ప్రజలపై మోపుతున్న అదనపు విద్యుత్ ఛార్జీలను తక్షణమే వెనక్కు తీసుకోవాలి

Spread the love

• జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటివరకు 6సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచి, ప్రజలపై రూ.11,611కోట్లభారం మోపాడు
• రాబోయే రెండేళ్లలోకూడా ఈముఖ్యమంత్రి ప్రజలను దోచుకోవడానికి విద్యుత్ ఛార్జీలు పెంచితే, ఆ భారం రూ.20వేలకోట్లు దాటుతుంది
• ఇప్పుడు కనీస విద్యుత్ వినియోగాన్ని 50యూనిట్లనుంచి 30 యూనిట్లకు కుదించి, ముఖ్యమంత్రి పెంచుతున్న ఛార్జీలతో అంతిమంగా నష్టపోతున్నది పేదవారే
– మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు

వైసీపీ ప్రభుత్వం హేతుబద్ధీకరణ అంటూ కనీసవిద్యుత్ వినియోగాన్ని 50యూనిట్లనుంచి 30 యూనిట్లకు కుదించడం పేదలను దోచుకోవడం కోసమేనని, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని పేదలు, సామాన్యులపై రూ.1200కోట్లవరకు భారం పడనుందని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి కిమిడి కళావెంకట్రావు స్పష్టంచేశారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హేతుబద్ధీకరణ పేరుతో హేయమైన చర్యలకు పాల్పడుతోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక 7వసారి విద్యుత్ ఛార్జీలుపెంచడానికి సన్నద్ధమై, రూ.1200కోట్ల భారాన్ని ప్రజలపై మోపడానికి సిద్ధమయ్యాడు. విద్యుత్ ఛార్జీల బాదుడురూపంలో ఈ ముఖ్యమంత్రి ఇప్పటివర కు రూ.11వేల611కోట్లభారాన్ని ప్రజలపైవేశాడు. దానికితోడు ఇప్పుడు హేతుబద్ధీకరణ పేరుతో రాబోయే రెండేళ్లలో రూ.2,400కోట్లు మొత్తం వెరసి రూ.14వేలకోట్లవరకు భారం ఏపీప్రజలపై పడనుంది. అధికారంలేనప్పుడు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానంటూ కోడైకూసిన పెద్దమనిషి, మడమతిప్పను మాటతప్పను అంటూ శపథాలుచేసినవ్యక్తి, మూడేళ్లలోనే 6సార్లు విద్యుత్ ఛార్జీలుపెంచాడు.

తాజాగా 7వసారి పెంచడానికి సిద్ధమయ్యాడు. కరోనాకు కూడా భయపడని ప్రజలు, జగన్ బాదుడుదెబ్బకు బెంబేలెత్తుతున్నారు. కరోనావల్ల ఇప్పటికే కుదేలైనప్రజానీకాన్ని, జగన్మోహన్ రెడ్డి విద్యుత్ షాక్ లతో హడలెత్తించడానికి సిద్ధమయ్యాడు. 30 యూనిట్లవాడకాన్ని కనీసవిద్యుత్ వినియోగంగా దేశంలో

ఏప్రభుత్వమూ ప్రామాణికంగా తీసుకోలేదు. 30యూనిట్లు దాటితే యూనిట్ రూ.1.45పైసలుగా ఉన్న యూనిట్ విద్యుత్ ధర ఆటోమేటిగ్గా రూ.2.80పైసలు అయ్యేలా ఈ ప్రభుత్వం సిస్టమ్ ని మార్చేసింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువలో తక్కువగా ప్రతిఇంట్లో రెండులైట్లు, రెండుఫ్యాన్లు ఉంటున్నాయి.

పేదలుకూడా నెలకు100యూనిట్ల వరకుఅవుతుంది. 30 యూనిట్లు దాటితో ప్రతిపేదవాడు తనకుతెలియకుండానే రూ.2.80పైసల స్లాబ్ లోకి వెళ్లిపోతున్నాడు. ముఖ్యమంత్రి పెంచుతున్న విద్యుత్ ఛార్జీలు, ఆయన చెబుతున్న హేతుబద్ధీకరణకు అంతిమంగా బలవ్వబోతోంది పేదలు, సామాన్యులే. విద్యుత్ ఛార్జీలుపెంచడానికే ముఖ్యమంత్రి ఏపీఈఆర్ సీని వాడుకుంటన్నట్టుగా ఉంది. ప్రజలతరుపున వ్యవహరించాల్సిన సంస్థతో ప్రతిసారి మమ అనిపించి, పాలకు లు ఇష్టానుసారం విద్యుత్ ఛార్జీలపెంచుతున్నారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఈప్రభుత్వం తెచ్చిన అప్పుతాలూకా రూ.26వేలకోట్లను ఈప్రభుత్వం దేనికి వినియోగించిందో చెప్పాలి. ఒక్కసారి నమ్మినపాపానికి ప్రజలను జగన్మోహన్ రెడ్డి రాచిరంపానపెడుతున్నాడు. ఆయనవైఫల్యాలను, ప్రజలపై మోపుతున్నభారాలను ప్రశ్నించేవారిపై కేసులుపెడుతూ రాక్షసానందం పొందుతున్నాడు. సాధారణ విద్యుత్ వినియోగాన్ని 50 యూనిట్లనుంచి 30 యూనిట్లకు కుదించిన ముఖ్యమంత్రి, అంతిమంగా సామాన్యులు, పేదలను దోచుకోవడానికే సిద్ధమయ్యాడు. జనం ముఖ్యమంత్రిని నమ్మినందుకు ప్రతిఫలంగా, ఆయన వారిపై వివిధరకాల పన్నులు, ఛార్జీలు వేసుకుంటూ పోతున్నాడు. ముఖ్యమంత్రి దోపిడీ, బాదుడుపై ప్రజలే ఆయన్ని నిలదీయాలని కోరుతున్నాం.

హేతుబద్దీకరణ పేరుతో హేయమైనచర్యలకు పాల్పడకుండా, ముఖ్యమంత్రి పెంచిన, రూ.1200 కోట్లవిద్యుత్ ఛార్జీల పెంపుని తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కనీసవిద్యుత్ వినియోగాన్నికూడా 50యూనిట్లకే పరిమితం చే యాలని కోరుతున్నాం. ఇప్పుడు పెంచిన రూ.1200కోట్లతోకలిపి, రాబోయే రోజుల్లో కూడా వివిధకారణాలతో జగన్మోహన్ రెడ్డి వివిధరూపాల్లో విద్యుత్ ఛార్జీలుపెంచితే రూ.20వేలకోట్లవరకు భారం ప్రజలపై పడనుంది.

ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సహా, అన్నిరకాల నిత్యావ వసరాల ధరలు విపరీతంగా పెంచేశారు. మరలా విద్యుత్ ఛార్జీలరూపంలో వారి మెడలకు గుదిబండలు వేలాడదీస్తున్న వైసీపీప్రభుత్వ విధానాలపై, బాధ్యతగల ప్రతిపక్షంగా టీడీపీ పోరాడుతుంది.

Leave a Reply