రిపోర్టు ఫేక్‌… పార్టీ ఫేక్‌… నాయకుడు ఫేక్

వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత
ఫేక్‌ వీడియో ఫేక్‌ రిపోర్టుతో ఆ పార్టీ అనైతిక రాజకీయం
తెలుగుదేశం నాయకులపై చర్య తీసుకోవాలి
కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి
ఆ వీడియోను ప్రచారం చేసిన మీడియాపైనా చర్య తీసుకోవాలి
ఎమ్మెల్సీ పోతుల సునీత డిమాండ్‌

తెలుగుదేశం పార్టీ సిగ్గు, ఎగ్గు లేకుండా ఫేక్‌ వీడియోలు, ఫేక్‌ సర్టిఫికెట్లతో రాజకీయం చేస్తోందని, ఆ పార్టీ, ఆ పార్టీని నడిపే నాయకుడు ఫేక్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత ధ్వజమెత్తారు. ఫేక్‌ వీడియోలతో రాజకీయాలు చేస్తామంటే అవి చెల్లవని టీడీపీని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సంక్షేమ పాలన చూసి కడుపుమంటతో టీడీపీ దుష్టరాజకీయం చేస్తోందని మండిపడ్డారు. వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత గురువారం మీడియాతో మాట్లాడారు. పోతుల సునీత ఏం మాట్లాడారంటే..:

ఇటీవల కాలంలో ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ వీడియోలతో తెలుగుదేశం పార్టీ రాజకీయం చేస్తోంది. ఎంపీకి సంబంధించిన ఒక వీడియోపై ప్రచారంలో ఉన్న రిపోర్టు తాము ఇచ్చింది కాదని అమెరికా ల్యాబ్‌ ప్రకటించింది. అయినా చంద్రబాబునాయుడు తన పార్టీ వారితో ప్రెస్‌మీట్‌లో అడ్డగోలుగా మాట్లాడించాడు. వారు ఒక మృగాల్లా వ్యవహరించారు. ఆరోజు పిచ్చిపిచ్చిగా మాట్లాడిన అనిత, పట్టాభిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

ఓర్చుకోలేక అనైతిక రాజకీయాలు:
ఈ విధంగా అనైతికంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు, నారా లోకేష్‌కు రాష్ట్రంలో మహిళలు బుద్ధి చెప్పక తప్పదు. టీడీపీ నాయకులు ఆ వీడియో పట్టుకుని, చాలా అనైతికంగా, సీఎంకి కనీస గౌరవం కూడా ఇవ్వకుండా మాట్లాడారు. ఇది దారుణం. అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ఎక్కడా లేని విధంగా పరిపాలన చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ని చూసి చంద్రబాబు, లోకేష్‌ ఓర్చుకోలేక పోతున్నారు.
అందుకే ఒక ఫేక్‌ వీడియో సృష్టించి, దాన్ని లండన్‌కు పంపి, తెలుగుదేశం పార్టీకి చెందిన ఐటీడీపీ ద్వారా దాన్ని అప్‌లోడ్‌ చేసి, సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. ఆ తర్వాత ఆ వీడియోను అమెరికాలోని ఒక ల్యాబ్‌కు పంపామని, ఆ వీడియో వాస్తవమని నివేదిక వచ్చిందంటూ చెస్పారు.

ఫేక్‌ పార్టీ. ఫేక్‌ నాయకుడు:
ఇప్పుడు అదే ల్యాబ్, ఆ నివేదిక తాము ఇవ్వలేదని వెల్లడించింది.
ఎక్లిప్స్‌ ల్యాబ్‌ ప్రతినిధి జిమ్స్‌ స్టాఫోర్డ్‌ ఆ మేరకు ఇక్కడి సీఐడీ పోలీసులకు లేఖ పంపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో దుర్మార్గమైన రీతిలో రాజకీయం చేస్తుందన్నది అందరికి అర్ధమవుతుంది. చంద్రబాబు రాజకీయ జీవితమంతా కుట్రలు, కుతంత్రాలే. చంద్రబాబు ఒక ఫేక్‌ నాయకుడు. అది ఒక ఫేక్‌ పార్టీ. ఏ ఎన్నికల్లోనూ ఆయన ఒంటరిగా పోటీ చేయలేదు. ఎప్పుడూ ఎవరో ఒకరితో పొత్తు పెట్టుకుని రాజకీయాలు చేశాడు. ఇప్పుడు కూడా బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్నాడు.
ఇంకా తన స్వార్థ రాజకీయాల కోసం ఇలాంటి ఫేక్‌ వీడియోలు అశ్లీలంగా రూపొందించి, వాటిని సోషల్‌ మీడియలో పోస్ట్‌ చేసి, పదే పదే ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ఉన్నారని కూడా చూడకుండా, ఒక బీసీ నేత, స్వయంగా ఎంపీ అయిన వ్యక్తిపైనే దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ విధంగా సీఎంపై నిందలు మోపుతున్నారు. చంద్రబాబుకు బీసీలంటే గౌరవం లేదు. వారి కోసం ఆయన ఏనాడూ పని చేయలేదు.

మా సీఎం బీసీల పక్షపాతి:
అదే సీఎం వైయస్‌ జగన్‌ బీసీల పక్షపాతి. వారికి అన్ని రంగాలలో ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. రాజకీయ పదవుల్లో కూడా వారికి పూర్తి ప్రాతినిధ్యం కల్పించారు.
సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ప్రజల్లో ఎదిగారు. చిన్న వయసులోనే ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం పని చేస్తున్నారు. రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉన్నారు. అయినా టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ, ప్రభుత్వంపైనా, సీఎంపైనా నిందలు మోపుతున్నారు.

చంద్రబాబుకు మళ్లీ ఓటమి తప్పదు:
మీకు పచ్చ మీడియా ఉందని చెప్పి, ఏ మాత్రం స్పృహ లేకుండా, ఇలాంటి ఫేక్‌ వీడియోలు రూపొందించి, ప్రభుత్వంపైనా, సీఎంపైనా విమర్శలు గుప్పిస్తున్నారు. చివరకు కుప్పంలో కూడా చంద్రబాబు ఓడిపోతున్నారు. స్థానిక మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఆ విధంగా చంద్రబాబు రాజకీయంగా పూర్తిగా కనుమరుగవుతున్నారు.
ఎలాగైనా చంద్రబాబును తిరిగి సీఎం పదవిలో కూర్చోబెట్టాలని ఎల్లో మీడియా దారుణంగా రాతలు రాస్తోంది. అయితే ప్రజలన్నీ గుర్తిస్తున్నారు.
అందుకే చంద్రబాబు ఈ విధంగా ఎంత ప్రచారం చేసుకున్నా, ఆయనకు మేలు జరగదు.

చర్యలు తీసుకోవాలి:
మా పార్టీ ఎంపీపై ఫేక్‌ వీడియో రూపొందించి, దుష్ప్రచారం చేసిన టీడీపీ నాయకులు, సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నాయకులు అనిత, పట్టాభిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. అలాగే ఫేక్‌ వీడియోలను పదే పదే ప్రసారం చేసిన ఎల్లో మీడియా ఛానళ్లు, ఆ పత్రికలపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాం. చట్టం ఎవరికీ చుట్టం కాదు. తన పని తాను చేసుకుపోతుంది. ఈ విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తించాలి.

జ్ఞానోదయం కలగాలి:
ఇప్పటికైనా టీడీపీ నాయకులకు జ్ఞానోదయం కలగాలి. ఇలాంటి ఫేక్‌ వీడియోలతో రాజకీయాలు సాధ్యం కాదు. దేశంలోనే ఉన్నత స్థానంలో సీఎం ఉన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో సీఎం విప్లవాత్మక మార్పులు చేస్తున్నారు. అదే విధంగా నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఆయన నిరంతరం కృషి చేస్తున్నారు.

Leave a Reply