పారదర్శకంగా, పకడ్బందీగా జరగాల్సిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అపహాస్యంగా మార్చి, ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది
• 01-04-2022 నుంచి రిజిస్ట్రేషన్లు గ్రామసచివాలయాల్లో జరుగుతాయన్న ప్రభుత్వం నిర్ణయం మొత్తం రిజిస్ట్రేషన్ల వ్యవస్థనే నీరుగార్చింది
• జగన్ సర్కార్ తీసుకొచ్చిన నూతన రిజిస్ట్రేషన్ విధానంపై ప్రజలకు అనేక సందేహాలున్నాయి.
• రిజిస్ట్రేషన్ తంతు పూర్తయ్యాక ఒరిజినల్ డాక్యుమెంట్స్ కొనుగోలుదారులకు ఎందుకు ఇవ్వడంలేదో ప్రభుత్వం చెప్పాలి.
• ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త రిజిస్ట్రేషన్ విధానానికి సంబంధించిన పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
– టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు
వ్యవస్థల్లో జగన్ రెడ్డి జోక్యం పరాకాష్టకు చేరిందని, మైనింగ్..రిజిస్ట్రేషన్..ఎక్సైజ్ శాఖల వంటి ఆదాయార్జన శాఖలను కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని, 01-04-2022 నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో ఎందుకూ పనికిరాని మార్పులు చేసిన ప్రభు త్వం, క్రమక్రమంగా ఆశాఖను చివరకు పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నతీరుగా మార్చింద ని టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే ..
“ జగన్ రెడ్డి ఎప్పుడైతే ప్రజారాజధాని అమరావతిపై తన రాజకీయ కుట్రల పడగ విప్పాడో అప్పటినుంచే రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లద్వారా వచ్చే ఆదాయానికి గండిపడింది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయి.. భూముల క్రయవిక్రయాలు మందగించి, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం దారుణంగా పడిపోవడాని కి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు కూడా కొంతవరకు దోహదం చేశాయి.
పారదర్శకంగా, పకడ్బందీగా జరగాల్సిన రిజిస్ట్రేషన్లను ప్రభుత్వం అపహాస్యంగా మార్చింది
వైసీపీ ప్రభుత్వం 01-04-2022 నుంచి దేశంలో ఎక్కడా లేని విధంగా రిజిస్ట్రేషన్ల వ్యవహారాలను గ్రామ సచివాలయాలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 4,200 పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసే అధికారం కట్టబెట్టింది. గతంలో రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లు అన్నీ ఎంతో పారదర్శకంగా పకడ్బందీగా జరిగేవి. కానీ జగన్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త విధానంతో రిజిస్ట్రేషన్ల వ్యవహారమంతా చిల్లర వ్యాపారంగా మారిపోయింది. రిజిస్ట్రేషన్ల తంతుని సచివాలయ వ్యవస్థకు అప్పగించిన ప్రభుత్వం.. అసలు గ్రామ పంచాయతీ కార్యాయం లో ఉండే సిబ్బంది.. అక్కడి పరికరాలు..ఇతర పరిజ్ఞానం ఎంతవరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమర్థవంతగా నిర్వహిస్తుందని ఆలోచించిందా?
కొనుగోలు.. అమ్మకం దారులతో పనిలేకుండా, వారు ప్రత్యక్షంగా అందుబాటులో లేకున్నా పంచాయతీ కార్యదర్శులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్స్ కూడా తమవద్దే ఉంచుకుంటామని, క్రయ విక్రయ దారులకు కేవలం జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమకు ఇవ్వకుండా, తూతూ మంత్రంగా జరిగే రిజిస్ట్రేషన్లకు ఎంతవరకు చట్టబద్ధత ఉంటుందనే సందేహం ప్రజలకు ఉంది.
సచివాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు సంబంధిం చిన డాక్యుమెంట్స్ ను బ్యాంకులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. గ్రామ సచివాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్లకు ఎంత వరకు చట్టబద్ధత ఉంటుందో ప్రభుత్వం స్పష్టం చేయాలి. కొత్త రిజిస్ట్రేషన్ విధానం పాలకులకే మేలు చేస్తుందని, ప్రజల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ను తనఖా పెట్టి ప్రభుత్వమే రుణాలు పొందుతుందనే ప్రచారం ఎక్కువైంది. ఇలా జరిగే ప్రచారాన్ని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే జగన్ సర్కార్ ఇప్పటికే ప్రభుత్వ భూములు…కార్యాలయాలు.. ప్రభుత్వ అధీనంలోని సంస్థల ఆస్తుల్ని తాకట్టుపెట్టి ఇష్టాను సారం అప్పులు చేసేసింది.
రిజిస్ట్రార్లు చేసే పనిని గ్రామకార్యదర్శులకు అప్పగించిన ప్రభుత్వం.. మున్ముందు ఎమ్మార్వోల అధికారాల్ని కూడా వారికే అప్పగిస్తుందేమో!
రాష్ట్రంలో 294 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే, సంవత్సరానికి 20 లక్షల వరకు రిజిస్ట్రేషన్లు జరిగడమే గొప్ప అయ్యింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో 22 లక్షల నుంచి 24 లక్షల రిజిస్ట్రేష న్లు జరిగాయి. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు తోడు ప్రభుత్వం గ్రామసచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలెట్టడంతో, మొత్తంగా 4,500 రిజిస్ట్రార్ కార్యాలయాలు తయారయ్యాయి. వీటన్నింటిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా యంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.
తమ ఆస్తులు.. భూములు అత్యవసరంగా అమ్ముకోవాల్సిన పరిస్థి తి వచ్చినప్పుడు.. గ్రామసచివాలయాల్లో చేసే చట్టబద్ధం కాని రిజిస్ట్రేషన్ల వల్ల అమ్ము కునే వారికి ఎంతవరకు ఉపయోగం? రిజిస్ట్రార్ చేసే పనిని… గ్రామ కార్యదర్శులకి అప్పగించిన ప్రభుత్వం.. మున్ముందు ఎమ్మార్వోల అధికారాలను కూడా వారికే అప్పగిస్తుందేమో! గ్రామ సచివాలయంలో రికార్డు అసిస్టెంట్ స్థాయి ఉద్యోగికి రిజిస్ట్రేషన్లు అప్పగించడం ఎంతమాత్రం సరైన విధానం కాదు.
ప్రభుత్వం తీసుకుంటున్న అసంబద్ధ నిర్ణయాలను అమలు చేయడం కోసం అడ్డగోలుగా ఐ.ఆర్.ఎస్ స్థాయి అధికారుల్ని నియమిస్తున్నారు. వారి పనితీరు… నిర్ణయాలు.. వ్యవహరాలు ఎలా ఉంటాయో.. వాటి ఫలితాలు ఎలాఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్ట్ ఎవరు చేపట్టారో ….ఇసుక తవ్వకాలు..అమ్మకాలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి. రవాణాశాఖలో మధ్యవర్తుల వ్యవస్థను నిరోధించడానికి టీడీపీ ప్రభుత్వం మొత్తం ఆన్ లైన్ వ్యవస్థను తీసుకొచ్చింది. అది ఇప్పటికీ సక్రమంగానే అమలవుతోంది. అలానే ఈ ప్రభుత్వం కూడా ప్రజలకు సమస్యలు లేని విధానాలు అమలు చేయాలి.
ప్రభుత్వం అమల్లో పెట్టిన కొత్త రిజిస్ట్రేషన్ విధానం విధివిధానాలపై పూర్తి సమాచారంతో తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి
జగన్ ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకొచ్చిన రిజిస్ట్రేషన్ల విధానంపై ఇప్పటికే హైకోర్టులో మూడు రిట్ పిటిషన్లు(రిట్ పిటిషన్ పిల్ నెం160/2023) పడ్డాయి. అవి విచారణకు వచ్చాక ఈ ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఎంతవరకు సమర్థించుకుంటుందో చూడాలి. రిజిస్ట్రేషన్ శాఖలో తీసుకొచ్చిన నూతన మార్పుల్ని ప్రభుత్వం వెంటనే పున:పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి.
క్రయవిక్రయాలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ ను కొనుగోలుదారులకు ఇవ్వకపోవడం మంచివిధానం కాదు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలను ఎందుకు సచివాలయ సిబ్బందికి అప్పగించారో.. ఈ విధానం అమల్లోకి వచ్చాక రాష్ట్రంలో మొత్తం ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో… ప్రభుత్వానికి మొత్తంగా ఎంత ఆదాయం వచ్చిందనే పూర్తి వివరాలతో ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలి.” అని అశోక్ బాబు డిమాండ్ చేశారు.