Suryaa.co.in

Andhra Pradesh

బ్రతుకు బండిపై వైసీపీ పార్టీ నాయకుల దౌర్జన్యం

– బాధితుడికి అండగా బలిజ సంఘం

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ పట్టణంలోని ఆర్టీసీ బస్ డిపో సమీపంలో ఉన్నటువంటి టీ కొట్టును గత 25 సంవత్సరాలుగా నాగరాజు అనే వ్యక్తి నిర్వహించుకుంటున్నాడు. ఆళ్లగడ్డ పట్టణంలో ఇటీవల మున్సిపల్ అధికారులు డ్రైనేజ్ కాలువ ఆధునీకరణ పనులలో భాగంగా మిగతా దుకాణాలలో పాటు నాగరాజు టి షాప్ ను కూడా తొలగించారు.

అయితే అక్కడే నాగరాజు బండి ఏర్పాటు చేసుకుని టి అమ్ముకుంటు వ్యాపారం కొనసాగించే వాడు. ఎన్నో రోజులుగా ఆ స్థలంపై కన్నెసిన అధికార పార్టీ కౌన్సిలర్లు ఆజాద్, చక్రపాణి టీ కొట్టు ఎలాగైనా తన వశం చేసుకోవాలనే ఉద్దేశంతో పలుమార్లు నాగరాజును ఇక్కడి నుండి వెళ్లిపోవాలని బెదిరిస్తూ ఉండేవాడు.

ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ ఇప్పటివరకు సంపాదించుకుంది చాలు నంటూ హుంకరించి బెదిరిస్తూ ఉండేవాడు. అయినప్పటికీ నాగరాజు టీ షాప్ కొనసాగిస్తూనే వుండటంతో ఆదివారం రాత్రి అధికార పార్టీ నాయకుడు మరియు అతని అనుచరులు పదిమంది కలిసి నాగరాజు పై దాడి చేయడం పట్ల రైతు రాజ్యం పార్టీ అధ్యక్షులు బొగ్గుల గురప్ప, జనసేన పార్టీ నాయకులు మైలేరి మల్లయ్య, బలిజ సంఘం నాయకులు నల్లగట్ల బాలుడు, అడ్వకేట్ సుబ్బరామిరెడ్డి పరామర్శించి, నాగరాజు కుటుంబానికి అండగా ఉంటామని, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో భవిష్యత్తులో బలిజ సంఘీయులు మీద దాడి జరిగిన సహించేది లేదని హెచ్చరించారు.

LEAVE A RESPONSE