Suryaa.co.in

Telangana

బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘాలతో కుమ్మకై పేపర్ ను లీక్ చేశారు

-పేపర్ లీకేజీలో పట్టపగలు దొరికిన దొంగ బండి సంజయ్
-మోడీ ఫేక్…సంజయ్ ఫేక్…అరవింద్ ఫేక్
-బండి సంజయ్ ప్రశ్నాపత్రాల లీకర్ గా మారారు
-రైతు బంధు సమితి అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి,పియూసీ చైర్మన్ ఏ. జీవన్ రెడ్డి

విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తూ బీజేపీ పేపర్ లీకేజీలకు పాల్పడుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పేపర్ లీకేజీ కాలేదు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉపాధ్యాయ సంఘాలతో కుమ్మక్కు అయ్యి తెలుగు పేపర్ ను లీక్ చేశారు. బీజేపీ బొక్కలకు కొంతమంది ఆశ పడుతున్నారు. బూర ప్రశాంత్ తో కలిసి బండి సంజయ్ పేపర్ లీకేజీకి పాల్పడ్డారు. మహేష్ తో కలిసి బూర ప్రశాంత్ పేపర్ లీక్ చేశారని ఆరోపించారు.

డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే… నన్ను పోలీసులు కొట్టారని బండి సంజయ్ అబద్దాలు చెప్పారు. పేపర్ లీకేజీ అయిందని బండి సంజయ్ స్వయంగా చెప్పారు. కేంద్ మంత్రి కిరణ్ రిజిజు జడ్జీలపై ఏం మాట్లాడారో అందరికి తెలుసు. బీజేపీ లీగల్ టీమ్ బండి సంజయ్ బెయిల్ కోసం బెదిరించే ప్రయత్నం చేశారు.ఈటెల రాజేందర్ సూక్తులు చెప్తున్నారు. పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజీ కానప్పుడు విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని బండి సంజయ్ ఎలా అన్నారు? తెలంగాణలో మతం,కులం పేరుతో ప్రజలను చీల్చాలనే ప్రయత్నం బిజెపి చేస్తొంది. ప్రయివేటు యూనివర్సిటీలకు వ్యతిరేకం అని చెప్తున్న బండి సంజయ్ , తన కుమారుడిని మహేంద్ర యూనివర్సిటీలో చదివిస్తాడు. బీజేపీ నేతలు ఏం మాట్లాడుతున్నారో న్యాయ వ్యవస్థ గమనించాలి. బండి సంజయ్ ను తరుణ్ చుగ్,సునీల్ బన్సల్,జేపీ నడ్డా ఎందుకు పొగుడుతున్నారో తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలి.

పీయూసీ చైర్మన్ ఏ.జీవన్ రెడ్డి ఏమన్నారంటే… బండి సంజయ్ ప్రశ్నాపత్రాల లీకర్ గా మారారు.కేసీఆర్, కేటీఆర్, కవితలపై బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బండి సంజయ్ రాజకీయాలకు పనికిరారు. కేసీఆర్ పాలనను చూసి ఓర్వలేక ప్రశ్నాపత్రాల లీకేజీ ద్వారా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్నారు.విద్యార్థులు,నిరుద్యోగులు,
తల్లిదండ్రులు బండి సంజయ్ కు బుద్ధి చెప్పాలి. పేపర్ లీకేజీ పాత్రధారి, సూత్రధారి బండి సంజయ్. పేపర్ లీకేజీలో పట్టపగలు దొరికిన దొంగ బండి సంజయ్. మోదీ వందే భారత్ ను ఎన్ని సార్లు ప్రారంభిస్తారు? వందే భారత్ 2009 లో వచ్చిన స్కీం. బీజేపీ నేతలు ఎవరు చదువుకోలేదు. మోడీ ఫేక్…సంజయ్ ఫేక్…అరవింద్ ఫేక్. నలుగురు బీజేపీ ఎంపిలను గెలిపిస్తే నాలుగు బొగ్గు బ్లాకులను అమ్ముతున్నారు. ఇది తెలంగాణకు బీజేపీ ఇచ్చే రిటర్న్ గిఫ్ట్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం.

LEAVE A RESPONSE