యం చేసేలా పనిచేయాలి.ఎంతమంది ఓవైసీలు, రాహుల్ గాంధీ లు అడ్డొచ్చినా… మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వమే వస్తుంది.
ఎవరూ ఊహించనిరీతిలో అద్భుత మెజారిటీతో నరేంద్ర మోదీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. దేశంలోని యువత అంతా మోదీ మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నారు.